geetham university
-
బాబు.. గీతం భూములపై శ్వేతపత్రం ఎక్కడ?: మేరుగు నాగార్జున
సాక్షి, తాడేపల్లి: కేవలం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై నిందలు మోపడానికే చంద్రబాబు శ్వేతపత్రం విడుదలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి మేరుగు నాగార్జున. రాష్ట్రంలో కబ్జాలు చేసిన వాళ్లే మళ్లీ నీతులు చెబుతున్నారని విమర్శించారు.కాగా, మాజీ మంత్రి మేరుగు నాగార్జున తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘చంద్రబాబు కేవలం అబద్ధాలతో కాలం గడుపుతున్నారు. చంద్రబాబు ఆస్థాన మీడియా ఇష్టం వచ్చినట్టు రాసింది. గీతం కాలేజీ భూములపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మాట్లాడటం లేదు?.38 ఎకరాల ప్రభుత్వ భూమిని గీతం యాజమాన్యం ఆక్రమించుకుంది. మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. ఆక్రమించుకున్న భూములను మా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. కేవలం వైఎస్ జగన్‌పై నిందలు వేయడానికే చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేస్తున్నారు. అవినీతిపై ఒక్క ఆధారం కూడా చూపించలేకపోయారు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రం ఆయన హయాంలో జరిగిన దోపిడీలాగే ఉంది. విశాఖలోని దసపల్లా భూములు ప్రభుత్వానివి కాదని సుప్రీంకోర్టే చెప్పింది. అయినాసరే దానిపై కూడా చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేశారు. టీడీపీ ఆఫీసు కూడా ఆక్రమిత స్థలంలో కట్టారు. గీతం కాలేజీలో భూములను ఆక్రమించుకుంటే ఎల్లోమీడియా ఎందుకు రాయలేదు?. గీతం భూములపై టీడీపీ నేతలు చర్చకు రాగలరా?పేదల ఇళ్ల కోసం వైఎస్ జగన్ వేలాది ఎకరాలను ఇచ్చారు. రాజధానిలో 52 వేల మందికి ఇళ్ల స్థలాలు ఇస్తే కోర్టులకు వెళ్లి ఆపేయించారు. పేదలకు ఇళ్ల ఇచ్చిన స్థలాలలో ఇళ్లు కట్టించే దమ్ము చంద్రబాబుకు ఉందా?. ఇసుక గురించి మరోసారి చంద్రబాబు అబద్దాలు చెప్పారు. 2014-19 మధ్యలో కరకట్ట మీద చంద్రబాబు ఇంటి పక్కనే ఇసుక దోపిడీ చేయలేదా?. నేడు ఉచిత ఇసుక పేరుతో ముక్కు పిండి డబ్బు వసూలు చేస్తున్నారు. అప్పట్లో వనజాక్షి అనే తహశీల్దారుపై మీ ఎమ్మెల్యే దాడి చేయలేదా?. వారి విషయంలో చంద్రబాబు రాజీ చేయలేదా?.నాగావళి, కృష్ణా, గోదావరిలో ఇసుక దోపిడీ చేసింది టీడీపీ నేతలే. ఎన్జీటీ సైతం వంద కోట్ల పెనాల్టీ వేసింది చంద్రబాబు హయాంలోనే కదా. రూ.3,825 వేల కోట్లు మా హయాంలో ప్రభుత్వానికి వచ్చింది. మా ప్రభుత్వ హయాంలో ఇసుక అక్రమ రవాణా చేసిన వారిపై కేసులు పెట్టాం. వర్షాకాలంలో ఉపయోగపడేలా ఇసుక నిల్వలు పెడితే వాటిని టీడీపీ నేతలు అక్రమంగా అమ్ముకున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్టు ఎప్పటికైనా అమలు చేయాల్సిందే. కానీ, దానిపై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేసి ఎన్నికలలో లబ్ది పొందారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చట్టం అది, రాష్ట్రానికి సంబంధం లేదు. ఆ చట్టం తప్పు అయితే కేంద్రతో మాట్లాడి అక్కడే ఆపేయించాలి’ అని డిమాండ్ చేశారు. -
విద్యుత్ సంస్కరణలకు నేనే మార్గదర్శిని
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: అప్పట్లో తాను విజన్ 2020 రూపకల్పన చేస్తే తనను అందరూ 420 అంటూ ఎద్దేవా చేశారని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఎన్. చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. తన విజన్ 2020 వల్లే హైదరాబాద్ అభివృద్ధి చెందిందన్నారు. సంగారెడ్డి జిల్లా రుద్రారంలోని గీతం యూనివర్సిటీలో జరిగిన స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ తొలి గ్రాడ్యుయేషన్ వేడుకకి ఆయన ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. దేశంలో వచ్చిన పలు ఆర్థిక సంస్కరణలకు తానే కారణమని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా విద్యుత్ సంస్కరణకు తానే మార్గదర్శినన్నారు. తాను తెచ్చిన సంస్కరణల వల్ల ఇప్పుడు దేశంలో విద్యుత్ రంగం అభివృద్ధి చెందిందన్నారు. అదేవిధంగా టెలికాంలోనూ సంస్కరణలు తేవాలని నాటి ప్రధాని వాజ్‌పేయ్‌కు చెప్పానని చెప్పుకున్నారు. ఇక తాను రూపకల్పన చేసిన పాలసీల కారణంగానే హైటెక్ సిటీ, ఔటర్ రింగ్ రోడ్డు, జినోమ్ వ్యాలీ, గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టులు వచ్చాయని చెప్పారు. జినోమ్ వ్యాలీలోనే ఇప్పుడు కరోనాకు వ్యాక్సిన్ ఉత్పత్తి జరుగుతోందన్నారు. డిజిటల్ కరెన్సీతో ఎన్నికల్లో డబ్బు ప్రవాహానికి చెక్ రూ.500, రూ.2 వేల పెద్ద నోట్లను రద్దు చేయడం ద్వారా దేశంలో నల్లదనం ప్రవాహం, అవినీతిని రూపుమాపవచ్చని చంద్రబాబు అన్నారు. డిజిటల్ కరెన్సీతో ఎన్నికల్లో ఓటర్లకు డబ్బులు పంపిణీ వంటి అవినీతికి అడ్డుకట్ట పడుతుందని చెప్పారు. పబ్లిక్, ప్రభుత్వం, ప్రైవేట్, పార్టనర్ షిప్ (పీ–4)తో వేగంగా ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. తాను అప్పట్లో ప్రైవేట్, పబ్లిక్, పార్ట్నర్షిప్ (పీ–3) పాలసీతోనే తాను హైటెక్ సిటీని నిర్మించానన్నారు. బయోటెక్నాలజీకి సంబంధించి అప్పట్లో బిల్‌గేట్స్ తనకు చెప్పారని గుర్తు చేశారు. కార్యక్రమంలో గీతం యూనివర్సిటీ చాన్స్‌లర్ వీరేందర్‌సింగ్ చౌహాన్, ప్రెసిడెంట్ ఎం.శ్రీభరత్, వీసీ ప్రొఫెసర్ దయానంద సిద్దవటం, ప్రొఫెసర్ జయశంకర్ తదితరులు పాల్గొన్నారు. -
సిబ్బందికి మేనేజ్మెంట్ డెవలప్మెంట్ ప్రోగ్రాం
న్యూఢిల్లీ: భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా సిబ్బందిని తీర్చిదిద్దుకోవడంపై ఔషధ రంగ దిగ్గజం అరబిందో ఫార్మా దృష్టి సారించింది. ఇందులో భాగంగా లీడర్షిప్, మేనేజ్మెంట్ నైపుణ్యాలను పెంపొందించుకోవడంతో పాటు మార్కెట్లో ట్రెండ్లపై పట్టు సాధించేలా ఉద్యోగుల కోసం శిక్షణా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఇందుకోసం గీతం యూనివర్సిటీతో జట్టుకట్టింది. ’ఫోర్ పిల్లర్స్ ఫర్ ఫ్యూచర్ రెడీ మేనేజర్స్’ పేరిట మేనేజ్మెంట్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో 27 మంది ఉద్యోగులకు శిక్షణ కల్పిస్తోంది. వైజాగ్ క్లస్టర్‌లోని మేనేజర్ నుంచి డిప్యూటీ జనరల్ మేనేజర్ స్థాయి వరకూ వివిధ హోదాల్లో ఉన్న సిబ్బంది దీని కోసం ఎంపికయ్యారని అరబిందో ఫార్మా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (హెచ్ఆర్) యూఎన్‌బీ రాజు తెలిపారు. నెలకు రెండు శనివారాలు చొప్పున నాలుగు నెలల పాటు ఈ శిక్షణ ఉంటుందని వివరించారు. భవిష్యత్‌లో కొత్త హోదాలు, బాధ్యతలను నిర్వర్తించేందుకు కావాల్సిన సామర్థ్యాలను సంతరించుకోవడానికి ఉద్యోగులకు ఇది తోడ్పడగలదని రాజు పేర్కొన్నారు. -
వెలుగులోకి గీతం అక్రమాల చిట్టా
సాక్షి, అమరావతి : విశాఖలోని గీతం యాజమాన్యం తిరు చూసి జనం ఇదో అబద్ధాల పుట్ట అనుకుంటున్నారు. ఏమాత్రం కూడా విద్యా సంస్థ పాటించాల్సిన నియమాలు ఎక్కడ పాటించలేదు. అన్నింటా తప్పుడు సమాచారంతోనే కోట్లాది రూపాయలు ఆర్జించింది. చివరికి వ్యవస్థాపకుల దహన ప్రక్రియకు ప్రభుత్వ భూమి అడ్డగోలుగా తీసుకోంది. విశాఖ భీమిలి బీచ్ రోడ్లో రిషికొండ ఎదురుగా 1981లో మొదలైన ఈ విద్యా సంస్థ ఆరంభం నుంచి ప్రభుత్వ భూములను పైనే ఆధారపడి ఉంది. అప్పుడే మార్కెట్ ధరకు 71 ఎకరాల భూమిని తీసుకున్న గీతం యాజమాన్యం విశాలమైన విద్యాసంస్థలు అంచెలంచెలుగా విస్తరించింది. ఉత్తరాంధ్రలో ఎక్కడా లేని విధంగా 71 ఎకరాల భూమిని తీసుకున్నప్పటికీ గీతం యాజమాన్యం ప్రభుత్వ భూమి పై మక్కువ తగ్గించుకోలేదు. విద్యా సంస్థ ప్రహరీ గోడ గేటు కూడా ప్రభుత్వ భూమిలోనే నిర్మించింది. ఎగిరే కాలేజీకి ఆనుకుని ఉన్న కొండ స్థలాన్ని కూడా కొంత మింగేసింది. టీడీపీతో అనుబంధం.. ఫార్మసీ మెకానికల్ విభాగాలతో పాటు సివిల్ విభాగంలో కొంత భాగం ప్రభుత్వ భూమి లోనే కొనసాగిస్తున్నట్టు స్థానికులు పేర్కొంటున్నారు. ఇదే విషయాన్ని ఎంపీ విజయసాయి రెడ్డి కేంద్ర మంత్రి అలాగే యూజీసీ చైర్మన్ కు రాసిన లేఖలో కూడా ప్రస్తావించారు. తెలుగుదేశం పార్టీ తొలినాళ్ల నుంచి గీతం యూనివర్సిటీ వ్యవస్థాపకులు ఎంవీవీఎస్ మూర్తి అనుబంధం కొనసాగిస్తూ వచ్చారు. గీతం యూనివర్సిటీ మౌలిక సదుపాయాలు ఇతర అంశాలు అధికార పార్టీ సహాయం చాలావరకు పొందారు. అందులో భాగంగానే కొంతవరకు ఆ రోజుల్లో బీచ్ వెంబడి విశాలమైన రోడ్డు నిర్మాణం జరిగింది. ఎండాడ నుంచి రిషి కొండ వరకు వంద అడుగుల నిర్మాణాన్ని కూడా అంకురార్పణ జరిగింది. ముఖ్యంగా గీతం యూనివర్సిటీ ఒక ఖరీదైన యూనివర్సిటీ గా కనిపించే రీతిన ప్రభుత్వ విభాగాల సహాయంతో పనులు జరిగాయి. అందులో భాగంగానే గీతం యూనివర్సిటీ ఎదురుగా ఓ అందమైన బస్ స్టాప్ కూడా కూడా ఊడా నిధులతో నిర్మాణం జరిగింది. ఇలా ఉండగా ఇటీవల వరుసగా వచ్చిన ఫిర్యాదులపై ఏపీ ప్రభుత్వం చేపట్టిన స్పెషల్ డ్రైవ్ లో భాగంగా గీతం యాజమాన్యం భూములను పరిశీలించింది. ఆ సందర్భంగా 40 ఎకరాలు పైబడి భూమి ప్రభుత్వానికి ఇచ్చింది తన ఆధీనంలో గీతం యాజమాన్యం ఉంచుతున్నట్టు గుర్తించడం జరిగింది. ఇది ఒక గొప్ప పరిణామంగా మధురవాడ పరిసర ప్రాంత ప్రజలు పేర్కొంటున్నారు. గీతం 2 ప్రాంగణాల్లో ఇంజినీరింగ్ మెడికల్ విద్యాసంస్థలను కొనసాగిస్తుంది. ఆ క్రమంలో పది ఎకరాలు ఇంజనీరింగ్ విభాగంలో 30 ఎకరాలు మెడికల్ కాలేజీ ప్రాంగణంలో ఉన్నట్టు విచారణలో వెల్లడైంది. ఈ దశలో మెడికల్ కాలేజీ అనుమతులకు గీతం యాజమాన్యం పొందుపరిచిన డాక్యుమెంటులో కచ్చితంగా తప్పుడు సమాచారం ఉంటుందని స్థానికులు అనుమాన పడుతున్నారు.. ఫీజులు వసూలు చేయడంలో దిట్ట వాస్తవానికి గీతం యాజమాన్యం మొదటి నుంచి కూడా లక్ష రూపాయల ఫీజులు వసూలు చేయడంలో దిట్ట. ఏ మాత్రం పూర్తి సమాచారం గాని నిబంధనలను గాని ప్రజలకు బహిర్గతం చేయలేదు కేవలం నిర్ణయించిన ఫీజును చెల్లించ డమే మార్గమన్నట్టు గీతం యాజమాన్యం వ్యవహరించింది. స్థానికులకు ఒక్క పైసా కూడా ఫీజులో రాయితీ ఇవ్వలేదని మధురవాడ పరిసర వాసులు పేర్కొంటున్నారు. అనుమతులు విషయంలో తప్పుడు సమాచారం ఇవ్వడంలో గీతం యాజమాన్యం మొదటి నుంచి పెద్ద చేయగా కొనసాగుతోంది. ముఖ్యంగా deemed to be యూనివర్సిటీగా అనుమతులు పొందడానికి కచ్చితంగా యాజమాన్యం తన భూమి హక్కుల పత్రాలను బహిరంగ పరచాలి.కానీ గీతం యాజమాన్యం ఆ తరహాలో ఎప్పుడు కూడా వ్యవహరించలేద నీ స్థానికులు చెబుతున్నారు. విద్యార్థుల నుంచి లక్షల రూపాయల్లో ఫీజులు వసూలు చేసే యాజమాన్యం క్రమశిక్షణ అమలు చేయడంలో ఏమాత్రం కూడా బాధ్యత వహించే లేదని కూడా అంటున్నారు ఇదంతా ఒక ఎత్తు అయితే దాదాపు 40 ఎకరాల ప్రభుత్వ భూమిని రెండు దశాబ్దాలుగా తన ఆధీనంలో ఉంచుకున్న గీతం యాజమాన్యం వ్యవస్థాపకులు ఎంవీవీఎస్ మూర్తి అంత్యక్రియలకు కూడా ప్రభుత్వ భూమిని సంపాదించింది. అప్పటి టిడిపి ప్రభుత్వం ఓ ప్రత్యేక జీవో ద్వారా 500 పైగా గజాల భూమిని వ్యవస్థాపకులు ఎంబీబీఎస్ మూర్తి సమాధి కోసం కేటాయించారు. అప్పటికే 71 ఎకరాలు మార్కెట్ ధరకు తీసుకోవడమే కాక 40 ఎకరాలు భూమి అనధికారికంగా అనుభవిస్తున్న గీతం యాజమాన్యం మరో 500 గజాలు అంత్యక్రియలు పేరిట ప్రభుత్వ స్థలాన్ని తీసుకోవడం దారుణమని అప్పట్లో ప్రజా సంఘాలు ఫిర్యాదులు కూడా చేశాయి. ఇవన్నీ పట్టణ గీతం యాజమాన్యం ఎండ రోడ్లో వంద అడుగుల మాస్టర్‌ప్లాన్ రోడ్డు కిందగా ఓ సబ్ వే సొరంగ మార్గాన్ని కూడా నిర్మించుకుంది. గంజాయ్, ఓపియం డ్రగ్స్, స్పీడ్ డ్రైవ్ ఇంతగా నిబంధనలు తుంగలో తొక్కినా జీవీఎంసీ.. రెవెన్యూ అధికారులు అప్పట్లో నోరు మెదప లేకపోయారు. అధికార పార్టీ ఒత్తిడికి భయపడి చాలామంది ఆ ప్రాంతంలో తాసిల్దార్ గా పని చేయడానికి కూడా ఇష్టపడలేదు. ఇలా ఉండగా గీతం యాజమాన్యం కేవలం భూమి అక్రమాలు మాత్రమే కాకుండా నిబంధనలు అమలులో కూడా చాలావరకు తప్పిదాలు చేసినట్టు కనిపిస్తుంది. ఉద్యోగ నియామకాలు ఏమాత్రం కూడా రూల్ ఆఫ్ రిజర్వేషన్లు పాటించలేదు. ఇక గీతంలో ఫీజు లే ప్రధానంగా కొనసాగే యాజమాన్యం విద్యార్థుల ప్రవర్తన పై దృష్టి పెట్టకపోవడంతో పది కేసుల్లో నిందితులుగా కూడా విద్యార్థులు కొనసాగారు. గంజాయ్ ..ఓపియం డ్రగ్స్... స్పీడ్ డ్రైవ్ ఇలాంటి తప్పిదాలు చేయడంలో గీతం విద్యార్థులకు ఓ ప్రత్యేక ముద్ర కూడా ఉంది. విద్యార్థుల భవిష్యత్తు కూడా అగమ్యగోచరం ఇక గీతం హాస్టల్స్ వ్యవహారంలో చాలావరకూ ఆరోపణలు ఉన్నాయి గతంలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నప్పటికీ దాన్ని బయట పడకుండా పూర్తిస్థాయిలో కప్పే ప్రయత్నం చేసింది. ఇలా గీతం యాజమాన్యాల తప్పిదాల చిట్టా పరిశీలిస్తే చాలావరకు కనిపిస్తాయి. భూ అక్రమాలకు మాత్రమే కాక ఆర్థిక నేరాల కూడా గీతం యాజమాన్యం పాల్పడిందని ప్రజా సంఘాల నాయకుడు జీటీ రామారావు ,హోంమంత్రి సుచరిత కూడా తాజాగా ఫిర్యాదు చేశారు. ఇలా గీతం యజమాన్యం తప్పిదాల పై తప్పిదాలు చేస్తూ ఇప్పుడు ప్రభుత్వం చర్యలతో అంధకారంలోకి వెళ్ళింది. ఇప్పుడు అక్కడ చదువుతున్న విద్యార్థుల భవిష్యత్తు కూడా అగమ్యగోచరంగా మారుతోందని స్థానికులు అంటున్నారు. -
‘భూ కబ్జాలపై చట్టం తన పని తను చేసుకుంటుంది’
సాక్షి, విశాఖపట్నం: గీతం యూనివర్సిటీ భూ కబ్జాలపై చట్టం తన పని తాను చేసుకుపోతుందని మడుగుల ఎమ్మెల్యే, ప్రభుత్వం విప్ ముత్యాల నాయుడు పేర్కొన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రభుత్వం నుంచి ఆక్షేపణ వస్తే కోర్టులకు వెళ్ళడం పరిపాటిగా మారిందన్నారు. ప్రభుత్వ భూములు అక్రమించుకున్న వారిని ఉపేక్షించేది లేదని, టీడీపీ నాయుకులు పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారని మండిపడ్డారు. పాలనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చాలా పారదర్శకంగా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. టీడీపీకి చెందిన మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేల వ్యవహారం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందని విమర్శించారు. టీడీపీ నాయుకులు అధికారంలో ఉన్నప్పుడు అక్రమాలకు, భూ కబ్జాలకు పాల్పడ్డారని, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్ తన అనుయులకు దోచిపెట్టారని ఆయన పేర్కొన్నారు. -
అభిమానం లేదు, రాజకీయం కోసమే..
-
గీతం చారిటీ సంస్థ కాదు.. సీట్ల కోసం లక్షలు..
సాక్షి, విశాఖపట్నం : గీతం యూనివర్సిటీ యాజమాన్యం మార్కెట్ ధరకు భూములు తీసుకుని, ఆపై కూడా ప్రభుత్వ భూములు ఆక్రమించారని మంత్రి అవంతి శ్రీనివాసరావు అన్నారు. పార్టీలకు అతీతంగా భూ ఆక్రమణలు తొలగించాలని వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. అందులో భాగంగానే విశాఖలో భూ బకాసురులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ అక్రమ భూములు స్వాధీనం చేసుకుంటే టీడీపీ నాయకులు సునామీ వచ్చినట్టు గగ్గోలు పెడుతున్నారు. నిజంగా టీడీపీ నేతలకు గీతంపై అభిమానం ఉంటే అప్పుడు ఎందుకు క్రమబద్దీకరణ చేయలేదు. రుషికొండలో ఎకరం భూమి 20 కోట్ల రూపాయలు ఉంది. 40 ఎకరాలు అంటే 800 కోట్ల రూపాయలు. (టీడీపీలో చిచ్చు రేపిన నారా లోకేష్) ప్రభుత్వం భూమి ప్రభుత్వం తీసుకుంది. చంద్రబాబు నాయుడికి గీతం యాజమాన్యం అంటే అభిమానం లేదు.. కేవలం రాజకీయం కోసమే ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారు. చంద్రబాబుకి అమరావతి ఉంటే చాలు. గీతం చారిటీ సంస్థ కాదు.. సీట్ల కోసం లక్షలు వసూలు చేస్తున్నారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించరు. గీతం యాజమాన్యం స్థానిక రుషికొండ.. ఎందాడ ప్రజలకు ఎప్పుడైనా ఫీజ్ తగ్గించి ఇచ్చారా? గీతం యూనివర్సిటీ భూ ఆక్రమణలపై చర్యల విషయంలో టీడీపీ నాయకులు చేస్తున్న విమర్శలు వెనక్కి తీసుకోవాల’’ని డిమాండ్ చేశారు. -
గీతం వర్సిటీలో ఆక్రమణల తొలగింపు
సాక్షి, విశాఖ : గీతం యూనివర్సిటీలో ఆక్రమణలను రెవెన్యూ శాఖ అధికారులు తొలగించారు. విశాఖ నగర శివారు రుషికొండ సమీపాన పెద్ద ఎత్తున ప్రభుత్వ భూమిని ఆధీనంలో ఉంచుకున్న గీతం యూనివర్సిటీ నుంచి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 40 ఎకరాలు గీతం యూనివర్సిటీ ప్రభుత్వ భూమిని అనుభవిస్తున్నట్లు రెవెన్యూ అధికారుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. దీంతో ఆర్డీవో కిషోర్ పర్యవేక్షణలో రెవిన్యూ సిబ్బంది ఉదయం 6 గంటల నుంచి ప్రభుత్వ భూమిని గుర్తించి వాటిని స్వాధీనం చేసుకునే ప్రక్రియ కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో వర్సిటీకి వెళ్లే మార్గాన్ని పోలీసులు మూసివేశారు. (చదవండి: గీతం ఆక్రమణలకు చెక్) అక్రమాల ‘గీతం’పై ప్రభుత్వం ఆరా.. గీతం విశ్వవిద్యాలయ యాజమాన్యం గుప్పిట్లో 40.51 ఎకరాల ప్రభుత్వ భూములున్నాయని జిల్లా రెవిన్యూ అధికారులు ఇచ్చిన నివేదికపై ప్రభుత్వం దృష్టి సారించింది. గత ప్రభుత్వ హయాంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎండాడ, రుషికొండ పరిసరాల్లోని భూముల్ని ఆక్రమించేసుకుని సంస్థ పరిధిలో కలిపేసుకున్నట్లు రెవిన్యూ అధికారులు గుర్తించారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేపట్టి సవివర నివేదికని ప్రభుత్వానికి మరోసారి అందించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. గీతం పరిధిలో కోర్టు కేసుల్లో ఉన్న భూములు ఏఏ గ్రామాల పరిధిలో ఉన్నాయి.? ఆక్రమణలు ఎంత మేర జరిగాయన్నదానిపై నివేదిక అందించనున్నారు. దీనికి తోడు.. అడ్డగోలుగా.. అప్పటి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి.. విద్యా సంస్థల మధ్యలో అండర్ పాసేజ్ రహదారి నిర్మాణంపైనా అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందించారు. రుషికొండ, ఎండాడ గ్రామాల్లో ఉన్న గీతం ఇంజినీరింగ్ కాలేజ్‌కి మెడికల్ కళాశాలకు అనుసంధానం చేస్తూ సొరంగ మార్గాన్ని నిర్మించేశారు. గత ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి.. ఎలాంటి పూర్తి స్థాయి అనుమతులూ తీసుకోకుండా.. జీవో పేరుతో అండర్ పాసేజ్ నిర్మాణం పూర్తి చేసేశారు. ఈ వ్యవహారంపైనా ప్రభుత్వం దృష్టి సారించింది. -
చట్ట సభల్లో వాడుతున్న భాష సిగ్గు చేటు
సాక్షి, విశాఖపట్నం: చట్టసభల్లో రాజకీయ నాయకులు వ్యవహరిస్తున్న తీరు అసహనాన్ని కలిగిస్తోందని ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు అన్నారు. పార్లమెంట్, అసెంబ్లీ సమావేశాల్లో నాయకులు వాడుతున్న భాష సిగ్గు చేటుగా ఉందని శుక్రవారం పార్లమెంట్లో చోటుచేసుకున్న ఘటనను దృష్టిలో ఉంచుకుని వ్యాఖ్యానించారు. ప్రొఫెసర్ కోనేరు రామకృష్ణ జీవితం ఆధారంగా రచించిన ‘ఏ ఛైల్డ్ ఆఫ్ డెస్టినీ ఆన్ ఆటో బయోగ్రఫీ’ పుస్తకాన్ని విశాఖలోని గీతం విశ్వవిద్యాలయంలో శనివారం ఆవిష్కరించారు. వెంకయ్య మాట్లాడుతూ.. అమ్మ, అక్క అనే పదాలు పవిత్రమైనవని, కానీ.. అసెంబ్లీలలో నాయకులు వారిని అవమానించేలా మాట్లాడుతున్నారని, చాలా రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలనీ.. చట్టసభల్లో ప్రజా సమస్యలపై చర్చ జరగాలని ఆకాంక్షించారు. ఇంగ్లిష్ ముఖ్యమే అయినా.. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంగ్లిష్ చదువులు ముఖ్యమే అయినా.. మాతృ భాషను విస్మరించొద్దని ఉప రాష్ట్రపతి సూచించారు. తనకు కాన్వెంట్ అంటే ఏంటో తెలీదన్నారు. మాతృభాష కళ్లు అయితే.. ఇంగ్లిష్ కళ్లజోడు లాంటిదన్నారు. విద్యావ్యవస్థలో మార్పులు రావాలని, విద్యతో పాటు చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు, వినయం, సంస్కారాన్ని బోధించాల్సిన అవసరం ఉందని అన్నారు. సీఏఏ సహా అన్ని చట్టాలపై దేశవ్యాప్తంగా ప్రజలు అధ్యయనం చేయాలన్నారు. దేశ చట్టసభలు తీసుకున్న నిర్ణయాలపై మాట్లాడే హక్కు పొరుగు దేశాలకు లేదని వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. ఐఎన్ఎస్ డేగాలో గార్డ్ ఆఫ్ ఆనర్ మూడు రోజుల పర్యటనలో భాగంగా శనివారం విశాఖకు వచ్చిన వెంకయ్యకు ఐఎన్ఎస్ డేగాలో తూర్పు నౌకాదళం గార్డ్ ఆఫ్ ఆనర్తో స్వాగతం పలికింది. పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఈఎన్సీ చీఫ్ వైస్ అడ్మిరల్ అతుల్‌కుమార్ జైన్, కలెక్టర్ వినయ్‌చంద్, నగర పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా గౌరవ స్వాగతం పలికారు. అనంతరం వెంకయ్య తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రాన్ని సందర్శించారు. ప్రత్యేక బోటులో హార్బర్లో పర్యటించి, దేశీయ పరిజ్ఞానంతో తయారైన ఐఎన్ఎస్ సహ్యాద్రి యుద్ధనౌకను సందర్శించారు. -
బాలకృష్ణ చిన్నల్లుడి కుటుంబానికి మరో షాక్
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి: టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ చిన్నల్లుడు, గీతం సంస్థల అధినేత ముతుకుమిల్లి భరత్ కుటుంబానికి మరో భారీ షాక్ తగిలింది. వందల కోట్లు రుణాలు తీసుకొని ఎగ్గొడుతుండటంతో తనఖా పెట్టిన ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి బ్యాంకులు సిద్ధమవుతున్నాయి. భరత్ కుటుంబానికి చెందిన యూనిక్ ఇన్ఫ్రాటెక్ కంపెనీ హైదరాబాద్ అబిడ్స్ కరూర్ వైశ్యా బ్యాంకుకు రూ. 124.39 కోట్లు బకాయి పడింది. ఆ రుణాన్ని జనవరి 21, 2020లోగా చెల్లించాలని గతంలో బ్యాంకు నోటీసులు జారీ చేసినప్పటికీ కుటుంబసభ్యులు స్పందించలేదు. దీంతో ఫిబ్రవరి 2న హైదరాబాద్‌లోని ఇంటికి బ్యాంకు నోటీసులు అంటించింది. ఈ రుణానికి హామీగా ఉన్న వారందరికీ కొరియర్, స్పీడ్‌పోస్టుల ద్వారా నోటీసులు జారీ చేయగా కొంతమందికి చేరాయని, అందని వారు బ్యాంకుకు వచ్చి తీసుకోవాల్సిందిగా పేర్కొంది. ఈ రుణానికి ప్రధాన హామీదారునిగా ఉన్న గీతం విద్యాసంస్థల వ్యవస్థాపకుడు ఎంవీవీఎస్ మూర్తి మరణించడంతో ఆయన వారసులైన పట్టాభి రామారావు (భరత్ తండ్రి), లక్ష్మణరావు, భారతీ వరదరాజ్‌లను హామీదారులుగా చేర్చింది. గడువులోగా రుణాలను చెల్లించకపోతే బ్యాంకులో తాకట్టు పెట్టిన విశాఖ జిల్లా గాజువాక మండలం, భీమిలి మండలంలోని భూములను, విశాఖ నగరం డొండపర్తి ప్రాంతంలోని ఆస్తులను స్వాధీనం చేసుకుని వేలం వేస్తామని స్పష్టం చేసింది. గతేడాది అక్టోబర్‌లో భరత్ సహా 11 మంది కుటుంబసభ్యులు, సన్నిహితులకు విశాఖ నగరంలోని ఆంధ్రా బ్యాంకు సీతమ్మధార బ్రాంచ్ డీ ఫాల్టర్ నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే. భరత్‌కు చెందిన సంస్థ మొత్తం రూ. 13.65 కోట్లు బాకీ పడిందని పేర్కొంది. కాగా, భరత్ గత ఎన్నికల్లో టీడీపీ నుంచి విశాఖ ఎంపీ స్థానానికి పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే. బ్యాంక్ జారీచేసిన నోటీసు -
