
విశాఖ తూర్పు: విశాఖపట్నంలోని గీతం డీమ్డ్ వర్సిటీకి చెందిన ఓ బీ–ఫార్మసీ విద్యార్థి బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్‌కు చెందిన శశి కుమార్ అలియాస్ రిషి(19) గీతం వర్సిటీలో ఫస్టియర్ బీ ఫార్మసీ చదువుతూ క్యాంపస్ హాస్టల్లో ఉంటున్నాడు. బుధవారం క్యాంపస్ బయటకు వెళ్లి తిరిగి ఆలస్యంగా లోపలకు వస్తుండగా సెక్యూరిటీగార్డు ఆపారు. హాస్టల్‌వార్డెన్‌కు సెక్యూరిటీగార్డు ఫోన్ చేసి చెప్పి శశికుమార్‌ను లోపలికి పంపారు. లోనికి వెళ్లిన శశికుమార్‌ను వార్డెన్ మందలించారు.
బయటకు వెళ్లవద్దని రోజూ చెప్పినా వినడం లేదని, తల్లిదండ్రులకు సమాచారం ఇస్తానని భయపెట్టాడు. మనస్తాపానికి గురైన శశికుమార్ అదే భవనం పైఅంతస్తు నుంచి దూకాడు. శశికుమార్‌ను ఆసుపత్రికి తరలించిగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. గీతం వర్సిటీ అధికారులు వెంటనే శశికుమార్ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ఆత్మ హత్యగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలిస్తామని ఆరిలోవ ఎస్‌ఐ సంతోశ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment