మూడేళ్ల బాలుడిని చితకబాదిన తండ్రి | 3 Year Old Boy Brutally beaten up By Parents at Patancheru | Sakshi
Sakshi News home page

మూడేళ్ల బాలుడిని చితకబాదిన తండ్రి

Published Fri, Jan 8 2016 1:23 AM | Last Updated on Tue, Aug 28 2018 7:09 PM

మూడేళ్ల బాలుడిని చితకబాదిన తండ్రి - Sakshi

మూడేళ్ల బాలుడిని చితకబాదిన తండ్రి

* తల్లిదండ్రుల అరెస్టు
* అనాథాశ్రమానికి బాలుడి తరలింపు

పటాన్‌చెరుటౌన్: మెదక్ జిల్లా పటాన్‌చెరులో దారుణం జరిగింది. చెప్పినట్టు వినడం లేదని మూడేళ్ల బాలుడిని కన్న తల్లిదండ్రులు చితకబాదారు. తీవ్రంగా గాయపడిన బాలుడిని చూసి స్థాని కులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలుడిని అనాథాశ్రమంలో చేర్పించి తల్లిదండ్రులను అరెస్టు చేశారు. ఈ ఘటన గురువారం చోటుచేసుకుంది. వివరాలు.. శివకుమార్, రాధ దంపతులు. వీరికి మనోహర్(3) కుమారుడు ఉన్నాడు. సదాశివపేట కోనాపూర్‌కు చెందిన శివకుమార్ పటాన్‌చెరుకు వలస వచ్చాడు. స్థానికంగా సేల్స్‌మన్‌గా పనిచేస్తున్నాడు. చెప్పినట్టు వినడం లేదని ఆగ్రహించిన శివకుమార్..

గురువారం తన మూడేళ్ల కుమారుడిపై ప్రతాపం చూపాడు. అందరి ముందే చితకబాదాడు. ఎక్కడికక్కడ ఒళ్లంతా కమిలిపోయినా వదల్లేదు. ఈ తతంగాన్ని బాలుడి తల్లి రాధ చూస్తున్నా అడ్డుకోలేకపోయింది. బాలుడి పరిస్థితిని గమనిం చిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు బాలుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లి వైద్యం చేయించారు. చైల్డ్ డెవలప్‌మెంట్ డెరైక్టర్ చంద్ర ఫిర్యాదు మేరకు బాలుడి తల్లిదండ్రులు శివకుమార్, రాధను పోలీసులు అరెస్టు చేశారు.

బాలుడి పరిస్థితిని తెలుసుకున్న చైల్డ్ డెవలప్‌మెంట్ (చైల్డ్ లైన్ 1098) డెరైక్టర్ చంద్ర తన సిబ్బందితో కలసి పటాన్‌చెరు చేరుకున్నారు. బాలుడిని స్వాధీ నం చేసుకుని అమీన్‌పూర్‌లోని మహిమ మినిస్ట్రీస్‌కు తరలించారు. ఈ సందర్భంగా చెల్డ్ డెవలప్‌మెంట్ డెరైక్టర్ చంద్ర మాట్లాడుతూ.. ఆ బాలుడు తల్లిదండ్రుల వద్ద ఉండడం అంత శ్రేయస్కరం కానందున మహిమ మినిస్ట్రీస్‌కు తరలించినట్టు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement