
పటాన్‌చెరు టౌన్: భర్తను హత్య చేసి భార్యపై హత్యాయత్నానికి పాల్పడిన కేసులో రెండవ అడిషన ల్ కోర్టు ముగ్గురికి జీవితఖైదు విధించింది. ఒక్కొ క్కరు రూ.5 వేల జరిమానా చెల్లించాలని కోర్టు శుక్రవారం ఆదేశించింది. 2014లో పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన వివరాలు సీఐ వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. రామచంద్రా పురానికి చెందిన ఉప్పు ప్రశాంత్ రామేశ్వరంబండ వీకర్‌సెక్షన్ కాలనీలో నివాసం ఉండేవాడు.
ప్రశాంత్ ఇంటి పక్కనే శ్రీనివాస్ నివాసం ఉండేవాడు. కాగా ప్రశాంత్ ఒక కుక్కను పెంచుకున్నాడు. అది శ్రీనివాస్ ఇంటికి వెళ్లడంతో.. వాళ్లు కొట్టి చంపారు. దీంతో ప్రశాంత్, శ్రీనివాస్‌ల మధ్య గొడవ జరిగిం ది. దీంతో బొంబాయి కాలనీకి చెందిన మ్యాతరి ప్రకాష్, నక్కోల వినోద్‌లతో కలసి 2014 జూలైలో శ్రీనివాస్ ఇంటిపై దాడి చేశాడు. ఘటనలో శ్రీని వాస్ చనిపోగా, అతడి భార్య రేణుక గాయపడింది.
హత్య, హత్యాయత్నం ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశా రు. అప్పటినుంచి కేసుకు సంబంధించిన వాదన లు కోర్టులో నడుస్తున్నాయి. శుక్రవారం అడిషనల్ పీపీ మహ్మద్ మహబూబ్ వాదనలు విన్న జిల్లా రెండవ అడిషనల్ కోర్టు న్యాయమూర్తి అనిత నిందితులకు జీవితఖైదు విధించారు.