అక్రమ దత్తత: బాలుడి దీనగాద | Two Years Baby Boy Sad Story in Illegal Adoption Hyderabad | Sakshi
Sakshi News home page

అక్రమ దత్తత: ముగ్గురిపై కేసు

Published Wed, Jun 17 2020 10:37 AM | Last Updated on Wed, Jun 17 2020 10:37 AM

Two Years Baby Boy Sad Story in Illegal Adoption Hyderabad - Sakshi

హైటెక్‌ సిటీ వద్ద దొరికిన రెండేళ్ల బాలుడు

పటాన్‌చెరు టౌన్‌: అక్రమ దత్తత వ్యవహారంలో ముగ్గురిపై కేసు నమోదు చేసిన ఘటన పటాన్‌చెరు పోలీసు స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ సాయిలు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. లింగంపల్లికి చెందిన హరణ్‌ పాత బట్టల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో గత ఏడాది వినాయక చవితి రోజున హైటెక్‌ సిటీ సమీపంలో పాత బట్టలు అమ్ముతున్న సమయంలో వర్షం రాకతో రెండు సంవత్సరాల బాలుడు అతని వద్దకు తడుస్తూ వచ్చాడు. దీంతో హరణ్‌ చుట్టు పక్కల బాలుడికి సంబంధించిన వారు లేకపోవడంతో ఆ బాలుడి తీసుకొని పటాన్‌చెరు సాయి కాలనీలో ఉండే మామా యాకోబ్‌ ఇంటికి వచ్చాడు.

దీంతో యాకోబ్, అతడి భార్య సరోజ పిల్లలు లేని కారణంగా ఆ బాలుడిని వారి వద్ద ఉంచుకున్నారు. అప్పటి నుంచి వారు ఆ బాలుడిని పెంచుకుంటున్నారు. బాలుడి దత్తత అక్రమని వారు సొంత తల్లిదండ్రులు కాదని జిల్లా ఉమెన్‌ అండ్‌ చైల్డ్‌ వెల్ఫేర్‌ అధికారికి ఫిర్యాదు చేయడంతో ఈ మేరకు పోలీసులు బాలుడిని తెచ్చిన హరణ్, అక్రమ దత్తత తీసుకున్న యాకోబ్, సరోజ ముగ్గురు పై కేసు నమోదు చేశారు. కాగా బాలుడిని సంగారెడ్డి శిశువిహార్‌కు పంపించి ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement