parents arrested
-
తస్మాత్.. జాగ్రత్త
సాక్షి, చెన్నూర్(ఆదిలాబాద్) : గడప దాటి రోడ్డెక్కితే ఇంటికి క్షేమంగా చేరుకుంటామన్న గ్యారెంటీ లేకుండా పోతుంది. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ వెళ్తున్నా సరే మైనర్లు, తాగుబోతులు ప్రాణాలు తోడేస్తున్నారు. ఇటీవల కాలంలో జరుగుతున్న ప్రమాదాలను చూసినట్లయితే డ్రైవింగ్‌పై అవగాహన లేని మైనర్లు వాహనాలను నడపటం వల్లే ప్రమాదాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయని పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలో అసలు మైనర్లకు వాహనాలు ఇస్తూ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రమాదాలకు కారణమవుతున్న తల్లిదండ్రులపై కేసు నమోదు చేయాలని ఇటీవలే కొత్త అమెండ్మెంట్ వచ్చింది. దీనిపై ప్రత్యేక కథనం. ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు ఏదో ఒక చోట తరచూ జరుగుతుండగా అనేకమంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రమాదాలకు గల కారణాలను పరిశీలిస్తే అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపటం, సెల్‌ఫోన్ మాట్లాడుతూ వెహికిల్స్ తోలడం, పరిమితికి మించి వాహనాల్లో ప్రయాణం తదితరవి కొన్ని కారణాలైతే.. ఏమాత్రం అవగాహన లేని మైనర్లు ద్విచక్ర వాహనాలనే కాక ఫోర్‌వీలర్స్, త్రీవీలర్స్ వాహనాలు కూడా నడపటం ప్రమాదాలు జరుగటానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. పిల్లలు నడిపితే ..తల్లిదండ్రులపై కేసు మోటార్ వెహికల్ యాక్ట్‌లో మరో కొత్త అమెండ్మెంట్ను ఇటీవలే తీసుకువచ్చారు. తల్లిదండ్రులు ఇకపై తమ మైనర్ పిల్లలకు వాహనాలను ఇవ్వకూడదు. పిల్లలు అతివేగంతో, అజాగ్రత్తతో వాహనాలు నడిపి ప్రమాదాలకు కారకులైనా లేక పోలీసులకు పట్టుబడ్డా కొత్త అమెండ్మెంట్ ప్రకారం ఇకపై సదరు మైనర్ల పైనే కాక తల్లిదండ్రులపై కూడా కేసు నమోదు కానుంది. సాధారణంగా వాహనం ఎవరిదైనా సరే దానిని నడిపే సమయంలో సదరు వ్యక్తికి సరైన పత్రాలు లేకుంటే జరిమానాలు విధిస్తూ వచ్చారు. కాగా, ఇప్పుడొచ్చిన కొత్త నిబంధన ప్రకారం మైనర్లు వాహనాలు నడిపితే మైనర్‌తోపాటు తల్లిదండ్రులు లేదా వాహనాన్ని ఇచ్చిన వారిపై కూడా కేసు నమోదు చేసే అధికారాలు పోలీసులకు ఉన్నాయి. పేరెంట్స్ బీ కేర్‌ఫుల్ కొత్తగా వచ్చిన మోటార్ వాహనాల చట్టం ప్రకారం ఇకపై తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 18 ఏళ్లు వచ్చిన తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ పొందిన వారికే పేరెంట్స్ వాహనాలు ఇవ్వాలి. లైసెన్స్ లేకుండా నడిపితే చర్యలు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే చర్యలు తీసుకుంటాం. కొత్తగా వచ్చిన ఎంవీ అమెండ్మెంట్ ప్రకారం మైనర్లకు వాహనం ఇచ్చిన తల్లిదండ్రులపైనా కేసు నమోదు చేస్తాం. డైవింగ్ చేసే వారు ఎవరైనా సరే వాహనానికి సంబంధించిన పేపర్లతోపాటు లైసెన్స్ తప్పనిసరి కలిగి ఉండాలి. మైనర్లు డ్రైవింగ్ చేయటం నేరం. ప్రమాదాలను నివారించేందుకు ట్రాఫిక్ నిబంధనలు ప్రతీ ఒక్కరూ పాటించాలి. – శ్రీకాంత్, ఆర్కేపీ ఎస్ఐ -
తల్లి చంపితే.. తండ్రి పాతి పెట్టాడు
