
పరిశ్రమ నుంచి ఎగసిపడుతున్న మంటలు
సాక్షి, హైదరాబాద్: పటాన్‌చెరు పారిశ్రామికవాడలో మంగళవారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం జరిగింది. స్థానిక అగర్వాల్ రబ్బరు పరిశ్రమలో షార్ట్ సర్క్యూట్ జరగడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. దీంతో కిలోమీటర్ల మేర దట్టమైన పొగలు వ్యాపించాయి. పరిశ్రమ నుంచి వస్తున్న పేలుడు శబ్దాలతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురువుతున్నారు.
సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. 5 అగ్నిమాపక యంత్రాల సాయంతో మంటలను ఆర్పే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే బలమైన ఈదురు గాలులు వీస్తుండటంతో మంటలను అదుపు చేయడానికి సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. ఈ ప్రమాదంలో కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు భావిస్తున్నారు. మూడు నెలల కిందట దీనికి సంబంధించిన గోదాంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదం తట్టుకోలేక కంపెనీ చైర్మన్ గుండెపోటుతో మృతిచెందారు.
Comments
Please login to add a commentAdd a comment