mother and son missing
-
తల్లీకొడుకు అదృశ్యం.. కూరగాయలు కొనేందుకు వెళ్లి..
పటాన్చెరు టౌన్: కూరగాయలు కొనేందుకు మార్కెట్‌కు వెళ్లిన తల్లీకొడుకు అదృశ్యమైన ఘటన పటాన్చెరు పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై సాయిలు వివరాల ప్రకారం వనపర్తి జిల్లా పానగల్లు మండలం వెంకటయ్యపాలెం గ్రామానికి చెందిన ఓంకార్, భార్య శిరీషతో కుమారుడు నానితో కలిసి బతుకుదెరువు నిమిత్తం పటాన్చెరు శివారు ఏపీఆర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. చదవండి: బస్టాండ్‌లో భార్య భర్తల మధ్య చెప్పుల గొడవ.. చివరికి.. ఓంకార్ డ్రైవర్‌గా పనిచేస్తుండగా, శిరీష కూలీ పనిచేస్తుంది. వీరికి రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. ఈనెల 27న సాయంత్రం కూరగాయలు కొనేందుకు కుమారుడితో మార్కెట్ వెళ్లిన శిరీష తిరిగి ఇంటికి రాలేదు. బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. కూతురు అదృశ్యంపై స్వగ్రామానికి చెందిన సురేష్‌పై అనుమానం ఉందని శిరీష తండ్రి పోలీసులకు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
కుమార్తె మృతిని తట్టుకోలేక చనిపోతామంటూ..
మంగళగిరి: పిల్లలను ఉన్నత చదువులు చదివించి వారి భవితను ఉన్నతంగా తీర్చిదిద్దాలని ఆశపడ్డ తల్లిదండ్రుల ఆశలు అడియాసలయ్యాయి. బీఈడీ చదివి సివిల్స్‌కు శిక్షణ తీసుకుంటున్న కుమార్తె అనారోగ్యంతో ఆకస్మికంగా మృతిచెందడంతో తట్టుకోలేకపోయిన తల్లి, సోదరుడు తాము చనిపోతామంటూ ఇంటి నుంచి వెళ్లిపోవడంతో తండ్రి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మంగళగిరి పట్టణంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలో బుడ్డయ్యగారి వీధిలో నివాసముంటున్న పసుపులేటి శ్రీనివాసరావు, నాగలక్ష్మి దంపతులకు ఒక కుమార్తె, కుమారుడు. శ్రీనివాసరావు ఆటోడ్రైవర్‌గా పనిచేస్తూనే పిల్లలిద్దరినీ ఉన్నత చదువులు చదివిస్తున్నాడు. కుమార్తె మహేశ్వరి బీఈడీ పూర్తి చేసి సివిల్స్‌కు శిక్షణ తీసుకుంటుండగా కుమారుడు సాయికిరణ్ బీటెక్ చదువుతున్నాడు. ఇటీవల మహేశ్వరికి కామెర్ల వ్యాధి సోకగా, చికిత్స తీసుకుంటోంది. శుక్రవారం మధ్యాహ్నం విజయవాడ శిక్షణకు వెళ్లి అక్కడ ఆకస్మికంగా మృతి చెందింది. సమాచారం అందుకున్న కుటుంబం అంతా విజయవాడ చేరుకుని మృతదేహాన్ని ఇంటికి తీసుకువస్తుండగా తల్లి, సోదరుడు అప్పుడే మనస్తాపానికి గురై తాము చనిపోతామని కన్నీరుమున్నీరయ్యారు. దీంతో బంధువులు వారిని సముదాయించి ఇంటికి తీసుకువచ్చారు. శనివారం ఉదయం మహేశ్వరి అంత్యక్రియలు పూర్తయిన అనంతరం అందరూ ఇంటికి చేరుకోగా బంధువులంతా వెళ్లిపోవడంతో శ్రీనివాసరావు అలసిపోయి నిద్రకు ఉపక్రమించారు. తర్వాత లేచి చూసేటప్పటికి.. భార్య, కుమారుడు కనిపించకపోవడంతో బంధువులను, స్నేహితులను విచారించాడు. అయినా వారి ఆచూకీ లభించకపోవడంతో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వారి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. చదవండి: ప్రియుడి ఇంటి ముందు మౌనదీక్ష తీరానికి కొట్టుకొచ్చిన భారీ తాబేలు.. -
ఆదిలాబాద్: ఆశ్రమానికి వెళ్లిన తల్లీకొడుకులు అదృశ్యం
సాక్షి, ఇచ్చోడ (ఆదిలాబాద్): ఇద్దరు కుమారుతో పాటు తల్లి అదృశ్యమైన సంఘటన ఇచ్చోడ మండల కేంద్రంలో జరిగింది. ఇచ్చోడ ఎస్సై పరీధ్ కధనం ప్రకారం ఇచ్చోడలో నివాసముంటున్న వివాహిత జాదవ్ సునీత తన ఇద్దరు కుమారులు జాదవ్ సాయి కూమార్, జాదవ్ శివప్రసాద్‌లను తీసుకోని ఈ నెల 10న జైనూర్ మండలంలోని పట్నాపూర్‌లో ఉన్న పూలాజీబాబా అశ్రమానికి వెళ్లారు. అదే రోజు సాయంత్రం 6 గంటల ప్రాంతంలో తాము పూలజీబాబా అశ్రమానికి చేరుకున్నామని తన తండ్రి రాథోడ్ దూదిరామ్‌కు కూతరు సునీత ఫోన్ ద్వారా తెలిపారు. మరుసటి రోజు 11న వారు ఇంటికి తిరిగి రాకపోవడంతో తండ్రి తన కూతురు సునీతకు ఫోన్ చేశారు. ఫోన్ ఇతర వాళ్లు లిప్ట్ చేశారు. ఈ ఫోన్ అశ్రమం వద్ద ఎవరో వదిలి పోయారని తమకు ఫోన్ దొరికిందని సమాదానం రావడంతో వెంటనే దూదిరాం పూలజీబాబా అశ్రమనికి వెళ్లి వాకబు చేశారు. సమీప బందువుల ఇంట్లో వాకబు చేసినా వారి అచూకి తెలియలేదు. సునీత తండ్రి రాథోడ్ దూదిరాం ఈ నెల 14న బుధవారం సాయంత్రం ఇచ్చోడ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే గాదిగూడ మండలంలోని ఖండ్వరాంపూర్ గ్రామనికి చెందిన తన భర్త జాదవ్ కైలాస్ రెండేళ్ల కిందట తనకు తెలియకుండా మరో మహిళను వివాహం చేసుకున్నారని సునీత 2019లో ఇచ్చోడ పోలీస్టేష్‌లో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయడంతో జాదవ్ కైలాస్‌పై ఇచ్చోడ పోలీస్టేషలో కేసు నమెదు అయింది. అకస్మాత్తుగా సునీత తన ఇద్దరు కుమారులతో అదృశ్యం కావడంతో ఇచ్చోడ పోలీసులు కేసు నమెదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. అదృశ్యమైన వారి అచూకి తెలిసిన వారు 9440795015, 9849658648, 8333986929 ఫోన్ నంబర్లకు సమాచారమివ్వాలని ఎస్సై కోరారు. చదవండి: పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ ఎక్కడైనా కనిపించారా? ప్రేమలో గెలిచారు.. జీవితంలో ఓడారు -
కుమారుడితోసహా తల్లి అదృశ్యం
అడ్డగుట్ట: ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లిన తల్లీకొడుకులు అదృశ్యమయ్యారు. ఈ ఘటన తుకారాంగేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ శ్రీను తెలిపిన మేరకు.. తుకారాంగేట్ సాయినగర్ ప్రాంతానికి చెందిన నారపాక భాగ్యశ్రీ(22) తన ఏడు నెలల బాలుడు క్రిష్‌తో కలిసి శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. దీంతో ఆమె భర్త గిరిధర్ పరిసర ప్రాంతాల్లో వెతికినా, తెలిసిన వారిని వాకబు చేసినా ఫలితం కనిపించలేదు. దీంతో తుకారాంగేట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
కుమారుడితో సహా తల్లి అదృశ్యం
పహాడీషరీఫ్: కుటుంబ కలహాల కారణంగా ఓ మహిళ కుమారుడితో సహా అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ శంకర్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. తుక్కుగూడ గ్రామానికి చెందిన భారతి (25), సోమన్న దంపతులకు అఖిరానందన్(01) కుమారుడు ఉన్నాడు. గత కొన్ని రోజులుగా భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 9న మధ్యాహ్నం భారతి కుమారుడిని తీసుకొని ఇంట్లో నుంచి బయటికి వెళ్లి తిరిగా రాలేదు. దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు గాలింపు చేపట్టినా ప్రయోజనం కనిపించలేదు. ఆమె భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
కుమారులతో సహా తల్లి అదృశ్యం
అనంతపురం సెంట్రల్ : కుటుంబ కలహాల కారణంగా ఇద్దరు కుమారులతో కలిసి ఓ తల్లి ఇల్లు వదిలి వెళ్లిపోయింది. త్రీటౌన్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు... నగరంలోని యువజన కాలనీలో శ్రీనివాసులు, రాజేశ్వరి దంపతులు నివాసముంటున్నారు. వీరికి లోకేష్(9), పృథ్వి(6) కుమారులు ఉన్నారు. బోరు లారీ ద్వారా జీవనం సాగిస్తున్నారు. ఇటీవల దంపతుల మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. సోమవారం ఉదయం తీవ్రస్థాయిలో గొడవపడ్డారు. మనస్తాపానికి గురైన రాజేశ్వరి ఇద్దరు కుమారులతో ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఎన్నిచోట్ల వెతికినా ఆమె జాడ కనిపించకపోవడంతో బాధితురాలి తల్లి లక్ష్మీదేవి త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
తల్లీకొడుకు అదృశ్యం
రొద్దం (పెనుకొండ) : మండలంలోని కోగిర గ్రామానికి చెందిన జ్యోతి(26), ప్రణిత్(5) అనే తల్లీకొడుకులు బుధవారం అదృశ్యమైనట్లు ఫిర్యాదు అందిందని ఎస్ఐ మున్నీర్ అహమ్మద్ తెలిపారు. మంగళవారం ఉదయం జ్యోతి తన కొడుకుతో పెనుకొండకు వెళ్తున్నట్లు పక్కింటి వారికి చెప్పి బయలుదేరిందన్నారు. రాత్రైనా ఇంటికి రాకపోవడంతో ఆమె భర్త ధర్మవరంలో ఉంటున్న జ్యోతి అన్న శశికుమార్‌కు ఫోన్లో సమాచారం తెలిపినట్లు వివరించారు. ఆయన వెంటనే తమకు ఫిర్యాదు చేశారని తెలిపారు. తల్లీబిడ్డల ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.