పటాన్‌చెరు : ప్రైవేటు బస్సు కింద పడి ఓ చిన్నారి మృతి చెందింది. ఈ సంఘటన మండలంలోని ఇస్నాపూర్ తేజ కాలనీలో శనివారం చోటు చేసుకుంది. వివరాలిలా..
పటాన్‌చెరు : ప్రైవేటు బస్సు కింద పడి ఓ చిన్నారి మృతి చెందింది. ఈ సంఘటన మండలంలోని ఇస్నాపూర్ తేజ కాలనీలో శనివారం చోటు చేసుకుంది. వివరాలిలా.. కందుకూరు సమీపంలో చీమలపేటలో నివాసముంటున్న ఆదం, తల్లి మరియమ్మ దంపతల కుమారుడు నాని (8)కి సెలవులు కావడంతో ఇస్నాపూర్ తేజ కాలనీలో ఉంటున్న మేనత్త లక్ష్మమ్మ ఇంటికి వచ్చింది. ఇదిలా ఉండగా.. ఓ పరిశ్రమకు చెందిన బస్సులను కాలనీలోని ఖాళీ స్థలం వద్ద పార్కింగ్ చేస్తారు. అయితే వీరు బస్సులను పరిశ్రమకు తీసుకె ళ్లే ముందు కాలనీకి చెందిన పిల్లలను సరదాగా ఓ రౌండ్ తిప్పుతారు.
అందులో భాగంగా శనివారం కూడా పిల్లలు తమను బస్సులో తిప్పాలని కోరారు. అయితే డ్రైవర్ ఇందుకు నిరాకరిస్తూ బస్సును ముందు తీశాడు. ఈ క్రమంలో నాని బస్సును అదుపు తప్పి కిందకు పడ్డాడు. దీనిని గమనించని డ్రైవర్ అలాగే వెళ్లడంతో నాని బస్సు వెనుక చక్రం కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. దీం తో కాలనీలో విషాదం నెలకొంది. ఈ మేరకు కేసును దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.