వాకాడు : కోస్టల్ ఆక్వా కల్చర్ అథారిటీ, చెన్నై అనుమతులు పొందిన రొయ్యల హేచరీలు జిల్లాలో 37 మాత్రమే ఉన్నాయని, అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా ఉన్న రొయ్యల హేచరీలు చాలా ఉన్నాయని కోస్టల్ ఆక్వా కల్చర్ అథారిటీ చెన్నై సీనియర్ టెక్నికల్ అధికారి రమేష్, ఎన్‌ఎఫ్‌డీపీ హెదరాబాద్ ప్రభాకర్ తెలిపారు. ఫిషరీస్ అధికారులు, రెవెన్యూ అధికారులతో కలిసి వీరు మంగళవారం రాత్రి మండలంలోని తూపిలిపాళెం తీరంలోని రొయ్యల హేచరీలను తనిఖీ చేశారు. అందులో అనుమతులు లేకుండా నడుపుతున్న ఆర్‌ఆర్ హేచరీని సీజ్ చేశారు.
ఇటీవల వినాయక, శాంతి, బాలాజీ హేచరీలను కూడా సీజ్ చేశారు. తోటపల్లిగూడూరులోని వీజీఆర్, విడవలూరులోని నీలకంఠ రొయ్యల హేచరీలను కూడా సీజ్ చేశామని రమేష్, ప్రభాకర్ తెలిపారు. జిల్లాలో అనేక రొయ్యల హేచరీలు అనుమతులు లేకుండా నడుస్తున్నాయని, వాటిని గతంలోనే గుర్తించి కోస్టల్ ఆక్వా కల్చర్ అథారిటీ అనుమతులు పొందాలని హెచ్చరికలు జారీ చేశామన్నారు. అయినప్పటికీ వారు నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా హేచరీలను నడుపుతూ, నాణ్యతా ప్రమాణాలను పాటించకుండా స్థానికంగా దొరికే నాసిరకమైన తల్లి రొయ్యలను పెంచి వాటి ద్వారా రొయ్య పిల్లలను తయారు చేసి రైతులను మోసం చేస్తున్నారని తెలిపారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. వీటిపై వచ్చిన ఫిర్యాదుల మేరకు కలెక్టర్ ఆదేశించడంతో తనిఖీలు ముమ్మరం చేస్తున్నామన్నారు. ఇప్పటికీ జిల్లాలో 8 హేచరీలు సీజ్ చేశామన్నారు. ఆయన వెంట తహశీల్దార్ ఈశ్వరమ్మ, మత్స్యశాఖ అధికారి కృష్ణకుమార్, ఆర్‌ఐ మధుసూదన్‌రాజు, ఎస్‌హెచ్‌ఓ రషీద్, సిబ్బంది ఉన్నారు.
హేచరీలపై దాడులు
విడవలూరు: జిల్లాలోని వాకాడు, తోటపల్లిగూడూరు, విడవలూరు మండలాల్లోని అనుమతులు లేని హేచరీలపై మత్స్యశాఖ, కోస్టల్ అధికారులు సంయుక్తంగా మంగళవారం రాత్రి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మూడు హేచరీలను సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. మండలంలోని రామచంద్రాపురంలోని నీలకంఠ హేచరీపై దాడులు చేశారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ ఏడీ హరికిరణ్, కోస్టల్ అధికారులు రమేష్, ప్రభాకర్, కోవూరు ఎఫ్‌డీఓ చాన్‌బాషా తదితరులు పాల్గొన్నారు.
ఆదిత్య రొయ్యల హేచరీ సీజ్
తోటపల్లిగ ూడూరు : మండలంలోని కాటేపల్లిలో ఉన్న ఆదిత్య(ఈజీఆర్) రొయ్య పిల్లల హేచరీని మంగళవారం సాయంత్రం కోస్టల్ ఆక్వా కల్చర్ అథారిటీ అధికారులు సీజ్ చేశారు. ఇటీవల జిల్లాలో లోకల్ బ్రూడర్స్‌తో రొయ్య పిల్లలను ఉత్పత్తి చేస్తున్న హేచరీలపై కోస్టల్ ఆక్వా అథార్టీ అధికారులు దృష్టి సారించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎలాంటి అనుమతి లేకుండా రొయ్యల పిల్లల్ని ఉత్పత్తి చేసి, అమ్మకాలు చేస్తున్న ఈ హేచరీపై ఆకస్మికంగా దాడి చేశారు. క్షుణ్ణంగా విచారించి సీజ్ చేశారు.
అక్రమ హేచరీలపై ఉక్కుపాదం
Published Wed, Dec 17 2014 1:28 AM | Last Updated on Sat, Sep 2 2017 6:16 PM
Advertisement
Advertisement