సాక్షి, అమరావతి : విశాఖలోని గీతం యాజమాన్యం తిరు చూసి జనం ఇదో అబద్ధాల పుట్ట అనుకుంటున్నారు. ఏమాత్రం కూడా విద్యా సంస్థ పాటించాల్సిన నియమాలు ఎక్కడ పాటించలేదు. అన్నింటా తప్పుడు సమాచారంతోనే కోట్లాది రూపాయలు ఆర్జించింది. చివరికి వ్యవస్థాపకుల దహన ప్రక్రియకు ప్రభుత్వ భూమి అడ్డగోలుగా తీసుకోంది. విశాఖ భీమిలి బీచ్ రోడ్లో రిషికొండ ఎదురుగా 1981లో మొదలైన ఈ విద్యా సంస్థ ఆరంభం నుంచి ప్రభుత్వ భూములను పైనే ఆధారపడి ఉంది. అప్పుడే మార్కెట్ ధరకు 71 ఎకరాల భూమిని తీసుకున్న గీతం యాజమాన్యం విశాలమైన విద్యాసంస్థలు అంచెలంచెలుగా విస్తరించింది. ఉత్తరాంధ్రలో ఎక్కడా లేని విధంగా 71 ఎకరాల భూమిని తీసుకున్నప్పటికీ గీతం యాజమాన్యం ప్రభుత్వ భూమి పై మక్కువ తగ్గించుకోలేదు. విద్యా సంస్థ ప్రహరీ గోడ గేటు కూడా ప్రభుత్వ భూమిలోనే నిర్మించింది. ఎగిరే కాలేజీకి ఆనుకుని ఉన్న కొండ స్థలాన్ని కూడా కొంత మింగేసింది.
టీడీపీతో అనుబంధం..
ఫార్మసీ మెకానికల్ విభాగాలతో పాటు సివిల్ విభాగంలో కొంత భాగం ప్రభుత్వ భూమి లోనే కొనసాగిస్తున్నట్టు స్థానికులు పేర్కొంటున్నారు. ఇదే విషయాన్ని ఎంపీ విజయసాయి రెడ్డి కేంద్ర మంత్రి అలాగే యూజీసీ చైర్మన్ కు రాసిన లేఖలో కూడా ప్రస్తావించారు. తెలుగుదేశం పార్టీ తొలినాళ్ల నుంచి గీతం యూనివర్సిటీ వ్యవస్థాపకులు ఎంవీవీఎస్ మూర్తి అనుబంధం కొనసాగిస్తూ వచ్చారు. గీతం యూనివర్సిటీ మౌలిక సదుపాయాలు ఇతర అంశాలు అధికార పార్టీ సహాయం చాలావరకు పొందారు. అందులో భాగంగానే కొంతవరకు ఆ రోజుల్లో బీచ్ వెంబడి విశాలమైన రోడ్డు నిర్మాణం జరిగింది. ఎండాడ నుంచి రిషి కొండ వరకు వంద అడుగుల నిర్మాణాన్ని కూడా అంకురార్పణ జరిగింది. ముఖ్యంగా గీతం యూనివర్సిటీ ఒక ఖరీదైన యూనివర్సిటీ గా కనిపించే రీతిన ప్రభుత్వ విభాగాల సహాయంతో పనులు జరిగాయి. అందులో భాగంగానే గీతం యూనివర్సిటీ ఎదురుగా ఓ అందమైన బస్ స్టాప్ కూడా కూడా ఊడా నిధులతో నిర్మాణం జరిగింది.
ఇలా ఉండగా ఇటీవల వరుసగా వచ్చిన ఫిర్యాదులపై ఏపీ ప్రభుత్వం చేపట్టిన స్పెషల్ డ్రైవ్ లో భాగంగా గీతం యాజమాన్యం భూములను పరిశీలించింది. ఆ సందర్భంగా 40 ఎకరాలు పైబడి భూమి ప్రభుత్వానికి ఇచ్చింది తన ఆధీనంలో గీతం యాజమాన్యం ఉంచుతున్నట్టు గుర్తించడం జరిగింది. ఇది ఒక గొప్ప పరిణామంగా మధురవాడ పరిసర ప్రాంత ప్రజలు పేర్కొంటున్నారు. గీతం 2 ప్రాంగణాల్లో ఇంజినీరింగ్ మెడికల్ విద్యాసంస్థలను కొనసాగిస్తుంది. ఆ క్రమంలో పది ఎకరాలు ఇంజనీరింగ్ విభాగంలో 30 ఎకరాలు మెడికల్ కాలేజీ ప్రాంగణంలో ఉన్నట్టు విచారణలో వెల్లడైంది. ఈ దశలో మెడికల్ కాలేజీ అనుమతులకు గీతం యాజమాన్యం పొందుపరిచిన డాక్యుమెంటులో కచ్చితంగా తప్పుడు సమాచారం ఉంటుందని స్థానికులు అనుమాన పడుతున్నారు..
ఫీజులు వసూలు చేయడంలో దిట్ట
వాస్తవానికి గీతం యాజమాన్యం మొదటి నుంచి కూడా లక్ష రూపాయల ఫీజులు వసూలు చేయడంలో దిట్ట. ఏ మాత్రం పూర్తి సమాచారం గాని నిబంధనలను గాని ప్రజలకు బహిర్గతం చేయలేదు కేవలం నిర్ణయించిన ఫీజును చెల్లించ డమే మార్గమన్నట్టు గీతం యాజమాన్యం వ్యవహరించింది. స్థానికులకు ఒక్క పైసా కూడా ఫీజులో రాయితీ ఇవ్వలేదని మధురవాడ పరిసర వాసులు పేర్కొంటున్నారు. అనుమతులు విషయంలో తప్పుడు సమాచారం ఇవ్వడంలో గీతం యాజమాన్యం మొదటి నుంచి పెద్ద చేయగా కొనసాగుతోంది. ముఖ్యంగా deemed to be యూనివర్సిటీగా అనుమతులు పొందడానికి కచ్చితంగా యాజమాన్యం తన భూమి హక్కుల పత్రాలను బహిరంగ పరచాలి.కానీ గీతం యాజమాన్యం ఆ తరహాలో ఎప్పుడు కూడా వ్యవహరించలేద నీ స్థానికులు చెబుతున్నారు. విద్యార్థుల నుంచి లక్షల రూపాయల్లో ఫీజులు వసూలు చేసే యాజమాన్యం క్రమశిక్షణ అమలు చేయడంలో ఏమాత్రం కూడా బాధ్యత వహించే లేదని కూడా అంటున్నారు
ఇదంతా ఒక ఎత్తు అయితే దాదాపు 40 ఎకరాల ప్రభుత్వ భూమిని రెండు దశాబ్దాలుగా తన ఆధీనంలో ఉంచుకున్న గీతం యాజమాన్యం వ్యవస్థాపకులు ఎంవీవీఎస్ మూర్తి అంత్యక్రియలకు కూడా ప్రభుత్వ భూమిని సంపాదించింది. అప్పటి టిడిపి ప్రభుత్వం ఓ ప్రత్యేక జీవో ద్వారా 500 పైగా గజాల భూమిని వ్యవస్థాపకులు ఎంబీబీఎస్ మూర్తి సమాధి కోసం కేటాయించారు. అప్పటికే 71 ఎకరాలు మార్కెట్ ధరకు తీసుకోవడమే కాక 40 ఎకరాలు భూమి అనధికారికంగా అనుభవిస్తున్న గీతం యాజమాన్యం మరో 500 గజాలు అంత్యక్రియలు పేరిట ప్రభుత్వ స్థలాన్ని తీసుకోవడం దారుణమని అప్పట్లో ప్రజా సంఘాలు ఫిర్యాదులు కూడా చేశాయి. ఇవన్నీ పట్టణ గీతం యాజమాన్యం ఎండ రోడ్లో వంద అడుగుల మాస్టర్‌ప్లాన్ రోడ్డు కిందగా ఓ సబ్ వే సొరంగ మార్గాన్ని కూడా నిర్మించుకుంది.
గంజాయ్, ఓపియం డ్రగ్స్, స్పీడ్ డ్రైవ్
ఇంతగా నిబంధనలు తుంగలో తొక్కినా జీవీఎంసీ.. రెవెన్యూ అధికారులు అప్పట్లో నోరు మెదప లేకపోయారు. అధికార పార్టీ ఒత్తిడికి భయపడి చాలామంది ఆ ప్రాంతంలో తాసిల్దార్ గా పని చేయడానికి కూడా ఇష్టపడలేదు. ఇలా ఉండగా గీతం యాజమాన్యం కేవలం భూమి అక్రమాలు మాత్రమే కాకుండా నిబంధనలు అమలులో కూడా చాలావరకు తప్పిదాలు చేసినట్టు కనిపిస్తుంది. ఉద్యోగ నియామకాలు ఏమాత్రం కూడా రూల్ ఆఫ్ రిజర్వేషన్లు పాటించలేదు. ఇక గీతంలో ఫీజు లే ప్రధానంగా కొనసాగే యాజమాన్యం విద్యార్థుల ప్రవర్తన పై దృష్టి పెట్టకపోవడంతో పది కేసుల్లో నిందితులుగా కూడా విద్యార్థులు కొనసాగారు. గంజాయ్ ..ఓపియం డ్రగ్స్... స్పీడ్ డ్రైవ్ ఇలాంటి తప్పిదాలు చేయడంలో గీతం విద్యార్థులకు ఓ ప్రత్యేక ముద్ర కూడా ఉంది.
విద్యార్థుల భవిష్యత్తు కూడా అగమ్యగోచరం
ఇక గీతం హాస్టల్స్ వ్యవహారంలో చాలావరకూ ఆరోపణలు ఉన్నాయి గతంలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నప్పటికీ దాన్ని బయట పడకుండా పూర్తిస్థాయిలో కప్పే ప్రయత్నం చేసింది. ఇలా గీతం యాజమాన్యాల తప్పిదాల చిట్టా పరిశీలిస్తే చాలావరకు కనిపిస్తాయి. భూ అక్రమాలకు మాత్రమే కాక ఆర్థిక నేరాల కూడా గీతం యాజమాన్యం పాల్పడిందని ప్రజా సంఘాల నాయకుడు జీటీ రామారావు ,హోంమంత్రి సుచరిత కూడా తాజాగా ఫిర్యాదు చేశారు. ఇలా గీతం యజమాన్యం తప్పిదాల పై తప్పిదాలు చేస్తూ ఇప్పుడు ప్రభుత్వం చర్యలతో అంధకారంలోకి వెళ్ళింది. ఇప్పుడు అక్కడ చదువుతున్న విద్యార్థుల భవిష్యత్తు కూడా అగమ్యగోచరంగా మారుతోందని స్థానికులు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment