పటాన్చెరు: తమకు వేతనాలు పెంచాలంటూ అల్కబీర్ కార్మికులు గురువారం నుంచి సమ్మె ప్రారంభించారు. అంతర్జాతీయ స్థాయిలో పశువధశాలగా గుర్తింపు పొందిన అల్కబీర్ కార్మికులు తమకు న్యాయం చేయాలని సీఐటీయూ ఆధ్వర్యంలో పరిశ్రమ గేటు దగ్గరలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పరిశ్రమ యూనియన్ నాయకుడు రవీందర్ మాట్లాడుతూ కొత్త వేతన ఒప్పందం చేయాలని తాము కార్మిక శాఖ వారి సమక్షంలో కోరినా ఫలితం లేదన్నారు. అకారణంగా తొలగించిన కార్మికులను విధుల్లోకి చేర్చుకోవాలని, న్యాయంగా తమకు రావాల్సిన ఇతర బకాయిలను ఇప్పించాలని కోరుతూ సమ్మె చేస్తున్నామన్నారు.