Labour Strike
-
అదే సంకల్పం...ఆగని సమరం
ఉక్కునగరం(గాజువాక): విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెంలోని స్టీల్‌ప్లాంట్ ఆర్చ్ వద్ద ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో చేపడుతున్న రిలే నిరాహార దీక్షలు ఆదివారానికి 500 రోజులు పూర్తి కానున్నాయి. స్టీల్‌ప్లాంట్‌ను శతశాతం వ్యూహాత్మక అమ్మకం చేయాలని గతేడాది జనవరి 27న కేంద్ర కేబినెట్ కమిటీ ఆన్ ఎకనమిక్ ఎఫైర్స్ కమిటీ నిర్ణయించింది. దీంతో ఉక్కు కార్మిక వర్గం భగ్గుమంది. ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా పలు ఆందోళనలు నిర్వహించింది. ఉక్కు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఢిల్లీలో రెండు రోజలు ధర్నాలు చేపట్టారు. ముఖ్యంగా జాతీయ రహదారిని రెండు రోజుల పాటు దిగ్భందించారు. స్టీల్‌ప్లాంట్ పరిపాలన భవనం, గేట్ల ముట్టడి చేపట్టారు. ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో పార్లమెంట్లో పలువురు ఎంపీలు అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పింది. ఇందులో భాగంగా అమ్మకాల ప్రక్రియలకు ట్రాన్సాక్షన్, లీగల్ అడ్వైజర్ల నియామకాలు చేపట్టింది. ఉక్కు ఉద్యమానికి బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు, రచయితలు, మేధావులు, రైతు సంఘాలు, ప్రజా సంఘాలు ఇలా అన్ని వర్గాలకు చెందిన వారు మద్దతు ఇస్తూ దీక్షల్లో పాల్గొంటున్నారు. దీక్షలు ప్రారంభించి 500 రోజులు పూర్తవుతున్న సందర్భంగా ఆదివారం పలు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. నేడు నగరానికి మహా ప్రదర్శన ఉద్యమం 500వ రోజుకు చేరుకుంటున్న సందర్భంగా ఆదివారం ఉదయం స్టీల్‌ప్లాంట్ నుంచి నగరానికి మహా ర్యాలీ నిర్వహించేందుకు ఉక్కు పరిరక్షణ కమిటీ ఏర్పాట్లు చేసింది. 10వేల మంది ఉక్కు ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులు, నిర్వాసితులు, యువకులు, మాజీ ఉద్యోగులు, ప్రజా సంఘాల నాయకులు ఈ ప్రదర్శనలో పాల్గోనున్నారు. ఈ నెల 27న కలెక్టర్‌కు వినతిపత్రం అందజేయనున్నారు. మహా ప్రదర్శన విజయవంతం చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు పరిరక్షణ పోరాట కమిటీ ప్లాంట్‌లో, ఉక్కునగరంలో, నిర్వాసిత కాలనీల్లో విస్తృత ప్రచారం చేసింది. మహా ప్రదర్శన రూట్‌మ్యాప్ ప్రదర్శన కార్యక్రమం ఆదివారం ఉదయం ఉక్కునగరం నుంచి దేశపాత్రునిపాలెం, శనివాడ, అగనంపూడి, కూర్మన్నపాలెం, వడ్లపూడి మీదుగా కూర్మన్నపాలెం దీక్ష శిబిరం వద్దకు చేరుకుంటుంది. అక్కడ నుంచి ఉదయం 9 గంటలకు బైక్‌లపై నగరంలో డీఆర్ఎం కార్యాలయానికి చేరుకుని.. అక్కడ నుంచి కాలినడకన జీవీఎంసీ మహాత్మాగాంధీ విగ్రహం వరకు ప్రదర్శన కొనసాగనుంది. అక్కడ బహిరంగ సభ నిర్వహించనున్నట్టు పోరాట కమిటీ నాయకులు తెలిపారు. ఫిబ్రవరి 2021 2న కేంద్ర నిర్ణయం బయటకు పొక్కింది. 3న వేలాది మంది కార్మికులు ఉక్కు పరిపాలన భవనాన్ని ముట్టడించారు 5న స్టీల్‌ప్లాంట్ ఆర్చి నుంచి నగరంలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు బైక్ ర్యాలీ చేపట్టారు. 7న ఉక్కు కార్మిక సంఘాలు, అధికార సంఘం, వివిధ అసోసియేషన్లతో పోరాట కమిటీ ఏర్పాటైంది. 10న మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభం 12న స్టీల్‌ప్లాంట్ ఆర్చ్ వద్ద రిలే నిరాహార దీక్షలు ప్రారంభించిన సీపీఐ నారాయణ, నాటి పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు 17న విశాఖ విమానాశ్రయంలో పోరాట కమిటీ నాయకులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమావేశం 18న స్టీల్‌ప్లాంట్ ఆర్చ్ వద్ద బీజేపీ మినహా మిగతా అన్ని రాజకీయపార్టీలతో భారీ బహిరంగ సభ 20న జీవీఎంసీ నుంచి కూర్మన్నపాలెం దీక్షా స్థలి వరకు 25 కిలోమీటర్ల మేర ఎంపీ విజయసాయిరెడ్డి, వైఎస్సార్ సీపీ నేతల పాదయాత్ర 26న జాతీయ రహదారిపై రాస్తారోకో 27, 28వ తేదీల్లో రెండు రోజుల పాటు జాతీయ రహదారి దిగ్భందం మార్చి 2021 9న ఉక్కు పరిపాలన భవనం ముట్టడి 14న కూర్మన్నపాలెం నుంచి గాజువాక వరకు పాదయాత్ర 15న ఢిల్లీలో వివిధ పార్టీల ఎంపీలకు వినతిపత్రాల సమర్పణ 20న వేలాది మందితో ఉక్కు త్రిష్ణా మైదానంలో కార్మిక గర్జన 26న రైతు చట్టాలు, స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై భారత్ బంద్ 31న నిర్వాసిత సంఘాల ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్ ఏప్రిల్ 2021 4న ఆర్.కె బీచ్‌లో నిరసన ప్రదర్శన 8న అగనంపూడి నుంచి బీహెచ్‌పీవీ వరకు 10 వేల మందితో 10 కిలో మీటర్ల మానవహారం 18న రైతాంగ పోరాట నాయకుడు రాకేష్ సింగ్ తికాయత్ ఆధ్వర్యంలో రైతు, కార్మిక గర్జన మే 2021 22న దీక్ష శిబిరం వద్ద 100 జెండాలు, 100 మీటర్ల బ్యానర్‌తో వంద మంది దీక్ష 22న ఉద్యోగులు తమ ఇళ్ల వద్ద కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన జూన్ 2021 స్టీల్‌ప్లాంట్ కార్మిక నాయకుల ఆధ్వర్యంలో రిలే దీక్షలు జూలై 2021 8న ఉక్కు గేట్ల వద్ద ధర్నా 9న సీపీఐ కార్యదర్శి నారాయణ దీక్ష స్థలి సందర్శన 10న నగరంలోని మహాధర్నాకు బైక్ ర్యాలీ 15న కోక్‌ఓవెన్స్ నుంచి మెయిన్ గేటు వరకు పాదయాత్ర 27న చలో అడ్మిన్ కార్యక్రమం (చదవండి: ప్రజల చెంతకే పాలన... జగనన్నతోనే సాధ్యం) -
వేతనాల పెంపుపై స్పందించడం లేదు: సినీకార్మికులు
-
సినీ కార్మికుల సమ్మె: ఫిలిం ఫెడరేషన్ ఆఫీస్ ఎదుట ఉద్రిక్తత
టాలీవుడ్లో నేటి(జూన్ 22)నుంచి సినిమా షూటింగ్స్ నిలిచిపోయాయి. వేతన పెంపు కోరుతూ సినీ కార్మికులు ఈ నిర్ణయం తీసుకున్నారు. తమ వేతనాలు పెంచాలని సిని కార్మికులు గత కొన్నిరోజులుగా డిమాండ్ చేస్తున్నారు. దీనిపై నిర్మాతల మండలి స్పందించకోవడంతో సినీ కార్మికులు షూటింగ్స్‌కి హాజరు కాలేదు. ప్రతి మూడేళ్లకు ఒక్కసారి కార్మికుల వేతనాలు పెంచాల్సి ఉన్నప్పకీ.. నాలుగేళ్లు దాటినా వేతనాల ఊసే లేదని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. ఇదిలా ఉండగా కాసేపట్లో 24 క్రాఫ్ట్స్ సభ్యుల సమావేశం జరగునుంది.ఈ నేపథ్యంలో ఫిలిం ఫెడరేషన్ ఆఫీస్ ముందు భారీగా పోలీసులు మొహరించారు. సమావేశంలో కార్మిక సంఘాల నాయకులు మాత్రమే ఉండాలని పోలీసలు స్పష్టం చేశారు. కార్మికులెవరు గుమిగూడవద్దని హెచ్చిరంచారు. -
సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలి
మక్తల్ : కార్మికుల హక్కుల రక్షణకు సెప్టెంబర్ 2న దేశవ్యాప్తంగా చేపట్టిన సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని ఐఎఫ్టీయూ జిల్లా సహాయకార్యదర్శి కిరణ్ అన్నారు. ఆదివారం పట్టణంలోని సార్వత్రిక సమ్మె విజయవంతం చేయాలని సమావేశాలు, బైక్‌ర్యాలీతో నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చామని అన్నారు. అందులో భాగంగానే పట్టణంలోని ఐబీ నుంచి నెహ్రూగంజ్, సంగంబండ, నల్లజానమ్మగుడి, పాతబజార్ మీదుగా అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించిన అనంతరం రాస్తారోకో నిర్వహించారు. పనికి తగిన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయని అన్నారు. కార్యక్రమంలో ఇప్టూ నాయకులు భుట్టో, శ్రీనివాసులు, రమేష్, రాము, గోపి, రాజు, వెంకటేష్, సజన్, మారెప్ప, దేవప్ప, తదితరులు పాల్గొన్నారు. -
సార్వత్రిక సమ్మె విజయవంతం చేయండి
మక్తల్: సెప్టంబర్ 2న దేశ వ్యాప్త సమ్మేను విజయవంతం చేయాలని ఇఫ్టూ ఆధ్వర్యంలో మక్తల్‌లో బుధవారం పోస్టర్‡ విడుదల చేశారు. అనంతరం కార్యలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికుల సమస్యలు ఏమాత్రం పరిష్కరించడం లేదని అన్నారు.నెలకు 18 వేల రూపాయాలు వేతనం ుఇవ్వాలని డిమాండ్ చేశారు.నిత్యావసర వస్తువల ధరలు విపరీతంగా పెరిగాయని విమర్షించారు. కాంట్రాక్టు పద్దతిని రద్దు చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఇప్టూ నాయకులు కిరణ్, భుట్టో, రాము, శ్రీనువాసులు,లక్ష్మణ నర్సిములు,చెన్నయ్య, రాములు తదితరులు పాల్గొన్నారు. -
సార్వత్రిక సమ్మె పోస్టర్ విడుదల
మరికల్ (ధన్వాడ) : కార్మిక సమస్యలపై సెప్టెంబర్ 2న దేశవ్యాప్తంగా తలపెట్టిన సార్వత్రిక సమ్మె పోస్టర్‌ను ఆదివారం మరికల్లో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ డివిజన్ కార్యదర్శి వెంకటేష్ మాట్లాడుతూ కార్మికులు ఎదుర్కొంటున్న 12 డిమాండ్లను ఎన్డీఏ ప్రభుత్వం వ్యతిరేకించడంతో చేపట్టిన ఈ సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్మికులు పాల్గొన్నారు. -
అల్‌కబీర్ కార్మికుల సమ్మె
పటాన్చెరు: తమకు వేతనాలు పెంచాలంటూ అల్‌కబీర్ కార్మికులు గురువారం నుంచి సమ్మె ప్రారంభించారు. అంతర్జాతీయ స్థాయిలో పశువధశాలగా గుర్తింపు పొందిన అల్‌కబీర్ కార్మికులు తమకు న్యాయం చేయాలని సీఐటీయూ ఆధ్వర్యంలో పరిశ్రమ గేటు దగ్గరలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పరిశ్రమ యూనియన్ నాయకుడు రవీందర్ మాట్లాడుతూ కొత్త వేతన ఒప్పందం చేయాలని తాము కార్మిక శాఖ వారి సమక్షంలో కోరినా ఫలితం లేదన్నారు. అకారణంగా తొలగించిన కార్మికులను విధుల్లోకి చేర్చుకోవాలని, న్యాయంగా తమకు రావాల్సిన ఇతర బకాయిలను ఇప్పించాలని కోరుతూ సమ్మె చేస్తున్నామన్నారు. -
రోడ్డునపడ్డ ఓఎల్సీటీ కంపెనీ కార్మికులు
నల్లగొండ: జిల్లాకు చెందిన ఓ కంపెనీ లాట్ ప్రకటించడంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. నార్కట్ పల్లికి చెందిన ఓఎల్సీటీ కంపెనీ లాట్ ప్రకటించడంతో సుమారు 70 మంది ఉద్యోగులు రోడ్డునపడ్డారు. 3 రోజుల కిందట కార్మికుల దాడిలో మేనేజర్ మస్తాన్ రావు గాయపడి మృతిచెందిన విషయం విదితమే. తరచు వివాదాలు తలెత్తుతున్నాయన్న కారణంగా కంపెనీని మూసివేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. ఆందోళన చేపట్టాలని ఆ కంపెనీ కార్మిక సంఘం నిర్ణయించుకుంది. -
ఎక్కడికక్కడే నిలిచిపోయినన ఆర్టీసీ
హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టడంతో ఆర్టీసీ బస్సులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. రోడ్డు సేఫ్టీ బిల్లు రద్దు చేయాలని కోరుతూ నగరంలోని బస్ డిపోల ముందు కార్మికులు బుధవారం నాడు సమ్మె చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హయత్‌నగర్ డిపో ముందు కార్మికులు ధర్నా చేపట్టడంతో 254 బస్సులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
కార్మికుల డిమాండ్లపై సీఎంతో చర్చించి నిర్ణయం
హైదరాబాద్: జీహెచ్ఎంసీ కార్మికులు చేపట్టిన సమ్మెను విరమింప చేసే దిశగా తమ ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించిందని తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నరసింహరెడ్డి మంగళవారం హైదరాబాద్‌లో వెల్లడించారు. అందులోభాగంగా జీహెచ్ఎంసీ కార్మికులతో నేడు మరోసారి మంత్రుల బృందం చర్చలు జరుపుతుందని తెలిపారు. కార్మికుల డిమాండ్లపై సీఎం కేసీఆర్‌తో చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు. జీతాలు పెంచాలని జీహెచ్ఎంసీ కార్మికులు చేపట్టిన సమ్మె మంగళవారానికి రెండో రోజు చేరిన సంగతి తెలిసిందే. -
హార్లిక్స్ ఫ్యాక్టరీలో కార్మికుల ధర్నా
రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా ధవలేశ్వరంలోని హార్లిక్స్ ఫ్యాక్టరీలోని కార్మికులు తమ న్యాయమైన డిమాండ్లను తీర్చాలని ధర్నాకు దిగారు. సోమవారం రాత్రి నుంచి ఫ్యాక్టరీ ఆవరణలో నిరాహారదీక్ష చేపడుతున్నారు. దీంతో యూనియన్ అధ్యక్షుడు జయబాబు అస్వస్థతకు గురయ్యాడు. అయిన యాజమాన్యం వైఖరిలో ఏలాంటి మార్పు రాకపోవడంతో మంగళవారం ఉదయం నుంచి నిరసన కార్యక్రమాలను ఉధృతం చేశారు.