కుమారుడు నానితో శిరీష (ఫైల్)
పటాన్‌చెరు టౌన్: కూరగాయలు కొనేందుకు మార్కెట్‌కు వెళ్లిన తల్లీకొడుకు అదృశ్యమైన ఘటన పటాన్‌చెరు పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై సాయిలు వివరాల ప్రకారం వనపర్తి జిల్లా పానగల్లు మండలం వెంకటయ్యపాలెం గ్రామానికి చెందిన ఓంకార్, భార్య శిరీషతో కుమారుడు నానితో కలిసి బతుకుదెరువు నిమిత్తం పటాన్‌చెరు శివారు ఏపీఆర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు.
చదవండి: బస్టాండ్‌లో భార్య భర్తల మధ్య చెప్పుల గొడవ.. చివరికి..
ఓంకార్ డ్రైవర్‌గా పనిచేస్తుండగా, శిరీష కూలీ పనిచేస్తుంది. వీరికి రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. ఈనెల 27న సాయంత్రం కూరగాయలు కొనేందుకు కుమారుడితో మార్కెట్ వెళ్లిన శిరీష తిరిగి ఇంటికి రాలేదు. బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. కూతురు అదృశ్యంపై స్వగ్రామానికి చెందిన సురేష్‌పై అనుమానం ఉందని శిరీష తండ్రి పోలీసులకు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment