- ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఘటనలో గాయపడిన యువకుడి మృతి
- నాడు అమ్మా, నాన్నలు.. నేడు కుమారుడు..
- తుడిచిపెట్టుకుపోయిన కుటుంబం
స్నేహితుల చెంతకే ప్రభాకర్
Published Sat, Sep 24 2016 12:15 AM | Last Updated on Mon, Sep 4 2017 2:40 PM
తొగర్రాయి(దుగ్గొండి): ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆరు రోజులుగా చికిత్స పొందుతున్న యువకుడు ప్రభాకర్ శుక్రవారం మృతిచెందాడు. మండలంలోని తొగర్రాయి గ్రామానికి చెందిన స్నేహితులు నల్ల సతీష్, చిలువేరు రాజు, చింతం ప్రభాకర్ ఈనెల 18న గిర్నిబావిలో ఆగి ఉన్న లారీని ఢీకొట్టగా అదే రోజు సతీష్, రాజు మృతి చెం దిన విషయం తెలిసిందే. చావుబతుకుల మధ్య ఉన్న చింతం ప్రభాకర్(20)ఆరు రోజు లుగా హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్సపొం దుతూ మధ్యాహ్నం మృతి చెం దినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతు డి తాత కంతిరి వెంకటనర్సయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై భాస్కర్‌రెడ్డి తెలిపారు.
నాడు అమ్మా, నాన్నలు.. నేడు కుమారుడు..
తొగర్రాయికి చెందిన కంతిరి వెంకటనర్సయ్య కూతురు పూలను ఊరుగొండ గ్రామానికి చెందిన చింతం సదానందంకు ఇచ్చి పెళ్లి చేశారు. ప్రభాకర్ పుట్టిన ఐదేళ్లకే సదానందం చనిపోయాడు. గత నాలుగేళ్ల క్రితం పూల చని పోయింది. దీంతో ప్రభాకర్‌ను తాత వెంకటనర్సయ్య పెంచుకుంటున్నాడు. కూలీ పనులుకు వెళ్లి జీవనం సాగిస్తున్న ప్రభాకర్ రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో ఆ కుటుంబం మొత్తం తుడిచి పెట్టుకుపోయినట్లయింది. గ్రామంలో ముగ్గురు యువకుల మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రభాకర్ తాతఅమ్మమ్మల రోదనలు పలువురిని కంట తడి పెట్టించాయి.
Advertisement
Advertisement