జాదవ్ సునీత, సాయికూమార్, శివప్రసాద్ (ఫైల్)
సాక్షి, ఇచ్చోడ (ఆదిలాబాద్): ఇద్దరు కుమారుతో పాటు తల్లి అదృశ్యమైన సంఘటన ఇచ్చోడ మండల కేంద్రంలో జరిగింది. ఇచ్చోడ ఎస్సై పరీధ్ కధనం ప్రకారం ఇచ్చోడలో నివాసముంటున్న వివాహిత జాదవ్ సునీత తన ఇద్దరు కుమారులు జాదవ్ సాయి కూమార్, జాదవ్ శివప్రసాద్‌లను తీసుకోని ఈ నెల 10న జైనూర్ మండలంలోని పట్నాపూర్‌లో ఉన్న పూలాజీబాబా అశ్రమానికి వెళ్లారు. అదే రోజు సాయంత్రం 6 గంటల ప్రాంతంలో తాము పూలజీబాబా అశ్రమానికి చేరుకున్నామని తన తండ్రి రాథోడ్ దూదిరామ్‌కు కూతరు సునీత ఫోన్ ద్వారా తెలిపారు.
మరుసటి రోజు 11న వారు ఇంటికి తిరిగి రాకపోవడంతో తండ్రి తన కూతురు సునీతకు ఫోన్ చేశారు. ఫోన్ ఇతర వాళ్లు లిప్ట్ చేశారు. ఈ ఫోన్ అశ్రమం వద్ద ఎవరో వదిలి పోయారని తమకు ఫోన్ దొరికిందని సమాదానం రావడంతో వెంటనే దూదిరాం పూలజీబాబా అశ్రమనికి వెళ్లి వాకబు చేశారు. సమీప బందువుల ఇంట్లో వాకబు చేసినా వారి అచూకి తెలియలేదు. సునీత తండ్రి రాథోడ్ దూదిరాం ఈ నెల 14న బుధవారం సాయంత్రం ఇచ్చోడ పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
అయితే గాదిగూడ మండలంలోని ఖండ్వరాంపూర్ గ్రామనికి చెందిన తన భర్త జాదవ్ కైలాస్ రెండేళ్ల కిందట తనకు తెలియకుండా మరో మహిళను వివాహం చేసుకున్నారని సునీత 2019లో ఇచ్చోడ పోలీస్టేష్‌లో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయడంతో జాదవ్ కైలాస్‌పై ఇచ్చోడ పోలీస్టేషలో కేసు నమెదు అయింది. అకస్మాత్తుగా సునీత తన ఇద్దరు కుమారులతో అదృశ్యం కావడంతో ఇచ్చోడ పోలీసులు కేసు నమెదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. అదృశ్యమైన వారి అచూకి తెలిసిన వారు 9440795015, 9849658648, 8333986929 ఫోన్ నంబర్లకు సమాచారమివ్వాలని ఎస్సై కోరారు.
Comments
Please login to add a commentAdd a comment