సాక్షి, విశాఖపట్నం : గీతం యూనివర్సిటీ యాజమాన్యం మార్కెట్ ధరకు భూములు తీసుకుని, ఆపై కూడా ప్రభుత్వ భూములు ఆక్రమించారని మంత్రి అవంతి శ్రీనివాసరావు అన్నారు. పార్టీలకు అతీతంగా భూ ఆక్రమణలు తొలగించాలని వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. అందులో భాగంగానే విశాఖలో భూ బకాసురులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ అక్రమ భూములు స్వాధీనం చేసుకుంటే టీడీపీ నాయకులు సునామీ వచ్చినట్టు గగ్గోలు పెడుతున్నారు. నిజంగా టీడీపీ నేతలకు గీతంపై అభిమానం ఉంటే అప్పుడు ఎందుకు క్రమబద్దీకరణ చేయలేదు. రుషికొండలో ఎకరం భూమి 20 కోట్ల రూపాయలు ఉంది. 40 ఎకరాలు అంటే 800 కోట్ల రూపాయలు. (టీడీపీలో చిచ్చు రేపిన నారా లోకేష్)
ప్రభుత్వం భూమి ప్రభుత్వం తీసుకుంది. చంద్రబాబు నాయుడికి గీతం యాజమాన్యం అంటే అభిమానం లేదు.. కేవలం రాజకీయం కోసమే ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారు. చంద్రబాబుకి అమరావతి ఉంటే చాలు. గీతం చారిటీ సంస్థ కాదు.. సీట్ల కోసం లక్షలు వసూలు చేస్తున్నారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించరు. గీతం యాజమాన్యం స్థానిక రుషికొండ.. ఎందాడ ప్రజలకు ఎప్పుడైనా ఫీజ్ తగ్గించి ఇచ్చారా? గీతం యూనివర్సిటీ భూ ఆక్రమణలపై చర్యల విషయంలో టీడీపీ నాయకులు చేస్తున్న విమర్శలు వెనక్కి తీసుకోవాల’’ని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment