
దినేష్‌కు చేయూతనిద్దాం..
చక్కగా ఆడుకోవాల్సిన వయస్సులో ఆ చిన్నారి ఆసుపత్రుల్లో చికిత్సపొందుతున్నాడు. ఆ బాలుడి పరిస్థితి చూసి వారి తల్లిదండ్రులకు దిక్కుతోచడం లేదు.
* క్యాన్సర్‌తో బాధపడుతున్న బాలుడు
* దిక్కుతోచని స్థితిలో తల్లిదండ్రులు
* ఆపన్న హస్తం కోసం ఎదురు చూపులు
పటాన్‌చెరు: చక్కగా ఆడుకోవాల్సిన వయస్సులో ఆ చిన్నారి ఆసుపత్రుల్లో చికిత్సపొందుతున్నాడు. ఆ బాలుడి పరిస్థితి చూసి వారి తల్లిదండ్రులకు దిక్కుతోచడం లేదు. తమ సమస్య ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి వారిది. క్యాన్సర్ వ్యాధి ఆ కుటుంబాన్ని ఆర్థికంగా అతలాకుతలం చేస్తోంది. బోన్‌మేర్రో కాన్సర్‌తో ఐదున్నరేళ్ల దినేష్ అనే బాలుడు హైదరాబాద్‌లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నాడు.
అక్కడి వైద్యులు ఆయనకు ఖరీదైన వైద్యం తప్పదని చెప్తున్నారు. ఆ బాలుడి చికిత్స కోసం ప్రస్తుతం దాదాపు రూ.20 లక్షలు అవసరమని తేల్చారు. ఇది సరిపోదని ఇంకా ఇతర ఖర్చులకు అదనపు సొమ్ము కావాలని బాలుడి తల్లిదండ్రులు చెప్తున్నారు. దాతల సహకారం కావాలని వారు కోరుతున్నారు. బోన్‌మేర్రో కాన్సర్‌తో ఆ బాలుడి పరిస్థితి దయనీయంగా తయారైంది. దినేష్ తండ్రి గణపతిరావుది శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం గ్రామం సీఎస్‌ఆర్‌పేట. కొద్దికాలం పటాన్‌చెరులో బంధువుల ఇంటి వద్ద ఉన్నారు.
ఇప్పుడు కుమారుడి ఆరోగ్యం కోసం ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. మలక్‌పేటలో బంధువుల వద్ద ఉంటూ బాలుడికి వైద్యం చేయిస్తున్నారు. వెల్లూర్‌లోని క్రిస్టియన్ మెడికల్ ఆసుపత్రిలో ఆ బాలుడికి వైద్యం చేయించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని బసవతారకం ఆసుపత్రిలో చికిత్సలు చేయిస్తున్నారు. వ్యవసా యం మీద ఆధారపడే తన కుమారుడు దినేష్ వైద్య ఖర్చుల కోసం దాతలు సహకరించి సహాయం గణపతి కోరుతున్నారు. చిన్నారిని ఆదుకునేందుకు సహాయం చేయాలనుకునే దాతలెవరైనా 9573811095లో సంప్రదించవచ్చు.