బాబు.. గీతం భూములపై శ్వేతపత్రం ఎక్కడ?: మేరుగు నాగార్జున | Ex Minister Merugu Nagarjuna Serious Comments On CM Chandrababu Over Gitam College Lands | Sakshi
Sakshi News home page

బాబు.. గీతం భూములపై శ్వేతపత్రం ఎక్కడ?: మేరుగు నాగార్జున

Published Mon, Jul 15 2024 6:30 PM | Last Updated on Mon, Jul 15 2024 7:08 PM

Ex Minister Merugu Nagarjuna Serious Comments On CM CBN

సాక్షి, తాడేపల్లి: కేవలం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై నిందలు మోపడానికే చంద్రబాబు శ్వేతపత్రం విడుదలు చేస్తున్నారని ఆ‍గ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి మేరుగు నాగార్జున. రాష్ట్రంలో కబ్జాలు చేసిన వాళ్లే మళ్లీ నీతులు చెబుతున్నారని విమర్శించారు.

కాగా, మాజీ మంత్రి మేరుగు నాగార్జున తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘చంద్రబాబు కేవలం అబద్ధాలతో కాలం గడుపుతున్నారు. చంద్రబాబు ఆస్థాన మీడియా ఇష్టం వచ్చినట్టు రాసింది. గీతం కాలేజీ భూములపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మాట్లాడటం లేదు?.

38 ఎకరాల ప్రభుత్వ భూమిని గీతం యాజమాన్యం ఆక్రమించుకుంది. మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. ఆక్రమించుకున్న భూములను మా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. కేవలం వైఎస్‌ జగన్‌పై నిందలు వేయడానికే చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేస్తున్నారు. అవినీతిపై ఒక్క ఆధారం కూడా చూపించలేకపోయారు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.  

ఇదే సమయంలో చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రం ఆయన హయాంలో జరిగిన దోపిడీలాగే ఉంది. విశాఖలోని దసపల్లా భూములు ప్రభుత్వానివి కాదని‌ సుప్రీంకోర్టే చెప్పింది. అయినాసరే దానిపై కూడా చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేశారు. టీడీపీ ఆఫీసు కూడా ఆక్రమిత స్థలంలో కట్టారు. గీతం కాలేజీలో భూములను ఆక్రమించుకుంటే‌ ఎల్లోమీడియా ఎందుకు రాయలేదు?. గీతం భూములపై టీడీపీ నేతలు చర్చకు రాగలరా?

పేదల ఇళ్ల కోసం వైఎస్ జగన్ వేలాది ఎకరాలను ఇచ్చారు. రాజధానిలో 52 వేల మందికి ఇళ్ల స్థలాలు ఇస్తే కోర్టులకు వెళ్లి ఆపేయించారు. పేదలకు ఇళ్ల ఇచ్చిన స్థలాలలో ఇళ్లు కట్టించే దమ్ము చంద్రబాబుకు ఉందా?. ఇసుక గురించి మరోసారి చంద్రబాబు అబద్దాలు చెప్పారు. 2014-19 మధ్యలో కరకట్ట మీద చంద్రబాబు ఇంటి పక్కనే ఇసుక దోపిడీ చేయలేదా?. నేడు ఉచిత ఇసుక పేరుతో ముక్కు పిండి డబ్బు వసూలు చేస్తున్నారు. అప్పట్లో వనజాక్షి అనే తహశీల్దారుపై మీ ఎమ్మెల్యే దాడి చేయలేదా?. వారి విషయంలో చంద్రబాబు రాజీ చేయలేదా?.

నాగావళి, కృష్ణా, గోదావరిలో ఇసుక దోపిడీ చేసింది టీడీపీ నేతలే. ఎన్జీటీ సైతం వంద కోట్ల పెనాల్టీ వేసింది చంద్రబాబు హయాంలోనే కదా. రూ.3,825 వేల కోట్లు మా హయాంలో ప్రభుత్వానికి వచ్చింది. మా ప్రభుత్వ హయాంలో ఇసుక అక్రమ రవాణా చేసిన వారిపై కేసులు పెట్టాం. వర్షాకాలంలో ఉపయోగపడేలా ఇసుక నిల్వలు పెడితే వాటిని టీడీపీ నేతలు అక్రమంగా అమ్ముకున్నారు. ల్యాండ్ టైటిలింగ్‌ యాక్టు ఎప్పటికైనా అమలు చేయాల్సిందే. కానీ, దానిపై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేసి ఎన్నికలలో లబ్ది పొందారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చట్టం అది, రాష్ట్రానికి సంబంధం లేదు. ఆ చట్టం తప్పు అయితే కేంద్రతో మాట్లాడి అక్కడే ఆపేయించాలి’ అని డిమాండ్‌ చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement