పటాన్‌చెరు: మండల పరిధిలోని రుద్రారంలో గీతం యూనివర్సిటీ విద్యార్థులు పేదల కోసం ఉచిత వైద్య శిబిరాన్ని శనివారం నిర్వహించారు. గీతం ఎన్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో మహేశ్వర మెడికల్ కాలేజీ సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం కొనసాగింది. ప్రాథమిక వైద్య సేవలను నిర్వహించి ఉచితంగా మందులను, సలహాలను అందించారు.
గీతం ఎన్‌ఎస్‌ఎస్ విభాగాధిపతి డాక్టర్ పీవీ నాగేంద్రకుమార్ మాట్లాడుతూ మొత్తం 30 మంది విద్యార్థులు ఈ వైద్య శిబిరాన్ని నిర్వహించారని తెలిపారు. గ్రామస్తులు వైద్య శిబిరాన్ని చక్కగా సద్వినియోగించుకున్నారని తెలిపారు. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి మందులు అందించామన్నారు. ఈఎన్‌టీ, ఆప్తాలమాలజీ, గైనకాలజీ, పీడియాట్రిక్ డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారని తెలిపారు. గీతం ఆధ్వర్యంలో మరిన్ని సేవలు సమాజానికి అందిస్తామన్నారు.