తాత తప్పులే.. చురకత్తులై..!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఎంవీవీఎస్ మూర్తి.. మొదట్లో గోల్డ్‌స్పాట్ మూర్తిగా విశాఖకు పరిచయమైన ఈయన గీతం ప్రైవేటు కళాశాలను పెట్టి.. ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని తూట్లు పొడిచి.. గీతంను డీమ్డ్ వర్శిటీగా విస్తరించి.. చివరికి దేశంలోనే ప్రతిష్టాత్మక ఏయూను దెయ్యాల కొంపగా అభివర్ణించిన పెద్ద మనిషి.. సరే పోయినోళ్లందరూ మంచోళ్లే కాబట్టే.. ఆయన ప్రస్తావన వదిలేద్దామనుకున్నా.. ఆయన చేసిన తప్పులు, అక్రమాలు మాత్రం ఆయన మనుమడు, టీడీపీ ఎంపీ అభ్యర్ధి, బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీ భరత్‌ను వీడటం లేదు. రెండుసార్లు విశాఖ ఎంపీగా పని చేసిన మూర్తి, ఆ పదేళ్ల కాలంలో కేవలం సొంత గీతం కళాశాలకు, రక్తసంబంధీకులైన బంధుగణానికి తప్పించి విశాఖ నగరానికి ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు తెచ్చాను.. అని చెప్పుకొనే స్థాయిలో ఒక్క పనికూడా చేయలేదంటే నమ్మశక్యం కాకున్నా.. పచ్చి నిజం. పైగా తెలుగుదేశం పాలనలో గీతం సంస్థ పేరిట చేసిన భూ ఆక్రమణలు, ఆ వివాదాలు ఇప్పటికీ కోర్టుల్లో నలుగుతున్నాయి. జిల్లాలో కలెక్టర్లుగా పనిచేసిన ఎందరో ఐఏఎస్ అధికారులు.. గీతం ఫైళ్లు.. అనగానే అమ్మో... మేం సంతకం పెట్టలేమంటూ ఇక్కడి నుంచి బదిలీ చేయించుకుని వెళ్ళిపోయారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ఈ ఐదేళ్ల కాలంలోనే ఇక్కడ పనిచేసిన ఓ ఐఏఎస్ అధికారి గీతం ఆక్రమణల క్రమబద్ధీకరణకు సిఫార్సు చేయలేనని తెగేసి చెప్పి.. ఇక్కడి నుంచి కేంద్ర సర్వీసుకు బదిలీ చేయించుకుని వెళ్లిన విషయం ఐఏఎస్ వర్గాలకే కాదు.. అధికారవర్గాలందరికీ తెలిసిన సత్యం. ఇప్పటికీ గీతం ఆక్రమణలోప్రభుత్వ భూములువాటి విలువరూ.500 కోట్లకుపైమాటే ‘ఎల్కేజీ నుంచి పీజీ వరకు కోర్సులున్న శ్రీలంక యూనివర్సిటీ 25 ఎకరాల్లోనే ఉంది. కానీ విశాఖలోని గీతం(గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్) యూనివర్సిటీకి వందల ఎకరాలు కావాలా? అని రాష్ట్ర ఆర్ అండ్ బీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఒక సందర్భంలో చేసిన వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర దుమారం రేపాయి. దేశంలోనే అత్యంత ఖరీదైన విద్యాసంస్థల్లో ఒకటైన గీతం యూనివర్సిటీకి నిజంగానే ఘన చరిత్ర ఉంది. తొలుత పాతిక ఎకరాల్లో ఏర్పాటైన ఈ విద్యాసంస్థ క్రమక్రమంగా ప్రభుత్వ భూములను కబ్జా చేసుకుంటూ 110 ఎకరాల విస్తీర్ణంలో డీమ్డ్ వర్సిటీ స్థాయికి చేరింది. ప్రభుత్వ భూములు కబ్జా చేయడం.. ఆనక ఎలియనేషన్ చేయించుకుని వాటిని సొంతం చేసుకోవడం అప్పట్లో గీతం మూర్తికే చెల్లింది. నేటికీ ఈ సంస్థ అధీనంలో ఉన్న ప్రభుత్వ భూముల వ్యవహారంపై కోర్టుల్లో వివాదం నడుస్తోంది. సంస్థ అధీనంలో ఉన్న 35 ఎకరాల భూములను లీగల్‌గా కైవసం చేసుకునేందుకు అప్పటి కలెక్టర్ ఆరోఖ్యరాజ్ ద్వారా 2012 మే 28న ఎలియనేషన్ ప్రతిపాదనలు పంపించారు. అయితే ఈ ప్రతిపాదనను రెండేళ్ల పాటు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగులో పెట్టింది. అప్పట్లో సీసీఎల్ఎ కార్యదర్శిగా ఉన్న ఐవైఆర్ కృష్ణారావు ఈ ప్రతిపాదనను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. ఎండాడ, రుషికొండ గ్రామాల పరిధిలో ఉన్న ఈ భూములను వివిధ అవసరాల నిమిత్తం ఆరు ప్రభుత్వ శాఖలకు కేటాయిస్తూ 2014 ఫిబ్రవరి 26న ఐవైఆర్ కృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. దళిత విద్యార్థుల కళాశాల, పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్ నిర్మాణం, బలహీనవర్గాల గృహనిర్మాణం, అధికారులకు క్వార్టర్లు, ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ ప్రాంతీయ కేంద్రం.. ఇలా వివిధ ప్రభుత్వ అవసరాలకు ఈ భూములు కేటాయించారు. అయినా గీతం మూర్తి వాటిని వదల్లేదు. అప్పటికే తమ అధీనంలో ఉన్న మరో 7.52 ఎకరాలను కూడా కలిపి మొత్తం భూములను తమ సంస్థకు కేటాయించాలని, ఈ మేరకు సిఫార్సు చేయాలని 2016లో జిల్లా కలెక్టర్ యువరాజ్‌పై ఒత్తిడి తెచ్చారు. యువరాజ్ బదిలీ అయిన తర్వాత గత కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ ద్వారా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఈ ప్రతిపాదనలు రావడమే తరువాయి.. వివిధ శాఖలకు కేటాయిస్తూ గత సీఎస్ తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేసి మరీ ఆ భూములను గీతం కట్టబెట్టేందుకు వీలుగా రాష్ట్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఇక్కడ గజం రూ.25వేల నుంచి రూ.30వేల వరకు పలుకుతుంది. ఈ లెక్కన ఎలియనేషన్ ప్రతిపాదనలు పంపిన 42.52 ఎకరాల భూముల విలువ అక్షరాల రూ.514 కోట్ల పైమాటే. కేబినెట్ ఆదేశాలు, కోర్టు ఉత్తర్వులు ఎలా ఉన్నప్పటికీ ఈ భూములు ఇప్పటికీ గీతం ఆధీనంలోనే ఉండటం గమనార్హం. రాజకీయంగానూ.. రాజకీయంగా కూడా తెలుగుదేశం పార్టీలో గీతం మూర్తి వల్ల లాభపడిన, ప్రయోజనం పొందిన నేతలు కాదు కదా.. కనీసం కార్యకర్తలు కూడా లేరు. కేవలం అధినేత చంద్రబాబునాయుడుకు అత్యంత సన్నిహితుడు, ఆ తర్వాత బంధువు, ఉత్తరాంధ్రలో టీడీపీ మాదే అని భావించే ఓ సామాజిక ‘వర్గ’ పెద్దగా ఓ వెలుగు వెలిగిన గీతం మూర్తి చేసిన సంస్థాగత తప్పులు ఇప్పుడు ఆయన మనుమడిని వెంటాడుతున్నాయనే చెప్పాలి. పార్టీ నాయకులకు కూడా మినహాయింపులేకుండా వారి పిల్లల సీట్లకు ముక్కుపిండి డబ్బులు వసూలు చేసిన ఘనత ఆయనదే. ఆయన వల్ల నష్టపోయిన నేతలు ఇప్పుడు తెరవెనుక పావులు కదుపుతున్నారు. అవన్నీ భరత్‌కు మైనస్‌గా మారుతున్నాయి. కొసమెరుపు ఈ తప్పులు, వ్యవహారాలు, దందాలేవీ భరత్‌కు తెలియకపోవచ్చు. వాటితో తనకు సంబంధం లేదని ఆయన చెప్పుకోవచ్చు కూడా.. కానీ తాత వ్యాపార సామ్రాజ్యాన్ని, రాజకీయాన్ని వారసత్వం పొందిన మనవడు భరత్.. తాతా చేసిన తప్పులనుంచి మాత్రం ఎలా తప్పించుకోగలుగుతారు. ఆస్తులతోపాటు అపఖ్యాతిలోనూ వాటా తీసుకోవాల్సిందే.. ఏమంటారు? -
విశోక గీతం
విద్యార్థిగా ఇక్కడే చదువుకున్నారు.. న్యాయవాదిగా హైకోర్టుకు వెళ్లినా.. కొన్నాళ్లకే తిరిగొచ్చారు. స్వస్థలం తూర్పు గోదావరి జిల్లా అయినా.. విశాఖనే సొంతూరుగా మార్చుకున్నారు.. తన భవిష్యత్తుకు పునాదులు వేసుకున్నారు. వ్యాపార రంగంపై మక్కువతో అక్కడ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. గోల్డ్‌స్పాట్ శీతలపానీయాల డిస్ట్రిబ్యూటర్‌గా ఆ రంగంలో అడుగుపెట్టి గోల్డ్‌స్పాట్ మూర్తిగా విశాఖ ప్రజలకు చిరపరిచితుడిగా మారిన ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి అమెరికాలోని అలస్కా ప్రాంతంలో దుర్మరణం పాలవ్వడం విశాఖను విషాదంలో నింపింది. 80లలో గీతం కళాశాల స్థాపించి దాన్ని డీమ్డ్ యూనివర్సిటీ స్థాయికి తీసుకెళ్లిన ఆయన దానికి అనుబంధం గీతం వైద్య, దంత వైద్య కళాశాలలను కూడా స్థాపించి విద్యాసంస్థల అధినేతగా.. గీతం మూర్తిగా సుప్రసిద్ధులయ్యారు. 1984లో రాజకీయాల్లో ప్రవేశించి రెండుసార్లు విశాఖ ఎంపీగా ఎన్నిక కావడంతోపాటు ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. విశాఖ నగరంతోపాటు ఎదుగుతూ తన సంస్థల ద్వారా కొన్నివేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించిన మూర్తిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించిందని.. ఆయన ఇక లేరని తెలుసుకొని వేలా ది మంది ఆయన సిబ్బంది, ఆప్తులు, సన్నిహితులు కన్నీటిపర్యంతమయ్యారు. ఆయన మృతికి సంతాప సూచకంగా గీతం విద్యాసంస్థలను మూసివేసి నివాళులర్పించారు. సాగర్‌నగర్(విశాఖతూర్పు): ఎమ్మెల్సీ ఎంవీ వీఎస్ మూర్తి విశాఖ వాసులకు గీతం మూర్తిగా సుపరిచితులు. ఈనెల 6న కాలిఫోర్ని యాలో గీతం విద్యాసంస్థల పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొనేందుకు వెళ్లిన మూర్తి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పొందారు. తాను అభిమానించే గాంధీ జయంతి రోజే అనంత లోకా లకు వెళ్లడం యాదృశ్చికంగా జరిగినా విశేషమని సన్నిహితులు అభిప్రాయపడుతున్నారు. మూర్తి ప్రస్థానం ఇలా.. మూర్తి 1938లో తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లి మండలం ఎస్.మూలపాలెంలో మతుకుమిల్లి పట్టాభిరామయ్య, మాణిక్యాంబ దంపతులకు జన్మించారు. ఆయనకు సోదరి వీరరాఘవమ్మ. భార్య సావిత్రిదేవి, వీరికి కుమారులు రామారావు, లక్ష్మణరావు, కుమార్తె భారతి ఉన్నారు. వీరు ప్రారిశ్రామిక రంగంలో పనిచేస్తున్నారు. సావిత్రిదేవి 2009లో కాలం చేశారు. మూర్తి మనవుడు భరత్‌కు సినీనటుడు బాలకృష్ణ చిన కుమార్తె తేజస్వితో వివాహం చేశారు. మూర్తికి దివంగత లోకసభ స్పీకర్ బాలయోగి, మాజీ ముఖ్య మంత్రులు ఎన్టీఆర్, నాదేండ్ల భాస్కరరావు, ప్రస్తుత ముఖ్య మంత్రి చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. విద్యాభ్యాసం సాగిందిలా.. అయినవిల్లి మండలం ఎస్.మూలపాలెంలో మూడో తరగతి వరకు మూర్తి చదివారు. కపిలేశ్వరపురంలో ఎస్ఎస్ఎల్సీ, కాకినాడ పీఆర్ కళాశాలలో ఇంటర్, డిగ్రీ పూర్తి చేశారు. ఆంధ్రా యూనివర్సిటీలో లా చదివారు.డిగ్రీలో ఏయూ నుంచి బంగారు పతకం సాధించారు. ఆర్ధికశాస్త్రంలో పీహెచ్డీ డిగ్రీ పొందారు. మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు, అల్లాడి భాస్కరరావు, నల్లా సత్యనారాయణ, పిల్లా సూర్యనారాయణలతో కలిసి లా ప్రాక్టీస్ చేశారు. 1965లో లక్ష్మీ ఎంటర్ప్రైజెస్ పేరిట వ్యాపారం ప్రారంభించి జిల్లాలోని కాకినాడ, మండపేట, రాజమండ్రి తదితర ప్రాంతాల్లో వ్యాపారాన్ని విస్తరించారు. 1968లో వైజాగ్ బాట్లింగ్ కంపెనీ స్థాపించారు. (గోల్డ్‌స్పాట్ కంపెనీ) అప్పటి నుంచి గోల్డ్ స్పాట్ మూర్తి గా పేరొచ్చింది. 1971 టెక్నో సంచుల ఫ్యాక్టరీ ప్రా రంభించారు. 1978లో టూత్ఫెస్టు ట్రస్టులో చురు కైన పాత్ర పోషించారు. 1980లో గీతమ్ ఇంజినీరింగ్ కళాశాల స్థాపించారు. 2013లో గీతమ్ విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించారు. గీతంను ప్రగతి పథాన నడిపించి గోల్డ్‌స్పాట్ నుంచి గీతం మూర్తిగా మారిపోయారు. రాజకీయ వేత్తగా.. 1991, 1999లో వైజాగ్ ఎంపీగా చేశారు. ఉత్తమ పార్లమెంటేరియన్‌గా ఆయన అవార్డు అందుకున్నారు.ఎన్టీఆర్ సమయంలో వుడా చైర్మన్‌గా పనిచేశారు. విస్తరించిన విద్యాసంస్థలు కేవలం ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో గీతం వర్సిటీ క్యాంప్‌లను అభివృద్ధి చేసి నైపుణ్యంతో కూడిన అంతర్జాతీయ విద్యా ప్రమాణాలు అభివృద్ధి పరిచారు. పుస్తక పఠనం, పుస్తకాలంటే మూర్తికి ఎంతో ఇష్టం. ఇది మూర్తిలోని పట్టుదలకు నిదర్శనమని మూర్తి బంధువులు చెబుతున్నారు. మూర్తికి ఇష్టులైన మహాత్మ గాంధీ, మదర్ థెరిస్సా వంటి మహోన్నుతులు అంటే చాలా ఇష్టం. మహాత్మ గాంధీ పేరుతో గీతంలో ఒక స్టడీ సెంటర్ నెలకొల్పి ఆయనపై పరిశోధన అంశాలను నెలక్పొడం విశేషం. మూర్తి మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. మహాత్మగాంధీ అంటే ఎంతో ఇష్టం డాక్టర్ ఎంవీవీఎస్ మూర్తికి మహాత్మగాంధీ అంటే ఎంతో అభిమానం. ఆయన తన విద్యా సంస్థలకు జాతిపిత పేరు పెట్టుకున్నారు. గీతం విద్యాసంస్థలను గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ పేరుతో ఆయన 1980లో నగర శివారు రుషికొండలో ప్రారంభించారు. నాలుగు దశాబ్దాలుగా గీతం విశ్వవిద్యాలయం, తర్వాత డీమ్డ్ విశ్వవిద్యాలయం వరకు ఎదిగింది. మృత్యువులోనూ వీడని బంధం సాగర్‌నగర్ (విశాఖ తూర్పు): అమెరికాలోని జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో గీతం అధ్యక్షుడు డాక్టర్ మూర్తితోపాటు ఆయన చిరకాల మిత్రుడు వెలువోలు బసవపున్నయ్య కూడా కన్నుమూశారు. పున్నయ్య జర్నలిస్టు, సామాజిక సేవారంగంలో ఉన్నారు. వెలువోలు ట్రస్టు పేరుతో ఆయన అనేక సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. డాక్టర్ ఎంవీవీఎస్ మూర్తికి ఎంతో సన్నిహింగా ఉంటూనే రాజ్యసభ సభ్యుడు టి. సుబ్బరామిరెడ్డితోనూ ఉండటం విశేషం. బసవపున్నయ్య మృతి పట్ల విశాఖలోని జర్నలిస్టు సంఘాలు తమ సంతాపాన్ని ప్రకటించాయి. -
‘గీతం’ అధినేత మూర్తి దుర్మరణం
సాక్షి, విశాఖపట్నం: శాసన మండలి సభ్యుడు, మాజీ ఎంపీ, గీతం విద్యాసంస్థల అధినేత ఎంవీవీఎస్ మూర్తి(80) అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఆయనతోపాటు ప్రయాణిస్తున్న మరో ముగ్గురు సన్నిహితులు కూడా మృత్యువాత పడ్డారు. మూర్తి ఆత్మీయులు, స్నేహితులు అందించిన సమాచారం ప్రకారం.. అమెరికాలోని ఆంకరేజి సిటీ వద్ద ఉన్న వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని సందర్శించేందుకు మూర్తితోపాటు ఆయన మిత్రులు నలుగురు కాలిఫోర్నియా నుంచి పయనమయ్యారు. స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో అలస్కా సిటీ వద్ద డాడ్జ్ వ్యాన్‌లో మూర్తి, ఆయన సన్నిహితులు వెలువోలు బసవపున్నయ్య(78), వీరమాచినేని శివప్రసాద్, వీవీఆర్ చౌదరి(చిన్న), కడియాల వెంకటరత్నం(గాంధీ) వెళ్తున్నారు. వీరు ప్రయాణిస్తున్న వ్యాన్ ముందు వెళ్తున్న ఫోర్డ్ ఎఫ్–150 అనే ట్రక్కును తప్పించబోతుండగా దాన్ని ఢీకొని అదుపుతప్పి పక్కన లోతుగా ఉన్న ప్రాంతంలో బోల్తాపడింది. దీంతో అందులో ఉన్న మూర్తి, బసవపున్నయ్య, శివప్రసాద్, చౌదరిలు చనిపోయారు. తీవ్ర గాయాలపాలైన గాంధీ అలస్కా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వ్యాన్‌ను కొల్గిన్ కొస్కీ అనే యువకుడు నడుపుతుండగా పక్కన 21 ఏళ్ల యువతి, రెండేళ్ల బాలుడు కూడా ఉన్నట్టు తెలిసింది. డ్రైవర్ పక్కన శివప్రసాద్ కూర్చోగా మిగిలిన వారు వెనక సీట్లలో కూర్చున్నారు. ‘గీతం’ పూర్వ విద్యార్థుల సమ్మేళనం కోసం.. ఎంవీవీఎస్ మూర్తి తన సన్నిహితులు వీవీఆర్ చౌదరి, గాంధీలను వెట్టబెట్టుకుని సెప్టెంబర్ 13న విశాఖ నుంచి అమెరికా పర్యటనకు Ððవెళ్లారు. అప్పటికే అమెరికాలో ఉన్న శివప్రసాద్, బసవపున్నయ్యలు మూర్తిని కలిశారు. అక్కడ గీతం పూర్వ విద్యార్థులతో ఈ నెల 6న జరిగే సమ్మేళనంలో మూర్తి ముఖ్య అతిథిగా పాల్గొనాల్సి ఉంది. ఇంతలోనే ఆయన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారన్న వార్త బుధవారం తెల్లారేసరికే తెలియడంతో విశాఖ నగరం నిర్ఘాంతపోయింది. ఎంవీవీఎస్ మూర్తికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కొన్నేళ్ల క్రితం ఆయన భార్య సావిత్రి అనారోగ్యంతో మరణించారు. కుమారులు రామారావు, లక్ష్మణరావు వ్యాపారంలో స్థిరపడ్డారు. కుమార్తె బెంగళూరులో ఉంటున్నారు. ‘గోల్డ్‌స్పాట్’ మూర్తి తూర్పు గోదావరి జిల్లా అయినవిల్లి మండలం మూలపాలెం మూర్తి స్వస్థలం. వ్యాపార నిమిత్తం 1970 దశకంలో విశాఖపట్నానికి వచ్చి స్థిరపడ్డారు. గోల్డ్‌స్పాట్ శీతల పానీయాల కంపెనీని స్థాపించి గోల్డ్‌స్పాట్ మూర్తిగా పేరుగాంచారు. 1984లో టీడీపీలో చేరిన ఆయన అప్పట్నుంచి ఆ పార్టీలోనే కొనసాగుతున్నారు. రెండు పర్యాయాలు విశాఖపట్నం నుంచి లోక్‌సభ సభ్యునిగా గెలిచారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. 1980లో గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్(గీతం) కళాశాలను స్థాపించారు. అనంతరం అది డీమ్డ్ యూనివర్సిటీ స్థాయికి ఎదిగింది. బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో గీతం క్యాంపస్‌లు ఏర్పాటు చేశారు. కలగానే మిగిలిన మంత్రి పదవి మంత్రి పదవి చేపట్టాలన్న చిరకాల కోరిక తీరకుండానే మూర్తి కన్నుమూశారు. రెండు దశాబ్దాల నుంచి ఆయన మంత్రి పదవి దక్కించుకోవాలని ఆరాటపడుతున్నారు. కానీ, మంత్రి పదవి దక్కాలంటే ఎమ్మెల్యే కావాలి. కానీ ఏనాడూ ఆయనకు ఎమ్మెల్యే అయ్యే అవకాశం రాలేదు. 2015లో ఎమ్మెల్సీగా నామినేట్ చేసినప్పుడు ఆయనలో మళ్లీ మంత్రిపై ఆశలు రేకెత్తాయి. కానీ చంద్రబాబు మంత్రివర్గంలో చోటు కల్పించలేదు. సీఎం చంద్రబాబుతో బంధుత్వం ఎంవీవీఎస్ మూర్తికి ముఖ్యమంత్రి చంద్రబాబుతో సన్నిహిత బంధుత్వం ఉంది. ముఖ్యమంత్రి వియ్యంకుడు, సినీనటుడు నందమూరి బాలకృష్ణ రెండో కుమార్తెను మూర్తి మనవడు భరత్‌కు ఇచ్చి వివాహం చేశారు. అలాగే మాజీ ఎంపీ కావూరి సాంబశివరావుకు కూడా మూర్తి వియ్యంకుడే. మూర్తి మృతదేహం వద్దకు మనవడు మూర్తి సన్నిహితుడు, విశాఖకు చెందిన దాసరి వెంకటేశ్వరరావు డెట్రాయిట్లో ఉంటున్నారు. ఆయన బుధవారం రాత్రి ‘సాక్షి’కి ఫోన్లో అక్కడి పరిస్థితిని వివరించారు. ‘‘షికాగోలో ఉన్న మూర్తి మనవడు (చిన్న కుమారుడు లక్ష్మణరావు కొడుకు) ప్రమాద వార్త తెలియగానే అలాస్కాకు బయలుదేరాడు. అక్కడి ఆస్పత్రిలో వీరి మృతదేహాలను ఉంచారు. అమెరికా నిబంధనల ప్రకారం మృతదేహాలను వారి బంధువులు గుర్తించాల్సి ఉంటుంది. మూర్తి మనవడు ఆస్పత్రికి వెళ్లి గుర్తించాక పోస్టుమార్టం చేస్తారు. అనంతరం మృతదేహాలను భారత్‌కు పంపుతారు’’ అని తెలిపారు. భౌతికకాయం 7న విశాఖకు! ఎంవీవీఎస్ మూర్తి భౌతికకాయాన్ని ఈ నెల 7న విశాఖ నగరానికి తీసుకొచ్చే అవకాశం ఉంది. పోస్టుమార్టం అనంతరం భారత్‌కు పంపే ప్రక్రియ పూర్తి కావడానికి మరో రెండు రోజులు పట్టనుంది. దీన్నిబట్టి ఈ నెల 7న ఆదివారం నాటికి ఆయన పార్థివదేహం రావచ్చని భావిస్తున్నారు. మూర్తి విశాఖ నగరంలోని సిరిపురంలో నివాసం ఉంటున్నారు. బుధవారం ఉదయం మూర్తి దుర్మరణం వార్త తెలియగానే ఆయన కుమారులు రామారావు, లక్ష్మణరావులు హుటాహుటీన ఆయన ఇంటికి వచ్చారు. పలువురు ప్రజాప్రతినిధులు, అభిమానులు, అధికారులు అక్కడికి చేరుకున్నారు. అమృతలూరులో విషాదఛాయలు అమృతలూరు(వేమూరు): అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎంవీవీఎస్ మూర్తితోపాటు మృతిచెందిన వెలువోలు బసవపున్నయ్య(78) స్వగ్రామం గుంటూరు జిల్లాలోని అమృతలూరు. బసవపున్నయ్య మరణవార్త తెలియగానే అమృతలూరులో విషాదఛాయలు అలుముకున్నాయి. బసవపున్నయ్య తల్లిదండ్రులు వెలువోలు సుబ్బమ్మ, వెంకట సూర్యనారాయణ. ఆయన సాంఘిక సంక్షేమ శాఖలో ఉద్యోగ విరమణ అనంతరం విశాఖపట్నంలో స్థిరపడ్డారు. గీతమ్స్ సంస్థ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. వెలువోలు ట్రస్ట్‌ను స్థాపించి, స్వగ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. -
ఆఫ్ క్యాంపస్‌లు అక్రమమే!