ఇబ్రహీంపట్నం : నవమాసాలు మోసి కన్న బిడ్డనే... ఆ కసాయి తల్లి కడతేర్చింది. అల్లరి చేస్తుందనే కారణంతో మూగ చెవుడుతో పుట్టిన ఏడేళ్ల కూతుర్ని అత్యంత అమానుషంగా ఇటుక రాయితో కొట్టి చంపింది. ఆనక భర్తతో కలిసి మృతదేహాన్ని పాతి పెట్టి అదృశ్యమైందంటూ డ్రామాలాడింది. మానవత్వాన్ని ఎక్కిరించే ఈ సంఘటన యాచారం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇబ్రహీంపట్నంలోని తన కార్యాలయంలో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ మల్లారెడ్డి ఈ ఘాతుకానికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన భార్యాభర్తలు బల్లటి చత్రియ, హేతురాంలు యాచారం మండల పరిధిలోని చింతుల్ల శివార్లలోని బీఎన్సీ ఇటుక బట్టీలో పనిచేస్తున్నారు. 5 నెలల క్రితమే వీరు వచ్చారు. వీరికి ముగ్గురు ఆడపిల్లలు, ఒక కుమారుడున్నారు. మూగ చెవుడుతో పుట్టిన ఏడేళ్ల ఊర్మిళ వీరికి మూడో సంతానం. మూగచెవుడు కావడం, ఈ చిన్నారి అల్లరి ఎక్కువగా చేస్తుండటం.. పొరుగువారితో తరచూ గొడవ పడుతుండటంతో తల్లి చత్రియ(39) బిడ్డను చంపాలని నిర్ణయించుకుంది. దీంతో 26వ తేదీ మధ్యాహ్నం ఆ చిన్నారి గుడిసెలో నిద్రిస్తుండగా ఇటుకతో తలపై కొట్టి చంపింది. సమీపంలోని చెట్టుకింద నిద్రిస్తున్న భర్త హేతురాంను లేపి ఈ విషయాన్ని చెప్పింది. మృతదేహన్ని ఏం చేయాలో వారికి అర్థంకాలేదు. దీంతో సమీపంలోని ఇటుకబట్టీల్లో కాల్చేసిన బూడిద పొట్టు కుçప్పను తవ్వి అందులో చిన్నారి మృతదేహాన్ని తండ్రి హేతురాం పాతిపెట్టాడు. అనంతరం చిన్నారి తప్పిపోయిందంటూ డ్రామాలాడారు తప్ప పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ముందుకురాలేదు. ఈ విషయం తెలిసిన బట్టీ యాజమాని ఆ చిన్నారి తల్లిదండ్రులతో 27న యాచారం పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్ కేసు కింద ఫిర్యాదు చేయించారు. దీనిపై విచారణ చేపట్టిన సీఐ కృష్ణంరాజుకు తల్లిదండ్రులపైనే అనుమానం కలిగింది. ఇటుక బట్టీల వద్ద దుర్వాసన వస్తుండటంతో పోలీసులకు అనుమానం మరింత బలపడింది. తల్లి చత్రియను బిడ్డ ఎక్కడుందో చెప్పాలని గట్టిగా అడుగగా... కాల్చి ఉన్న పొట్టు కుప్పలో ఆ చిన్నారి చేయి కనబడుతుందని పోలీసులకు తెలిపింది. అక్కడికి వెళ్లి తవ్విచూడగా ఊర్మిళ మృతదేహం లభ్యమైంది. కానీ తల్లిదండ్రుల్లో బిడ్డ చనిపోయిన బాధ కలగకపోవడంతో వారిపై మరింత అనుమానం పోలీసులకు బలపడింది. డాగ్ స్క్వాడ్స్‌ను రప్పించగా సమీపంలోని చత్రియ గుడిసెలోకి వెళ్లింది. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టగా తల్లిదండ్రులే ఆ చిన్నారిని హతమార్చారని తేలింది. దీంతో చత్రియ, హేతురాం(45)లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసును సమయస్ఫూర్తితో ఛేదించిన సీఐ కృష్ణంరాజును ఏసీపీ మల్లారెడ్డి అభినందించారు. -
మూడేళ్ల బాలుడిని చితకబాదిన తండ్రి
* తల్లిదండ్రుల అరెస్టు * అనాథాశ్రమానికి బాలుడి తరలింపు పటాన్‌చెరుటౌన్: మెదక్ జిల్లా పటాన్చెరులో దారుణం జరిగింది. చెప్పినట్టు వినడం లేదని మూడేళ్ల బాలుడిని కన్న తల్లిదండ్రులు చితకబాదారు. తీవ్రంగా గాయపడిన బాలుడిని చూసి స్థాని కులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలుడిని అనాథాశ్రమంలో చేర్పించి తల్లిదండ్రులను అరెస్టు చేశారు. ఈ ఘటన గురువారం చోటుచేసుకుంది. వివరాలు.. శివకుమార్, రాధ దంపతులు. వీరికి మనోహర్(3) కుమారుడు ఉన్నాడు. సదాశివపేట కోనాపూర్‌కు చెందిన శివకుమార్ పటాన్‌చెరుకు వలస వచ్చాడు. స్థానికంగా సేల్స్‌మన్‌గా పనిచేస్తున్నాడు. చెప్పినట్టు వినడం లేదని ఆగ్రహించిన శివకుమార్.. గురువారం తన మూడేళ్ల కుమారుడిపై ప్రతాపం చూపాడు. అందరి ముందే చితకబాదాడు. ఎక్కడికక్కడ ఒళ్లంతా కమిలిపోయినా వదల్లేదు. ఈ తతంగాన్ని బాలుడి తల్లి రాధ చూస్తున్నా అడ్డుకోలేకపోయింది. బాలుడి పరిస్థితిని గమనిం చిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు బాలుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లి వైద్యం చేయించారు. చైల్డ్ డెవలప్మెంట్ డెరైక్టర్ చంద్ర ఫిర్యాదు మేరకు బాలుడి తల్లిదండ్రులు శివకుమార్, రాధను పోలీసులు అరెస్టు చేశారు. బాలుడి పరిస్థితిని తెలుసుకున్న చైల్డ్ డెవలప్మెంట్ (చైల్డ్ లైన్ 1098) డెరైక్టర్ చంద్ర తన సిబ్బందితో కలసి పటాన్చెరు చేరుకున్నారు. బాలుడిని స్వాధీ నం చేసుకుని అమీన్‌పూర్‌లోని మహిమ మినిస్ట్రీస్‌కు తరలించారు. ఈ సందర్భంగా చెల్డ్ డెవలప్మెంట్ డెరైక్టర్ చంద్ర మాట్లాడుతూ.. ఆ బాలుడు తల్లిదండ్రుల వద్ద ఉండడం అంత శ్రేయస్కరం కానందున మహిమ మినిస్ట్రీస్‌కు తరలించినట్టు చెప్పారు. -
ప్రేమజంటను చంపిన తల్లిదండ్రులు అరెస్ట్
ధోలాపూర్: పరువు హత్యలకు పాల్పడ్డ కేసులో దంపతులను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. పరువు హత్యల ఘటన రాజస్థాన్‌లోని ధోలాపూర్‌లో సంచలనం సృష్టించిన విషయం అందరికీ విదితమే. పోలీసుల కథనం ప్రకారం... నరేశ్ ఠాకూర్(21), భారతి కుశ్వాహ(19)లు గత ఎనిమిది నెలల నుంచి ప్రేమించుకుంటున్నారు. తమ ప్రేమ విషయాన్ని భారతి తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లింది. తమ కులాలు వేరని కూతురికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. పెళ్లి చేసుకుని ఒక్కటవ్వాలనుకున్న ఆ జంటకు నిరాశే ఎదురైంది. తల్లిదండ్రులు వారిస్తున్నప్పటికీ, భారతి తన ప్రియుడిని తరచూ కలుస్తుండేది. కూతురి ప్రవర్తనతో ఆవేశానికి లోనైన ఆమె తల్లిదండ్రులు గిరిరాజ్, జల్దేవిలు తమ అల్లుడు శైలేంద్రతో కలిసి ప్రేమజంటను హత్య చేసేందుకు కుట్రపన్నారు. అమ్మాయి బావ ఆ జంటకు పెళ్లి చేస్తామని చెప్పి వారిద్దరని ఓ ప్రాంతానికి పిలిపించాడు. అప్పటికే ఆ ప్రాంతంలో అమ్మాయి తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ధోలాపూర్ సమీపంలోని నాగ్ల గ్రామంలో నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి తమ పథకం ప్రకారం వారిని గొంతు నులిమి హత్యచేశాడు. ఈ పరువు హత్యకు పాల్పడినందుకు అమ్మాయి తల్లిదండ్రులను అరెస్టు చేసినట్లు ధోలాపూర్ ఎస్పీ రాజేష్ సింగ్ తెలిపారు. మరో నిందితుడు శైలేంద్ర ప్రస్తుతం పరారీలో ఉన్నాడని దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు చెప్పారు. -
పిల్లాడి మరణం.. భారత సంతతి తల్లిదండ్రుల అరెస్టు
అమెరికాలోని కనెక్టికట్ రాష్ట్రంలో 19 నెలల పిల్లాడు చనిపోవడంతో అతడి తల్లిదండ్రులను పోలీసులు అరెస్టు చేశారు. బేబీ సిట్టర్ నేలకేసి కొట్టడంతో ఆ పిల్లాడి తల పగిలి, లోపల అంతర్గత రక్తస్రావం కూడా ఎక్కువగా అయ్యింది. దీంతో శస్త్రచికిత్స చేసినా ఉపయోగం లేకుండా పోయింది. ఈ కేసులో ముందుగానే బేబీ సిట్టర్ కింజల్ పటేల్‌ను అరెస్టు చేసిన పోలీసులు.. పిల్లాడి మృతి అనంతరం తల్లిదండ్రులు శివకుమార్ మణి (33), తెనిమొళి రాజేంద్రన్ (24)లను కూడా అరెస్టు చేశారు. పిల్లాడికి ప్రమాదం కలిగేలా ప్రవర్తించి, బేబీ సిట్టర్ వద్ద వదిలేసిన నేరానికి గాను తల్లిదండ్రులు ఇద్దరిపై అభియోగాలు నమోదు చేశారు. పిల్లవాడిపై తనకు బాగా కోపం వచ్చిందని, అందుకే అతడిని న్యూహావెన్ నగరంలోని తన ఇంట్లో నేలకేసి విసిరికొట్టానని కింజల్ పటేల్ పోలీసులకు తెలిపింది. దాంతో అతడి కపాలం పగిలిపోయింది.