హైదరాబాద్ : మెదక్ జిల్లా పటాన్‌చెరువు సమీపంలోని నందిగ్రామ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ప్రతాప్సింగ్ గురువారం రాత్రి తన ఐదేళ్ల కుమార్తెకు ఉరి వేసి చంపేశాడు. అనంతరం తాను కూడా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం ఉదయం ఆ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యుల మధ్య కలహాలే ఈ ఘటనకు కారణమని పోలీసుల భావిస్తున్నారు.