పటాన్‌చెరు మండలం ఇస్నాపూర్‌లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు పిల్లలు కనిపించకుండా పోయారు.
పటాన్‌చెరు (హైదరాబాద్): పటాన్‌చెరు మండలం ఇస్నాపూర్‌లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు పిల్లలు కనిపించకుండా పోయారు. ఇస్నాపూర్‌లో నివసిస్తున్న సురేష్ కుమారుడు సుఖలేష్, సుగునాథ్ కుమారుడు కృష్ణతో పాటు మరో బాలుడు హరి కలసి బుధవారం మధ్యాహ్నం మూడు గంటలకు ఆడుకుంటామంటూ ఇంటి నుంచి బయటకు వెళ్లారు.
సాయంత్రమైనా వారు తిరిగి రాలేదు. సురేష్, సుగునాథ్‌లు అన్నదమ్ములు కాగా హరి వారి సోదరి కుమారుడు. ముగ్గురూ 14 ఏళ్లలోపు వారే. బంధువుల వద్ద విచారించినా వారి జాడ దొరకలేదు. దీంతో పటాన్‌చెరు పోలీసులను ఆశ్రయించారు.