మిస్ ఇండియా ఏసియాగా గీతం విద్యార్థిని
పటాన్‌చెరు: గీతం యూనివర్సిటీకి చెందిన జొన్నలగడ్డ మానస ‘మిస్ ఇండియా ఏసియా పసిఫిక్–2017’ టైటిల్ సాధించారు. పటాన్‌చెరు మండలంంలోని రుద్రారం గ్రామంలో ఉన్న గీతం హైదరాబాద్ క్యాంపస్‌లో ఆమె ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ మూడో ఏడాది చదువుతున్నారు. ఆమె టైటిల్ సాధించడం పట్ల గీతం ప్రొ వైస్ చాన్స్‌లర్ ఎన్.శివప్రసాద్ శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల థాయ్‌లాండ్‌లోని పట్టాయలో జరిగిన పోటీల్లో ఆమె ఈ ఘనత సాధించారని ఆయన వివరించారు. మనదేశంతో పాటు దుబాయ్, సింగపూర్, మలేసియా, థాయిలాండ్, శ్రీలంకకు చెందిన ఔత్సాహికులతో మానస పోటీ పడి టైటిల్ సాధించారని ఆయన సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించారు.
క్విల్లింగ్‌లో శివాలి గిన్నిస్ రికార్డు..
తమ కళాశాల విద్యార్థిని ఒకరు గిన్నిస్ రికార్డు సాధించారని గీతం ప్రొ వీసీ శివప్రసాద్ తెలిపారు. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రెండో ఏడాది చదువుతున్న శివాలి తన తల్లితో కలసి క్విల్లింగ్ (కాగితంతో వివిధ కళారూపాలు చేసే కళ)లో గిన్నిస్ రికార్డు సాధించారని తెలిపారు. శివాలి, ఆమె తల్లి కవిత 7,011 కాగితపు బొమ్మలను తయారు చేసి రికార్డు సృష్టించారని చెప్పారు.
గిన్నిస్ రికార్డు పత్రంతో శివాలి కుటుంబసభ్యులు