సాక్షి, హైదరాబాద్ : అనుమతులు ఒకచోట.. తరగతులు ఇంకోచోట.. ఆఫ్ క్యాంపస్‌ల పేరుతో కొన్ని.. స్టడీ సెంటర్ల పేరుతో మరికొన్ని.. అనుమతులు లేకుండానే సర్టిఫికెట్లు జారీ చేస్తూ ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రైవేటు, డీమ్డ్ యూనివర్సిటీలు, స్టడీ సెంటర్లు లక్షలాది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) అనుమతులు లేకుండానే పలు సంస్థలు సాధారణ డిగ్రీలు, ఇంజనీరింగ్ కోర్సులను కొనసాగిస్తున్నాయని ప్రభుత్వానికి ఇటీవల భారీగా ఫిర్యాదులు అందాయి. వాటిపై ఏఐసీటీఈకి కూడా ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో డీమ్డ్ యూనివర్సిటీలు కూడా సాంకేతిక విద్య కోర్సులు నిర్వహించేందుకు తమ అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని ఏఐసీటీఈ ఈనెల 26న బహిరంగ ప్రకటన జారీ చేసింది. ఈ ప్రకటన నేపథ్యంలో రాష్ట్ర ఉన్నత విద్యా మండలి రంగంలోకి దిగింది. వివరణ కోరిన మండలి ఏఐసీటీఈ ఆమోదం లేకుండానే ఇతర రాష్ట్రాల్లో ఆఫ్ క్యాంపస్‌లు నిర్వహిస్తున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర ఉన్నత విద్యా మండలి పలు విద్యా సంస్థల నుంచి వివరణ కోరింది. గీతమ్ డీమ్డ్ యూనివర్సిటీ హైదరాబాద్ క్యాంపస్, సింబయాసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ, అమిటీ, సింఘానియా, కేఎల్ యూనివర్సిటీ, ఇక్ఫాయ్ యూనివర్సిటీలకు లేఖలు రాసింది. 2018–19 విద్యా సంవత్సరంలో ప్రవేశాలు చేపడుతున్న ఆయా సంస్థలకు ఏయే అనుమతులున్నాయి.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎన్వోసీ ఉందా.. ఏఐసీటీఈ అనుమతులున్నాయా.. యూజీసీ అనుమతి ఉందా.. తదితర అంశాలపై వివరణ ఇవ్వాలని పేర్కొంది. దీనిపై మూడు సంస్థలు ఇప్పటికే వివరణ ఇచ్చాయి. మరో మూడు విద్యా సంస్థల నుంచి వివరణ రావాల్సి ఉందని మండలి చైర్మన్ పాపిరెడ్డి తెలిపారు. మిగతా విద్యా సంస్థల నుంచి వివరణ వచ్చాక అన్నింటినీ తదుపరి చర్యల కోసం ప్రభుత్వానికి పంపిస్తామని పేర్కొన్నారు. అయితే రాష్ట్రంలో సరైన అనుమతులు లేకుండానే కోర్సులను నిర్వహిస్తూ విద్యార్థులు, తల్లిదండ్రుల బలహీనతలను సొమ్ము చేసుకుంటున్నాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఈ వివరణ కోరడం చర్చనీయాంశంగా మారింది. ఇష్టారాజ్యంగా కోర్సుల నిర్వహణ అనుమతుల్లేకపోయినా కొన్ని ప్రైవేటు, డీమ్డ్ యూనివర్సిటీలు ఇంజనీరింగ్, ఫార్మసీ, మేనేజ్మెంట్ కోర్సులను నిర్వహిస్తున్నాయి. అలాంటి విద్యాసంస్థల్లో చేరి, విద్యార్థులు డబ్బుతో పాటు భవిష్యత్తును నష్టపోతున్నారు. డిసెంబర్లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఏఐసీటీఈ అనుమతితోనే సాంకేతిక విద్య కోర్సులు నిర్వహించాలన్న నిబంధన ఉన్నా ఆఫ్ క్యాంపస్‌ల పేరుతో ఇతర రాష్ట్రాల్లో కోర్సులను నిర్వహిస్తున్నాయి. కొన్ని రాష్ట్రస్థాయి యూనివర్సిటీలైతే సంప్రదాయ డిగ్రీలు, వివిధ కోర్సులను ఇతర రాష్ట్రాల్లో స్టడీసెంటర్ల ద్వారా నిర్వహించకూడదన్న నిబంధనలను తుంగలో తొక్కుతున్నాయి. స్టడీ సెంటర్ల పేరుతో లక్షలాది విద్యార్థులను మోసం చేస్తున్నాయి. పదోన్నతులు పొందేందుకు అలాంటి చెల్లని సర్టిఫికెట్లు పెట్టిన వారు వివిధ శాఖల్లో అనేక మంది ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా తూనికలు, కొలతల శాఖలో చెల్లని సర్టిఫికెట్ల గొడవ కొనసాగుతోంది. ఆ సర్టిఫికెట్లతోనే పదోన్నతులు ఇస్తున్నారంటూ ఆరోపణలు తీవ్రమవుతున్నాయి. దీనిపై ఉన్నత విద్యామండలికి భారీగా ఫిర్యాదులు అందినట్లు సమాచారం. ‘గీతమ్ అనుమతికి దరఖాస్తు చేయలేదు’ గీతమ్ డీమ్డ్ యూనివర్సిటీ విశాఖపట్నం, హైదరాబాద్ క్యాంపస్‌లో ఇంజనీరింగ్ కోర్సుల నిర్వహణ కోసం తమకు దరఖాస్తు చేయలేదని, ఆమోదం పొందలేదని ఏఐసీటీఈ రీజనల్ ఆఫీసర్ రమేశన్ ఉన్ని క్రిష్ణన్ పేర్కొన్నారు. హైదరాబాద్‌కు చెందిన బీఎన్ శ్రీనివాస్ సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకోగా, ఈ మేరకు ఏఐసీటీఈ అధికారులు ఈనెల 25న రాత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. దీనిపై గీతమ్ వర్సిటీ వర్గాలను వివరణ కోరగా.. మానవ వనరుల అభివృద్ధి శాఖ (ఎంహెచ్ఆర్డీ), యూజీసీ, ఏఐసీటీఈ భాగస్వామ్యంతో కూడిన జాయింట్ కమిటీ ఆమోదం మేరకే తమ కోర్సులు నిర్వహిస్తున్నామని పేర్కొన్నాయి. ప్రత్యేకంగా ఏఐసీటీఈ నుంచి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని తెలిపాయి. -
ప్రొడక్టు డిజైన్‌పై గీతంలో వర్క్‌షాప్
సాక్షి, విశాఖపట్నం : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో ప్రొడక్టు డిజైన్‌పై నిర్వహించే మూడురోజుల వర్క్‌షాప్ గురువారం మొదలైంది. విశాఖపట్నంలోని గీతం విశ్వవిద్యాలయం మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో 12,13,14తేదీలలో వర్క్‌షాపు జరగనుంది. వర్క్‌షాప్ రిసోర్స్ పర్సన్‌గా న్యూజెర్సీలోని బెక్టాన్ డికిన్సన్ సంస్థ పరిశోధన-అభివృద్ధి విభాగం నిపుణుడు పాల త్రివిక్రమ్ భానోజీ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆలోచనలకు రూపం ఇవ్వడంలో ప్రొడక్ట్ ఇంజనీరింగ్ పాత్ర కీలకమన్నారు. ఇందుకోసం క్యాడ్, కామ్ సాంకేతిక పరిజ్ఞానం జోడిస్తే వినియోగదారులకు అవసరమైన విధంగా ఉత్పత్తులు అభివృద్ధి చేయవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గీతం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రిన్సిపల్ కె. లక్ష్మీప్రసాద్, హెచ్ఓడీ సత్యనారాయణ, ప్రొగ్రామ్ కన్వీనర్లు ఆర్.భానుపవన్, కోదండరావు తదితరులు పాల్గొన్నారు. -
‘గీతం’ విద్యార్థి ఆత్మహత్య
విశాఖ తూర్పు: విశాఖపట్నంలోని గీతం డీమ్డ్ వర్సిటీకి చెందిన ఓ బీ–ఫార్మసీ విద్యార్థి బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్‌కు చెందిన శశి కుమార్ అలియాస్ రిషి(19) గీతం వర్సిటీలో ఫస్టియర్ బీ ఫార్మసీ చదువుతూ క్యాంపస్ హాస్టల్లో ఉంటున్నాడు. బుధవారం క్యాంపస్ బయటకు వెళ్లి తిరిగి ఆలస్యంగా లోపలకు వస్తుండగా సెక్యూరిటీగార్డు ఆపారు. హాస్టల్‌వార్డెన్‌కు సెక్యూరిటీగార్డు ఫోన్ చేసి చెప్పి శశికుమార్‌ను లోపలికి పంపారు. లోనికి వెళ్లిన శశికుమార్‌ను వార్డెన్ మందలించారు. బయటకు వెళ్లవద్దని రోజూ చెప్పినా వినడం లేదని, తల్లిదండ్రులకు సమాచారం ఇస్తానని భయపెట్టాడు. మనస్తాపానికి గురైన శశికుమార్ అదే భవనం పైఅంతస్తు నుంచి దూకాడు. శశికుమార్‌ను ఆసుపత్రికి తరలించిగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. గీతం వర్సిటీ అధికారులు వెంటనే శశికుమార్ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ఆత్మ హత్యగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలిస్తామని ఆరిలోవ ఎస్ఐ సంతోశ్ తెలిపారు. -
అవకాశాలను అందిపుచ్చుకోండి
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ప్రపంచీకరణతో వస్తున్న అవకాశాలను యువత అందిపుచ్చుకుని దేశాభివృద్ధికి కృషి చేయాలని ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. విద్యను ఉపాధి మార్గంగా కాకుండా సాధికారత సాధించే సాధనంగా చూడాలన్నారు. సంగారెడ్డి జిల్లా రుద్రారంలోని గీతం యూనివర్సిటీ (హైదరాబాద్) ఎనిమిదో స్నాతకోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... భారత్‌లో వృత్తి నైపుణ్యాలకు కొదవలేదని, నైపుణ్యాలను మెరుగు పరచుకునేందుకు అన్నివర్గాల వారు ప్రయత్నించాలన్నారు. ఉన్నత విద్య, ఉపాధి కోసం విద్యార్థులు విదేశాలకు వెళ్లడానికి తాను వ్యతిరేకం కాదన్నారు. విదేశాలకు వెళ్లిన విద్యార్థులు చదువుకుని, సంపాదించుకుని మాతృదేశా నికి తిరిగి రావాలన్నారు. తెలంగాణ లో సీఎం కేసీఆర్ తెలుగును తప్పని సరి చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. అందరికీ ఉద్యోగాలు అసాధ్యం: మంత్రి హరీశ్‌రావు ఒకటిన్నర నుంచి 3% మందికి మాత్రమే ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించడం సాధ్యమవుతుందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. తెలుగు విద్యార్థులు అఖిల భారత సర్వీసుల్లో ఎక్కువ సంఖ్యలో చేరాలని పిలుపునిచ్చారు. మిషన్ భగీరథ, విద్యుత్, మిషన్ కాకతీయ, హరితహారం తదితర పథకాల ద్వారా ప్రభుత్వం తాగునీరు, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల సమస్యలను తీర్చే దిశగా అడుగులు వేసిందన్నారు. పర్యావరణ మార్పులపై యువ ఇంజినీర్లు పరిశోధనలు చేసి పరిష్కారం చూపాలని పిలుపునిచ్చారు. గీతం యూనివర్సిటీ 8వ స్నాతకోత్సవం సందర్భంగా వైస్ చాన్సలర్ ఎం.ఎస్. ప్రసాదరావు వార్షిక నివేదిక సమర్పించగా, చాన్సలర్ ప్రొఫెసర్ కె.రామకృష్ణారావు స్వాగతోపన్యాసం చేశారు. వివిధ విభాగాల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు అవార్డులు అందజేశారు. కార్యక్రమంలో గీతం వ్యవస్థాపకులు డాక్టర్ ఎంవీవీఎస్ మూర్తి, మాజీ ఎంపీ కేఎస్ రావు, ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మహిపాల్‌రెడ్డి, చింతా ప్రభాకర్, కలెక్టర్ మాణిక్కరాజ్ కణ్ణన్లు పాల్గొన్నారు. -
దేశవ్యాప్తంగా 48 కేంద్రాల్లో ‘గ్యాట్’
సాగర్‌నగర్ (విశాఖ తూర్పు): గీతం విశ్వవిద్యాలయంలో వివిధ కోర్సుల్లో ప్రవేశానికి ఈ నెలలో ప్రవేశ ప్రకటన జారీ చేయనున్నట్లు వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ ఎం.ఎస్.ప్రసాదరావు వెల్లడించారు. గీతం వర్సిటీలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన అఖిల భారత స్థాయి గీతం అడ్మిషన్ టెస్ట్ (గ్యాట్)–2018 వివరాలను తెలియజేశారు. వర్సిటీ విశాఖపట్నం, హైదరాబాద్, బెంగళూరు క్యాంపస్‌లలో నిర్వహిస్తున్న ఇంజనీరింగ్‌లో 10 బీటెక్ కోర్సులకు, ఈసీఈ, మెకానికల్ ఇంజనీరింగ్‌లో ఆరు సంవత్సరాల డ్యూయల్ డిగ్రీ కోర్సులు (బీ.టెక్+ఎం.టెక్), 17ఎం.టెక్ కోర్సులకు, బీ.ఫార్మశీ, ఎం.ఫార్మశీ కోర్సులకు, ఐదేళ్ల బి.ఆర్క్ కోర్సుకు, రెండేళ్ల ఎం.ఆర్క్ కోర్సుకు గ్యాట్–2018 ప్రవేశ పరీక్షను అఖిల భారతస్థాయిలో దేశంలోని 48 పట్టణాలలో ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తోందన్నారు. ప్రవేశ పరీక్ష దరఖాస్తులు దేశవ్యాప్తంగా అన్ని యూనియన్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, కరూర్ వైశ్యాబ్యాంక్ శాఖలలో లభిస్తాయని వివరించారు. గీతం ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షకు ఆన్లైన్ www.gitam.edu ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. పూర్తి చేసిన దరఖాస్తులు వచ్చే ఏడాది మార్చి 26వ తేదీలోగా అందజేయాలన్నారు. ఏప్రిల్ 5 నుంచి గీతం వెబ్సైట్లో హాల్ టిక్కెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చునని పేర్కొన్నారు. ఏప్రిల్ 11 నుంచి 26 వరకు ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రవేశ పరీక్ష పూర్తయిన వారం రోజుల తర్వాత ఫలితాలు వెల్లడిస్తామన్నారు. గీతం ప్రవేశ పరీక్షలో ఒకటి నుంచి 10 ర్యాంకర్లకు ఉచిత విద్య అందిస్తామని వీసీ చెప్పారు. 11 నుంచి 100 ర్యాంకు వరకు ఫీజులో 50శాతం రాయితీ ఉంటుందన్నారు. ఈ సందర్భంగా గ్యాట్‌కు సంబంధించిన బ్రోచర్‌ను వీసీ ఆవిష్కరించారు. విలేకర్ల సమావేశంలో ప్రో వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ కె.శివరామకృష్ణ, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం.పోతరాజు, అడ్మిషన్ల డైరెక్టర్ ప్రొఫెసర్ కె.నరేంద్ర, తదితరులు పాల్గొన్నారు. -
మిస్ ఇండియా ఏసియాగా గీతం విద్యార్థిని
పటాన్చెరు: గీతం యూనివర్సిటీకి చెందిన జొన్నలగడ్డ మానస ‘మిస్ ఇండియా ఏసియా పసిఫిక్–2017’ టైటిల్ సాధించారు. పటాన్చెరు మండలంంలోని రుద్రారం గ్రామంలో ఉన్న గీతం హైదరాబాద్ క్యాంపస్‌లో ఆమె ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ మూడో ఏడాది చదువుతున్నారు. ఆమె టైటిల్ సాధించడం పట్ల గీతం ప్రొ వైస్ చాన్స్‌లర్ ఎన్.శివప్రసాద్ శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల థాయ్‌లాండ్‌లోని పట్టాయలో జరిగిన పోటీల్లో ఆమె ఈ ఘనత సాధించారని ఆయన వివరించారు. మనదేశంతో పాటు దుబాయ్, సింగపూర్, మలేసియా, థాయిలాండ్, శ్రీలంకకు చెందిన ఔత్సాహికులతో మానస పోటీ పడి టైటిల్ సాధించారని ఆయన సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. క్విల్లింగ్‌లో శివాలి గిన్నిస్ రికార్డు.. తమ కళాశాల విద్యార్థిని ఒకరు గిన్నిస్ రికార్డు సాధించారని గీతం ప్రొ వీసీ శివప్రసాద్ తెలిపారు. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రెండో ఏడాది చదువుతున్న శివాలి తన తల్లితో కలసి క్విల్లింగ్ (కాగితంతో వివిధ కళారూపాలు చేసే కళ)లో గిన్నిస్ రికార్డు సాధించారని తెలిపారు. శివాలి, ఆమె తల్లి కవిత 7,011 కాగితపు బొమ్మలను తయారు చేసి రికార్డు సృష్టించారని చెప్పారు. గిన్నిస్ రికార్డు పత్రంతో శివాలి కుటుంబసభ్యులు -
‘గీత’ దాటి ఆక్రమణలు
పేదల ఇళ్లకు కేటాయించిన భూముల్లో.. తెలుగుదేశం పాలనలో ప్రభుత్వ ‘ముఖ్య’పెద్దల అండతో కబ్జాలు దర్జాగా సాగిపోతున్నాయి. విశాఖ జిల్లాలో రుషికొండ వద్ద రూ. వెయ్యి కోట్ల విలువ చేసే 55.24 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన గీతం సంస్థల అధినేత, సీఎం చంద్రబాబు బంధువు ఎంవీవీఎస్ మూర్తి.. పేదల ఇళ్ల నిర్మాణం కోసం రాజీవ్ స్వగృహ కార్పొరేషన్‌కు కేటాయించిన భూములనూ వదల్లేదు. ప్రభుత్వ భూమిని కబ్జా చేశానని, దాన్ని నామమాత్రపు ధరకు ఇచ్చేయాలంటూ ఏకంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన కోరడం, అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవడానికి రంగం సిద్ధం కావటం చకచకా జరిగిపోతోంది. విశాఖపట్టణంలోని గీతం యూనివర్సిటీలో సర్కారు భూమి ఆక్రమణలే అధికమనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. విశాఖ జిల్లా రుషికొండ, ఎండాడ గ్రామాల్లో రూ. వెయ్యి కోట్ల విలువ చేసే 55.24 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన గీతం కాలేజీ చైర్మన్, ముఖ్యమంత్రి చంద్రబాబు బంధువు ఎంవీవీఎస్ మూర్తికి నామమాత్రపు ధరతో కట్టపెట్టేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసిన విషయాన్ని ‘సాక్షి’ ఇటీవలే పాఠకులకు తెలియజేసింది. ఇందుకోసం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు చెందిన సంస్థలకు గతంలో కేటాయించిన 15 ఎకరాలను రద్దు చేస్తూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్న విషయాన్ని కూడా సాక్షి వెలుగులోకి తెచ్చింది. అయితే ఈసారి రాజీవ్ స్వగృహ భూములపై ‘గీతం’ కన్ను పడింది. ప్రభుత్వ భూమిని పేదలు ఆక్రమిస్తే ఇచ్చేస్తారా? ప్రభుత్వ రంగ సంస్థలకు కేటాయించిన భూములను రద్దు చేయటం, సామాన్యుల ఇళ్ల నిర్మాణాలకు ఇచ్చిన భూమిని గీతం యూనివర్సిటీ పరం చేయటాన్ని అధికారులు తప్పుపడుతున్నారు. అత్యధిక ఫీజులు వసూలు చేస్తున్న గీతం వర్సిటీ సామాజిక సేవలేమీ అందించడం లేదని, అలాంటి సంస్థకు నామమాత్రపు ధరకు భూములు ఎందుకు అప్పగించాలని ప్రశ్నిస్తున్నారు. పేద ప్రజలు కూడా ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని నామమాత్రపు ధరకు ఇవ్వాలని కోరితే ఇదే ప్రభుత్వ పెద్దలు ఇస్తారా? అని వ్యాఖ్యానిస్తున్నారు. భూములు కాపాడుకోవాలంటూ రాజీవ్ స్వగృహకు కలెక్టర్ లేఖ సామాన్య, మధ్య తరగతి ప్రజలకు ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు ప్రభుత్వం 2009లో రాజీవ్ స్వగృహ కార్పొరేషన్‌కు కేటాయించిన భూములను కూడా గీతం యూనివర్సిటీ ఆక్రమించింది. అప్పట్లో రాజీవ్ స్వగృహ కార్పొరేషన్‌కు ప్రభుత్వం 7.61 ఎకరాలను కేటాయించింది. సుమారు వంద కోట్ల రూపాయలు విలువైన ఈ భూమిని ఆక్రమించడమే కాకుండా ఆ భూమిని తమకు కేటాయించాలంటూ గీతం వర్సిటీ యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. అయితే ఎండాడలోని రాజీవ్ స్వగృహ కార్పొరేషన్‌కు కేటాయించిన 7.61 ఎకరాలను గీతం యూనివర్సిటీ యాజమాన్యం ఆక్రమించిందని, ఇది ప్రభుత్వ భూమి అయినందున గీతం యూనివర్సిటీకి కేటాయించడం సాధ్యం కాదని గతంలో విశాఖ జిల్లా కలెక్టర్‌గా ఉన్న యువరాజ్ రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేశారు. రాజీవ్ స్వగృహకు చేసిన భూముల కేటాయింపులను రద్దు చేసి గీతం యూనివర్సిటీకి ఇవ్వడం సాధ్యం కాదంటూ కలెక్టర్ యువరాజ్ గత ఏడాదే భూమి పరిపాలన ప్రధాన కమిషనర్‌కు లిఖిత పూర్వకంగా తెలియజేశారు. గీతం యూనివర్సిటీ ఆక్రమణలో ఉన్న భూమిని స్వాధీనం చేసుకుని పరిరక్షించుకోవాల్సిందిగా కూడా రాజీవ్ స్వగృహ కార్పొరేషన్‌కు యువరాజ్ సూచించారు. సర్వే నెంబర్ 16లో 1.95 ఎకరాలు, సర్వే నెంబర్ 20లో 5.66 ఎకరాలను రాజీవ్ స్వగృహ కార్పొరేషన్‌కు కేటాయిస్తూ 2009 ఫిబ్రవరి 20వ తేదీన జీవో 219 జారీ చేసినట్లు కలెక్టర్ యువరాజ్ ప్రభుత్వానికి పంపిన నివేదికలో స్పష్టం చేశారు. అయితే గీతం యూనివర్సిటీ యాజమాన్యం మాత్రం ఎలాగైనా ఆ భూమిని కాజేయాలని ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో గతంలో కలెక్టర్ ఇచ్చిన నివేదికను బుట్టదాఖలు చేసి ఆ భూమిని నామమాత్రపు ధరకు కట్టబెట్టేందుకు ప్రభుత్వ పెద్దలు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సిందిగా రెవెన్యూ శాఖ అధికారులను ప్రభుత్వ పెద్దలు ఆదేశించారని, త్వరలోనే రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ భూములను గీతం యూనివర్సిటీ పరం చేయనున్నారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. -
అగ్రశ్రేణి వర్శిటీగా ‘గీతం’
అనంతపురం సప్తగిరిసర్కిల్ : నేషనల్ అసెస్మెంట్ అండ్ అడ్రికేషన్ కౌన్సిల్ (ఎన్ఏఏసీ–నాక్) తాజాగా వెలువరించిన ఫలితాల్లో గీతం యూనివర్శిటీకి అగ్రస్థానం లభించినట్లు వర్శిటీ ఉపకులపతి ఆచార్య ఎంఎస్ ప్రసాదరావు మంగళవారం తెలిపారు. ఈ నెల 28న జరిగిన నాక్ 23వ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఏ+ గ్రేడు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. నాక్ నూతన గ్రేడింగ్ విధానంలో ఏ+ స్థానాన్ని అందుకున్న దేశంలోని డీమ్డ్ విశ్వవిద్యాలయాల్లో గీతం అగ్రస్థానంలో ఉందని ఆయన తెలిపారు. దక్షిణ భారతదేశంలో ఇంజినీరింగ్, ఫార్మసీ, ఆర్కిటెక్చర్, లా, సైన్స్, మేనేజ్మెంట్, అంతర్జాతీయ వాణిజ్య విద్య, వైద్య విద్యా కోర్సులతో నాక్ ఏ+ గ్రేడింగ్ సాధించిన ఏకైక విశ్వవిద్యాలయంగా గీతం ఖ్యాతి గడించిందన్నారు. అదేవిధంగా 138 యూజీ, పీజీ, డాక్టరల్ కోర్సులతో దక్షిణ భారతంలోని అతి పెద్ద విశ్వవిద్యాలయంగా స్థానం సంపాదించుకుందన్నారు. నాక్ ఏ+ సాధించి అత్యుత్తమ యూనివర్శిటీగా గుర్తింపును పునరుద్ధరించుకోవడంపై వర్శిటీ చాన్సలర్ రామకృష్ణారావు, రిజిస్ట్రార్ పోతరాజు, యూజీసీ వ్యవహారాల డైరెక్టర్ సీహెచ్ రామకృష్ణ విశ్వవిద్యాలయ వర్గాలకు అభినందనలు తెలిపారు. -
హిందీకి రాజధాని విశాఖ
యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ వెల్లడి సాక్షి, న్యూఢిల్లీ: హిందీయేతర ప్రాంతాల్లో హిందీకి రాజధాని విశాఖపట్నం అని కేంద్రీయ హిందీ సమితి సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అభిప్రాయపడ్డారు. జనవరి 6 నుంచి మూడు రోజులపాటు విశాఖలోని గీతం విశ్వ విద్యాలయంలో నిర్వహిం చనున్న నాలుగో అంతర్జాతీయ హిందీ సమ్మేళనానికి సంబంధించి సన్నాహక సమావేశాన్ని న్యూయార్క్‌లోని భారత దౌత్య కార్యాలయంలో నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న యార్లగడ్డ మాట్లాడుతూ.. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో హిందీ విభాగం 60 ఏళ్లకుపైబడి ఉందని, వందలాది పరిశోధనా గ్రంథాలు, హిందీ కవులు, పండితులతో ఈ విభాగం అలరారుతోందన్నారు. హిందీయేతర ప్రాంతాల్లో ఉంటున్న తాము హిందీ బోధనలో ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ సమ్మేళనంలో చర్చించనున్నట్టు యార్లగడ్డ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. -
సానుకూల దృక్పథమే విజయానికి సోపానం
పటాన్చెరు: ‘రోజువారీ కార్యకలాపాలను సాధారణంగా ఎడమవైపు ఉన్న మెదడు నయంత్రిస్తుందని, సమాజంలోని చాలా మంది సహజంగానే దానికి అలవాటు పడిపోతారని ’ బార్క్ పూర్వ శాస్త్రవేత్త జి.ఎ.రామారావు అన్నారు. గురువారం రుద్రారంలోని గీతం యూనివర్సిటీలో ‘సాఫ్ట్ స్కిల్స్ ఫర్ ఎ హెల్తీ మైండ్’ అనే అంశంపై జరిగిన ఓ వర్క్‌షాప్‌లో ఆయన శిక్షకుడిగా పాల్గొన్నారు. బాబా అణు పరిశోధన సంస్థ(బార్క్) పూర్వ శాస్త్రవేత్తగా జి.ఎ.రామారావు విద్యార్థులకు మెదడు పనితీరుతో పాటు సానుకూల దృక్పథంపై పలు కీలక సూచనలు, వివరణలు ఇచ్చారు. అంతా బాగుందనే మానసిక భావనే సానుకూల దృక్పథమని అదే విజయానికి సోపానమని వివరించారు. సానుకూల ఆలోచన పురోగతి వైపు సాగుతుందన్నారు. మన శరీరంలోని అంగాలన్నీ బాగా పనిచేస్తున్నాయనే భావన కలిగి ఉంటే చన్ని చిన్న రుగ్మతలు కూడా మననేమీ చేయలేవని ఆయన చెప్పారు. కాని ఏదో నలతగా ఉందే ఆందోళన మానసింగా కృంగదీస్తుందని, ప్రతికూల ఆలోచనలను (నెగెటివ్ మైండ్‌సెట్) విడనాడాలని సూచించారు. నిద్రలేమి గురించి కలత చెందవద్దని, బాగా నిద్రించాననే సానుకూల భావన ద్వారా దానిని అధిగమించి పునరుత్తేజితులు కావాలన్నారు. మెదడు పనితీరును ఆయన వివరిస్తూ ఎడమవైపు మెదడునే ఎక్కువగా వాడుతామన్నారు. అందువల్ల కుడివైపున ఉన్న మెదడును మనం పూర్తి స్థాయిలో వినియోగించుకోలేక పోతున్నామన్నారు. రోటీన్‌కు భిన్నంగా పనులు చేస్తుంటే రెండు మెదడుల మధ్య సమన్వయం పెరిగి ఆలోచనలను వస్తిరింప చేసుకోవచ్చని సూచించారు. రోజూ కొద్దిసేపు నేలపై కూర్చోవడం, ఒక్క చేత్తో చేయడానికి అలవాటు పడ్డ పనిని మరో చేతితో చేసేందుకు ప్రయత్నించడం వంటి చిన్ని చిన్న అభ్యాసాల(మార్జాలసనం, శలభాసనంలో కొన్ని మార్పుల) ద్వారా మేధస్సును వికసింప చేసుకోవచ్చన్నారు. ‘సంతోషమే సగం బలం’ అనేది నానుడని ఆనందంగా ఉంటేనే కుడివైపు మెదడు పనిచేస్తుందని రామారావు వివరించారు. కొంత సాధనతో విద్యార్థులు ఏకాగ్రతను అలవరచుకోవడం సాధ్యమేనన్నారు. ఒంటి కాలిపై నిలబడి ఒక కేంద్రాని్న ఎంపిక చేసుకుని దానిపై దృష్టినిలిపి తేదకంగా గమనించాలని, ఆలోచనలను నియంత్రించి ఏకాగ్రత సాధించే ప్రయత్నం చేయాలన్నారు.యోగలోని వృక్షాసనం, గరుడాసనం, నటరాజాసనం, వంటి బ్యాలెన్సింగ్ ఆసనాలను సాధన చేయాలన్నారు. చివరగా యోగనిద్ర ద్వారా సౌభ్రాతృత్వ, ఏకత్వ భావనలను పెంపొందించుకోవచ్చన్నారు. సానుకూల సమైక్య భావనలను యోగనిద్రలో పెంపొందించుకోవచ్చని ఆయన వివరించారు. దాదాపు వంద మంది బిటెక్ విద్యార్థులు ఈ కార్యక్రమంలో శిక్షణ పొందారు. -
‘గీతం’ ఆధ్వర్యంలో హెల్త్‌క్యాంప్
పటాన్చెరు: మండల పరిధిలోని రుద్రారంలో గీతం యూనివర్సిటీ విద్యార్థులు పేదల కోసం ఉచిత వైద్య శిబిరాన్ని శనివారం నిర్వహించారు. గీతం ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో మహేశ్వర మెడికల్ కాలేజీ సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం కొనసాగింది. ప్రాథమిక వైద్య సేవలను నిర్వహించి ఉచితంగా మందులను, సలహాలను అందించారు. గీతం ఎన్ఎస్ఎస్ విభాగాధిపతి డాక్టర్ పీవీ నాగేంద్రకుమార్ మాట్లాడుతూ మొత్తం 30 మంది విద్యార్థులు ఈ వైద్య శిబిరాన్ని నిర్వహించారని తెలిపారు. గ్రామస్తులు వైద్య శిబిరాన్ని చక్కగా సద్వినియోగించుకున్నారని తెలిపారు. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి మందులు అందించామన్నారు. ఈఎన్టీ, ఆప్తాలమాలజీ, గైనకాలజీ, పీడియాట్రిక్ డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారని తెలిపారు. గీతం ఆధ్వర్యంలో మరిన్ని సేవలు సమాజానికి అందిస్తామన్నారు. -
పరిశోధన ఫలాలు ప్రజలకు అందాలి
పటాన్చెరు: పరిశోధన ఫలాలు ప్రజలకు అందాలని ఓయూ కెమిస్టర్ ప్రొఫెసర్ డాక్టర్ సోమేశ్వర్ పోలా అన్నారు. రుద్రారం హైదరాబాద్ గీతం యూనివర్సిటీలో మంగళవారం ‘సీహెచ్-బాండ్ క్రియాశీలత ద్వారా కొత్త సేంద్రియ పదార్థాల సంశ్లేషణ, సేంద్రి ఎలక్ట్రానిక్స్ రంగంలో వాటి అనువర్తనాలు’ అనే అంశంపై ఆయన ఉపన్యాసం చేశారు. ఈ సందర్భంగా పరిశోధన ఫలాలు పేదల దరిచేరాలని, సమాజానికి ఉపయోగపడితేనే ఆ శోధన సాఫల్యవంతమవుతుందన్నారు. పరిశోధనలు పత్ర సమర్పణకో, పట్టాలు పొందేందుకో కాకుండా వాటి ఫలాలు ప్రజలకు ఉపయోగపడినప్పుడే ప్రయోజనం ఉంటుందన్నారు. ప్రజోపయోగ పరిశోధనలు సాగించాలని విజ్ఙప్తి చేశారు. సేంద్రియ పదార్థాల సంశ్లేషణ, వాటి అనువర్తనాల గరించి ఆయన వివరించారు. కార్యక్రమంలో బాబా ఆటామిక్ రిసెర్చ్ సెంటర్ పూర్వ శాస్త్రవేత్త డా.జి.ఏ.రామారావు, ప్రొఫెసర్లు రాంబాబు గుండ్ల, ఐబీ సుబ్బారెడ్డి, అసోసియేట్ ప్రొ డా.పాత్రుడు, డా.శివకుమార్, డా. నాగేంద్రకుమార్ తదితరులు పాలొ్గన్నారు.