కుమారుడితో భారతి (ఫైల్)
పహాడీషరీఫ్: కుటుంబ కలహాల కారణంగా ఓ మహిళ కుమారుడితో సహా అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ శంకర్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. తుక్కుగూడ గ్రామానికి చెందిన భారతి (25), సోమన్న దంపతులకు అఖిరానందన్(01) కుమారుడు ఉన్నాడు. గత కొన్ని రోజులుగా భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 9న మధ్యాహ్నం భారతి కుమారుడిని తీసుకొని ఇంట్లో నుంచి బయటికి వెళ్లి తిరిగా రాలేదు. దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు గాలింపు చేపట్టినా ప్రయోజనం కనిపించలేదు. ఆమె భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment