krishna kumar
-
హెచ్ఎండీఏ ఏపీఓ కృష్ణకుమార్ సస్పెన్షన్
సాక్షి, హైదరాబాద్: ఎలాంటి పరిశీలన లేకుండానే టీడీఆర్ సర్టిఫికెట్ల జారీలో ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టించిన శంకర్పల్లి జోన్ అసిస్టెంట్ ప్లానింగ్ అధికారి బీవీ.కృష్ణకుమార్‌ను హెచ్ఎండీఏ కమిషనర్ దానకిషోర్ బుధవారం సస్పెండ్ చేశారు. ఈ సస్పెన్షన్ వెంటనే అమల్లోకి వస్తున్నట్టు పేర్కొన్నారు. మరోవైపు ఈ ఉదంతంపై సంబంధిత ప్లానింగ్ అధికారులకు వివరణ ఇవ్వాలని ఆదేశించారు. నగరానికి పడమటి వైపున శంకర్పల్లి జోన్లో ఔటర్ రింగ్‌రోడ్డును ఆనుకొని ఉన్న పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలు జరిగాయి. అనేక చోట్ల నిబంధనలను విరుద్ధంగా కొనసాగిన ఈ నిర్మాణాల్లో కృష్ణకుమార్ ప్రమేయం ఉన్నట్టు మొదటి నుంచీ ఆరోపణలు ఉన్నాయి. హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణకు ఈయన ప్రధాన అనుచరుడిగా వ్యవహరించాడు. ఈ క్రమంలో కబ్జారాయుళ్లు, అక్రమ నిర్మాణాలకు పాల్పడే వారికి కృష్ణకుమార్ అనుకూలంగా వ్యవహరించినట్టు ఆరోపణలు ఉన్నాయి. ♦ గండిపేట మండలం పుప్పాలగూడ గ్రామ పంచాయతీ పరిధిలో టీడీఆర్లపైన వచ్చిన దరఖా స్తులను పరిశీలించకుండానే ఉన్నతా«ధికారులను తప్పుదోవ పట్టించినట్టుగా తాజాగా రుజువు కావడంతో కమిషనర్ ఆయన్ను సస్పెండ్ చేశారు. ♦ పుప్పాలగూడలోని 330 నుంచి 332 వరకు సర్వేనంబర్లలో తమకు ఉన్న 11,698 గజాల్లో 100 ఫీట్ల రోడ్డుకు భూమిని గిఫ్ట్‌డీడ్ కింద గ్రా మపంచాయతీకి రిజిస్టర్ చేసినట్టు శ్రావణ్‌కుమా ర్తో పాటు, మరికొందరు తెలిపారు. ఈ మేరకు వారు టీడీఆర్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ♦పుప్పాలగూడ గ్రామంలోనే వెంకటరమణ, మరికొందరు 314 నుంచి 317 వరకు సర్వేనంబర్లలో ఉన్న 22,046 గజాల్లో మాస్టర్‌ప్లా¯న్ కింద 100 ఫీట్ రోడ్డులో భూమి పోయిందంటూ టీడీఆర్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ♦టీడీఆర్ దరఖాస్తులను పూర్తిస్థాయిలో పరిశీలించకుండానే కృష్ణకుమార్ తన పై అధికారులను తప్పుదోవ పట్టించారు. ప్రస్తుతం ఈ ఒకటిరెండు ఉదంతాలే బయటకు వచ్చినా, ఇంకా వెలుగులోకి రాని అక్రమాలు పెద్దఎత్తునే ఉంటాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. అప్పట్లో శివబాలకృష్ణపై ఏసీబీ దాడులు కొనసాగుతున్న సమయంలోనే కృష్ణకుమార్ అమెరికాకు వెళ్లడం కూడా చర్చనీయాంశమైంది. ఆయన అమెరికాకు వెళ్లడంతో ఏసీబీ దాడుల నుంచి తప్పించుకున్నాడని అప్పట్లో హెచ్ఎండీఏ వర్గాలు చర్చించుకోవడం గమనార్హం. -
టాటా గ్రూప్ కృష్ణకుమార్ కన్నుమూత
ముంబై: రతన్ టాటాకి అత్యంత సన్నిహితుడు, టాటా గ్రూప్‌లో పలు అత్యున్నత బాధ్యతలు నిర్వర్తించిన ఆర్ కృష్ణకుమార్(84) ఇక లేరు. ఆదివారం గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన ఆయన.. చికిత్స పొందుతూ సాయంత్రం కన్నుమూశారు. పద్మశ్రీ పురస్కార గ్రహీత అయిన ఆర్ కృష్ణకుమార్.. కేరళ తలస్సెరీలో పుట్టిపెరిగారు. చెన్నైలో ఉన్నత చదువులు పూర్తి చేసి.. 1963లో టాటా గ్రూప్‌లో అడుగుపెట్టారు. టాటా సన్స్‌కు డైరెక్టర్‌గానే కాదు, గ్రూప్‌లో పలు కంపెనీల టాప్ పొజిషన్లో ఆయన పని చేశారు. ట్రస్ట్‌ల బాధ్యతలను కూడా ఆయన చూసుకున్నారు. టాటాలోని వివిధ సంస్థలతో పాటు దాని అనుబంధ సంస్థ ఇండియన్ హోటల్స్‌కు హెడ్‌గానూ ఆయన పని చేశారు. దూకుడు నిర్ణయాలకు కేరాఫ్‌గా ఈయనకంటూ ఓ గుర్తింపు ఉంది. టాటా సంస్థలకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కూడా ఆయన పలు కీలక నిర్ణయాల్లో ముఖ్యభూమిక పోషించారు. వ్యాపార కార్యనిర్వాహకుడిగానే కాకుండా.. దాదాపు ఒకే వయసు వాళ్లు కావడంతో రతన్ టాటాతో కృష్ణకుమార్‌కు మంచి అనుబంధం కొనసాగింది. సైరస్ మిస్ట్రీ తొలగింపు ఎపిసోడ్లో.. రతన్ టాటాకు కీలక సూచనలు చేసిన బృందంలో ఈయన కూడా ఉన్నారు. 2009లో భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ పురస్కారం అందించింది. ఇక కృష్ణకుమార్ మృతి టాటా గ్రూప్ స్పందించింది. టాటా సన్స్ ప్రస్తుత చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ పేరిట సంతాప ప్రకటన విడుదల చేసింది. టాటా గ్రూప్‌నకు ఆయన చేసిన సేవలు మరువలేనివని అందులో చంద్రశేఖరన్ కొనియాడారు. మరోవైపు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సైతం కృష్ణకుమార్ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముంబైలోని చందన్‌వాడీ శ్మశానవాటికలో సోమవారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. -
Bharat Jodo Yatra: తీవ్ర విషాదం.. పాదయాత్రలో పాల్గొని సీనియర్‌నేత మృతి
సాక్షి, న్యూఢిల్లీ: రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో మంగళవారం విషాదం నెలకొంది. యాత్రలో పాల్గొన్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కాంగ్రెస్ సేవాదళ్ ప్రధాన కార్యదర్శి కృష్ణకుమార్ పాండే (75) కన్నుమూశారు. నాగ్‌పూర్‌కు చెందిన కృష్ణకుమార్ మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో కొనసాగుతున్న భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. పార్టీ నాయకులు జైరాం రమేశ్, దిగ్విజయ్ సింగ్‌తో కలిసి పాదయాత్ర చేసే క్రమంలో ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలించినప్పటికీ లాభం లేకపోయింది. అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయారని వైద్యులు ప్రకటించారు. ఈ విషయంపై జైరాం రమేశ్ మాట్లాడుతూ.. కృష్ణకుమార్ హఠాన్మరణం కలచివేసిందని అన్నారు. ‘దిగ్విజయ్ సింగ్, నాతోపాటు కృష్ణకుమమార్ యాత్రలో పాల్గొన్నారు. త్రివర్ణ పతాకం చేత ధరించి నడిచారు. కొద్దిదూరం వెళ్లాక పక్కనున్న వ్యక్తికి జెండా అప్పగించి.. గుండెల్లో నొప్పిగా ఉందని చెప్పారు. ఆస్పత్రికి తరలించేలోపే ఘోరం జరిగిపోయింది’ అని పేర్కొన్నారు. చివరి శ్వాస వరకు పాండే పార్టీ కోసం పనిచేశారని జైరాం రమేశ్ గుర్తు చేసుకున్నారు. (చదవండి: గుజరాత్ బీజేపీ సర్కార్‌పై చిదంబరం ఫైర్.. తీగల వంతెన ప్రమాదంపై సీరియస్) కాగా, కృష్ణకుమార్ భౌతికకాయాన్ని ఆస్పత్రి నుంచి భారత్ జోడో యాత్ర జరుగుతున్న ప్రాంతానికి తరలించారు. అక్కడ రాహుల్ గాంధీ, ఇతర నాయకులు, కార్యకర్తలు దివంగత నాయకునికి నివాళి అర్పించారు. అనంతరం తండ్రితోపాటు పాదయాత్రలో పాల్గొన్న కృష్ణకుమార్ కుమారుడు షీలాజ్ పాండేకు భౌతికకాయాన్ని అప్పగించారు. కృష్ణకుమార్ అకాల మృతిపట్ల రాహుల్ గాంధీ విచారం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కుటుంబానికి కృష్ణకుమార్ మృతి ఎంతో బాధాకరమని ట్విటర్లో పేర్కొన్నారు. ఆయన శ్రేయోభిలాషులకు, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. తన చివరి క్షణాల్లో కూడా ఆయన జాతీయ జెండా మోయడం దేశ పట్ల ఆయన అంకితభావాన్ని తెలియజేస్తుందని అన్నారు. యాత్రా బృందంలో 25 మంది డాక్టర్లు అందుబాటులో ఉంటారని మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ అశోక్ చవాన్ తెలిపారు. అయితే, వయసుపైబడ్డ యాత్రికులకు, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారికి ముందుగానే పరీక్షలు నిర్వహించి యాత్రలో పాల్గొనేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. మంగళవారం సాయంత్రం జరిగే సభ.. పాండే సంస్మరణ సభగా జరుపుతామని వెల్లడించారు. (చదవండి: ప్రజల్ని కలుస్తూ.. సమస్యలు వింటూ..) कांग्रेस सेवा दल के महासचिव, कृष्णकांत पांडे जी का निधन पूरे कांग्रेस परिवार के लिए बहुत दुःखद है। उनके प्रियजनों को मैं अपनी गहरी संवेदनाएं व्यक्त करता हूं। आज, यात्रा के दौरान अंतिम समय में उन्होंने हाथों में तिरंगा थामा था। देश के लिए उनका समर्पण हमें सदा प्रेरणा देता रहेगा। pic.twitter.com/VvC1O5ZJfh — Rahul Gandhi (@RahulGandhi) November 8, 2022 -
మూడోసారి గిన్నిస్‌లోకి కృష్ణకుమార్
సాక్షి, హైదరాబాద్: రచయిత, సామాజిక కార్యకర్త డాక్టర్ పెండెం కృష్ణకుమార్ మూడో సారి గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కారు. నిమిషం వ్యవధిలో కుప్పగా పోసిన 16 జతల షూలను వాటి కరస్పాండింగ్ బాక్స్‌లో ఉంచడంలో ఈ రికార్డు సాధించారు. గతంలో 14 జతలపై జయసింహ పేరిట ఉన్న రికార్డును ఆయన బ్రేక్ చేసి తాజా రికార్డు నెలకొల్పారు. గతంలోనూ ఆయన వేగంగా ఇంగ్లిష్ అక్షరాలను టైప్ చేయడం, నటనలో రెండుసార్లు గిన్నిస్ రికార్డు సాధించారు. అంతేగాక పలు సామాజిక సేవల్లో ముందున్న కృష్ణ.. విభిన్న పాత్రలు పోషించడంలో మూడు సార్లు లిమ్కా బుక్ రికార్డుల్లోకి ఎక్కారు. నల్లగొండ జిల్లా సూర్యాపేటకు చెందిన కృష్ణ మెడికల్ డిస్ట్రిబ్యూటర్‌గా పనిచేస్తున్నారు. -
అక్రమ హేచరీలపై ఉక్కుపాదం
వాకాడు : కోస్టల్ ఆక్వా కల్చర్ అథారిటీ, చెన్నై అనుమతులు పొందిన రొయ్యల హేచరీలు జిల్లాలో 37 మాత్రమే ఉన్నాయని, అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా ఉన్న రొయ్యల హేచరీలు చాలా ఉన్నాయని కోస్టల్ ఆక్వా కల్చర్ అథారిటీ చెన్నై సీనియర్ టెక్నికల్ అధికారి రమేష్, ఎన్ఎఫ్డీపీ హెదరాబాద్ ప్రభాకర్ తెలిపారు. ఫిషరీస్ అధికారులు, రెవెన్యూ అధికారులతో కలిసి వీరు మంగళవారం రాత్రి మండలంలోని తూపిలిపాళెం తీరంలోని రొయ్యల హేచరీలను తనిఖీ చేశారు. అందులో అనుమతులు లేకుండా నడుపుతున్న ఆర్ఆర్ హేచరీని సీజ్ చేశారు. ఇటీవల వినాయక, శాంతి, బాలాజీ హేచరీలను కూడా సీజ్ చేశారు. తోటపల్లిగూడూరులోని వీజీఆర్, విడవలూరులోని నీలకంఠ రొయ్యల హేచరీలను కూడా సీజ్ చేశామని రమేష్, ప్రభాకర్ తెలిపారు. జిల్లాలో అనేక రొయ్యల హేచరీలు అనుమతులు లేకుండా నడుస్తున్నాయని, వాటిని గతంలోనే గుర్తించి కోస్టల్ ఆక్వా కల్చర్ అథారిటీ అనుమతులు పొందాలని హెచ్చరికలు జారీ చేశామన్నారు. అయినప్పటికీ వారు నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా హేచరీలను నడుపుతూ, నాణ్యతా ప్రమాణాలను పాటించకుండా స్థానికంగా దొరికే నాసిరకమైన తల్లి రొయ్యలను పెంచి వాటి ద్వారా రొయ్య పిల్లలను తయారు చేసి రైతులను మోసం చేస్తున్నారని తెలిపారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. వీటిపై వచ్చిన ఫిర్యాదుల మేరకు కలెక్టర్ ఆదేశించడంతో తనిఖీలు ముమ్మరం చేస్తున్నామన్నారు. ఇప్పటికీ జిల్లాలో 8 హేచరీలు సీజ్ చేశామన్నారు. ఆయన వెంట తహశీల్దార్ ఈశ్వరమ్మ, మత్స్యశాఖ అధికారి కృష్ణకుమార్, ఆర్ఐ మధుసూదన్‌రాజు, ఎస్హెచ్ఓ రషీద్, సిబ్బంది ఉన్నారు. హేచరీలపై దాడులు విడవలూరు: జిల్లాలోని వాకాడు, తోటపల్లిగూడూరు, విడవలూరు మండలాల్లోని అనుమతులు లేని హేచరీలపై మత్స్యశాఖ, కోస్టల్ అధికారులు సంయుక్తంగా మంగళవారం రాత్రి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మూడు హేచరీలను సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. మండలంలోని రామచంద్రాపురంలోని నీలకంఠ హేచరీపై దాడులు చేశారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ ఏడీ హరికిరణ్, కోస్టల్ అధికారులు రమేష్, ప్రభాకర్, కోవూరు ఎఫ్డీఓ చాన్‌బాషా తదితరులు పాల్గొన్నారు. ఆదిత్య రొయ్యల హేచరీ సీజ్ తోటపల్లిగ ూడూరు : మండలంలోని కాటేపల్లిలో ఉన్న ఆదిత్య(ఈజీఆర్) రొయ్య పిల్లల హేచరీని మంగళవారం సాయంత్రం కోస్టల్ ఆక్వా కల్చర్ అథారిటీ అధికారులు సీజ్ చేశారు. ఇటీవల జిల్లాలో లోకల్ బ్రూడర్స్తో రొయ్య పిల్లలను ఉత్పత్తి చేస్తున్న హేచరీలపై కోస్టల్ ఆక్వా అథార్టీ అధికారులు దృష్టి సారించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎలాంటి అనుమతి లేకుండా రొయ్యల పిల్లల్ని ఉత్పత్తి చేసి, అమ్మకాలు చేస్తున్న ఈ హేచరీపై ఆకస్మికంగా దాడి చేశారు. క్షుణ్ణంగా విచారించి సీజ్ చేశారు. -
రాజంపేట ఎంఈఓకు దేహశుద్ధి
రాజంపేట రూరల్: రాజంపేట ఎంఈఓ కృష్ణకుమార్‌కు బోయనపల్లె గ్రామస్తులు దేహశుద్ధి చేశారు. ‘పిల్లలపై లైంగిక వేధింపులు సర్వసాధారణమే అని ఎంఈఓ పేర్కొనడంతో గ్రామస్తులు ఆగ్రహించారు. ఎంఈఓపై దాడి చేసి చితకబాదారు. బోయనపల్లె జెడ్పీ హైస్కూల్ వద్ద శనివారం ఈ సంఘటన చోటు చేసుకుంది. విద్యార్థినుల పట్ల ఆర్థర్ అనే ఉపాధ్యాయుడు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని గ్రామస్తులు ఆందోళన చేయడంతో పోలీసులు అరెస్ట్ చేసి కేసు నమోదు చేసిన విషయం విదితమే. ఇదే పాఠశాలలో మరో ముగ్గురు ఉపాధ్యాయులు కూడా విద్యార్థినిల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తూ శనివారం పాఠశాలకు తాళాలు వేశారు. అక్కడున్న సిబ్బందిని, ఉపాధ్యాయులను బయటికి పంపించేశారు. ఎన్ఎస్యూఐ, ఎస్ఎఫ్ఐ, జీఆర్ఎస్ఎఫ్ విద్యార్థి నాయకులు గ్రామస్తులతో కలిసి పాఠశాల గేటు వద్ద ధర్నా చేశారు. కీచక ఉపాధ్యాయులైన హెచ్ఎం వెంకటరామిరెడ్డి, హిందీ పండిట్ ఖాజాహుస్సేన్, గణిత ఉపాధ్యాయుడు రమణారెడ్డి ఇకపై పాఠశాలకు రావద్దని నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న ఎంఈఓ కృష్ణకుమార్ పాఠశాల వద్దకు చేరుకున్నారు. జరిగిన సంఘటనను ఎంఈఓ కృష్ణకుమార్ దృష్టికి గ్రామస్తులు తీసుకెళ్లారు. ఇవన్నీ సర్వసాధారణమేనని ఎంఈఓ చెప్పగానే గ్రామస్తుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఎంఈఓపై దాడి చేసి చితకబాదారు. దీంతో విద్యార్థి నాయకులు రక్షణగా ఏర్పడి ఎంఈఓను ద్విచక్ర వాహనంలో తరలించారు. సమాచారం తెలియడంతో రాజంపేట రూరల్ సీఐ వెంకటేశ్వర్లు అక్కడికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. తొలి నుంచి వివాదాస్పదుడే బద్వేలుకు చెందిన ఆర్థర్ తొలినుంచి వివాదాస్పద వ్యక్తిగానే పేరుపొందారు. రెండేళ్ల క్రితం రాజంపేట మండలంలోని బోయనపల్లె జెడ్పీ హైస్కూల్‌కు బదిలీ అయ్యారు. చక్రధరకాలనీలో నివాసం ఉండగా ఇతని వికృత చేష్టలు గమనించి ఆరు నెలల క్రితం గ్రామస్తులు అక్కడి నుంచి పంపించేశారు. తరువాత బోయనపల్లెలో నివాసం ఉంటున్నారు. ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరు బద్వేలులో ఉన్నారు. కీచక మాస్టర్ సస్పెన్షన్ వైవీయూ : రాజంపేట మండలం బోయనపల్లె జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న పి. ఆర్తర్ను విధుల నుంచి తొలగించినట్లు డీఈఓ కె. అంజయ్య ఒక ప్రకటనలో తెలిపారు. బాలికలతో అసభ్యకరంగా ప్రవర్తించాడనే ఆరోపణలు రావడంతో సస్పెండ్ చేసినట్లు డీఈఓ తెలిపారు. -
సినిమా రివ్యూ: పిజ్జా 3డి
నటీనటులు: అక్షయ్ ఒబెరాయ్, పార్వతి ఓమనకుట్టన్, దిపణిత శర్మ, అరుణోదయ్ సింగ్ ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్ ఫోటోగ్రఫి: జయకృష్ణ గుమ్మడి సంగీతం: మికీ, మెక్లియరీ, సౌరబ్ కల్సి, షామీర్ టాండన్ దర్శకత్వం: అక్షయ్ అక్కినేని తమిళంలో అనూహ్య విజయం సాధించి కార్తీక్ సబ్బరాజును స్టార్ డైరెక్టర్ గా మార్చిన పిజా చిత్రం ఆధారంగా ప్రముఖ ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ తనయుడు అక్షయ్ అక్కినేని 3డీ ఫార్మాట్ లో 'పిజ్జాహిందీలో రీమేక్ చేశారు. హారర్, థ్రిల్లర్ అంశాలతో తమిళ, తెలుగు ప్రేక్షకులను భయపెట్టిన 'పిజ్జా' 3డి వెర్షన్ లో బాలీవుడ్ ప్రేక్షకులను ఎలాంటి అనుభూతికి లోనయ్యేలా చేసిందో తెలుసుకోవాలంటే కథ ఎంటో తెలుసుకోవాల్సిందే. కథ: కునాల్ (అక్షయ్ ఒబెరాయ్) ఓ పిజా డెలివరీ బాయ్. కునాల్ భార్య నిఖిత (పార్వతి ఓమనకుట్టన్) ఓ థ్రిల్లర్, హారర్ కథలు రాసే రచయిత్రి. హారర్ సంఘటనలంటే చికాకుపడే కునాల్ కు భార్య రచనలు నచ్చకపోవడంతో ఇద్దరి మధ్య గొడవలు జరగుతుంటాయి. అయితే పిజ్జా డెలివరీలో భాగంగా కునాల్ దెయ్యాలు ఉండే ఇంటిలో బందీ అవుతాడు. ఆతర్వాత ఆ ఇంటిలో కునాల్ ఎలాంటి అనుభవాల్ని ఎదుర్కొన్నారు? ఆ ఇంటి నుంచి ఎలా బయటపడ్డారు? ఇంటి నుంచి బయట పడిన తర్వాత ఏం జరిగింది అనే ప్రశ్నలకు తెర రూపమే 'పిజ్జా-3డి' చిత్రం. నటీనటుల ఫెర్ఫార్మెన్స్: పిజ్జా డెలివరీ బాయ్ గా నటించిన అక్షయ్ ఒబెరాయ్ అంతగా ప్రభావం చూపలేకపోయారు. ప్రేక్షకులకు భయాన్నికలిగించే విధంగా తన భావాల్ని పలికించడంలోనూ విఫలమయ్యారు. అక్షయ్ ఒబెరాయ్ నటనపరమైన లోపాలు కారణంగా కథలో ఉండే ఇంటెన్సిటీ తగ్గిపోయిందని చెప్పవచ్చు. పార్వతి ఓమన్ కుట్టన్ పర్వాలేదనిపించింది. ఈ చిత్రంలో నిఖిత పాత్ర పరిధి పరిమితంగా ఉండటం కారణంగా పార్వతి ఓమన్ కుట్టన్ అంతగా ఆకట్టుకోలేకపోయింది. దిపణిత శర్మ, అరుణోదయ్ సింగ్ తోపాటు మిగితా పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు. టెక్నికల్ ఫెర్ఫార్మెన్స్: మికీ, మెక్లియరీ, సౌరబ్ కల్సి, షామీర్ టాండన్ సంగీతం బాగుంది. కృష్ణ కుమార్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోరు, శ్రీకర ప్రసాద్ ఎడిటింగ్, జయకృష్ణ గుమ్మడి ఫోటోగ్రఫి ఈ చిత్రానికి అదనపు ఆకర్షణ. ఇక పూర్తి స్థాయిలో ఓ హారర్, థ్రిల్లర్ చూస్తున్న ఫీలింగ్ ను కలిగించడంలో దర్శకుడు అక్షయ్ అక్కినేని కొంత తడబాటుకు గురయ్యాడనిపిస్తుంది. తమిళ, తెలుగు వెర్షన్ లో పిజ్జాను రెగ్యులర్ ఫార్మాట్ లో చూసిన ప్రేక్షకులు ఓ థ్రిల్ గురయ్యారనేది వాస్తవం. అయితే 3డి ఎఫెక్ట్ లో అదనపు థ్రిల్ ను ఆశించిన ప్రేక్షకులకు నిరాశేనని చెప్పవచ్చు. పిజ్జాలో 3డి ఎఫెక్ట్స్ కొత్త అనుభూతిని కలిగించింది తక్కవే అని చెప్పవచ్చు. చిత్ర కథనంలో ద్వితీయ భాగంలో కథనం కూడా కొంత గందరగోళానికి గురి చేసింది. ఓవరాల్ గా ఆసక్తికరంగా పిజ్జాను 3డిలో మలిచి ప్రేక్షకులను భయపెట్టడానికి అక్షయ్ చేసిన ప్రయత్నం ఆకట్టుకోలేదనే చెప్పవచ్చు. -
గ్యాంగ్‌రేప్ కేసులో నలుగురి అరెస్టు
గుర్గావ్: వితంతువుపై సామూహిక అత్యాచారం కేసుకు సంబంధించి నలుగురు నిందితులను పోలీ సులు అరెస్టు చేశారు. నిందితులను కృష్ణకుమార్, బల్వంత్‌సింగ్, ధర్మేందర్, పవన్కుమార్లుగా గుర్తించారు. మరో నిందితుడు రికీ పరారీలో ఉన్నా డు. నిందితులంతా 30 నుంచి 35 ఏళ్ల వయస్సులోపు వారేనని, వీరంతా హర్యానాలోని ఖోద్ గ్రామస్తులని పోలీసులు తెలిపారు. నిందితుల్లో ఒకడైన కృష్ణకుమార్... స్థలం చూపిస్తానంటూ బాధితురాలిని పటౌడీ అనే ప్రాంతానికి రప్పించాడు. దీంతో నిందితుడిని నమ్మి న బాధితురాలు అతడి వెంట రాగా స్థలం వద్దకు కాకుండా మరోచోటికి తీసుకెళ్లి నలుగురు స్నేహితులతో కలసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. కృష్ణకుమార్ ఓ రియ ల్ ఎస్టేట్ వ్యాపారి అని, బాధితురాలితో కొంతకాలంగా సంప్రదింపులు జరుపుతున్నాడన్నారు. బాధితురాలిని ఢిల్లీ-జైపూర్ మార్గంలో వదిలిపెట్టేశారన్నారు. నిందితులందరినీ జ్యుడిషియల్ మేజి స్ట్రేట్ తరుణ్ సింఘాల్ ఎదుట హాజరుపరచగా జ్యుడిషియల్ కస్టడీకి ఆదేశించారని వివరించారు. -
పాపం.. ఆండాలమ్మ
‘మనసు మనసుతో ముడి వేస్తావ్.. మనిషి ప్రేమతో పెనవేస్తావ్... ఆడినంతసేపాడుకుని బొమ్మలన్నీ విసిరేస్తావ్.. ఈ మాయలన్నీ నీకే తెలుసని.. ఏమాయా తెలియని మనిషి హృదయాలను వేధిస్తున్నావ్... పచ్చగా ఉన్న బతుకులను.. ఎండమావి చేసి చూస్తున్నావ్..’ అంటూ ఓ సినీ కవి తన పాటకు అక్షరరూపమిస్తే.. ఆ రూపానికి నిజ స్వరూపం ఈ అభాగ్యుల జీవిత చిత్రం. ఒకరేమో.. ఒకప్పుడు భర్త, బిడ్డలు.. కార్లు, అంతస్తులతో బాగా బతికి.. నేడు రోడ్డున పడితే.. మరొకరు తోడూనీడా లేక.. నా అన్నవారు కానరాక చస్తూ బతుకుతున్నారు. ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. రోడ్డు పక్కన షెడ్డు కింద.. చలికి తట్టుకోలేక.. నిండా దుప్పటి కప్పుకుని.. బిక్కుబిక్కుమంటూ చూస్తు న్న ఈ అభాగ్యురాలిపేరు ఆండాలమ్మ (80). ఒకప్పుడు ప్రొద్దుటూరు పట్టణంలో కార్లు ఉన్న కుటుంబాల్లో ఈమె కుటుంబం ఒకటి. సుమారు 40 ఏళ్ల కిందట భర్త లోకయ్యనాయుడుతో కలిసి మద్రాసు నుంచి వ్యాపారం కోసం వలస వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. పాత మార్కెట్లో పెద్ద చెప్పుల దుకాణం నడుపుకుంటూ బాగా బతికారు. ఇంటి పెద్ద మరణంతో.. లోకయ్యనాయుడు,ఆండాలమ్మలకు శ్రీధర్, కృష్ణకుమార్‌లు అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిలో కృష్ణకుమార్ ఆర్ఎంపీ వైద్యుడిగా పేరొందాడు. పెద్ద కుమారుడు తండ్రికి చేదోడుగా ఉంటూ వ్యాపారా న్ని చూసుకునే వాడు. కొన్నేళ్ల కిందట లోకయ్యనాయుడు గుండెపోటు తో మృతి చెందాడు. శ్రీధర్ వ్యాపారాన్ని సరిగా చూసుకోలేక పోయాడు. ఉన్నదంతా పొగొట్టుకోవడం తో ఆర్థిక పరిస్థితి తలకిందులైంది. చివరికి శ్రీధర్ ఫిల్మ్ ఆపరేటర్‌గా చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొచ్చేవాడు. శ్రీధర్ గుండెపోటుతో మృతి... ఫిల్ము ఆపరేటర్‌గా పని చేస్తున్న శ్రీధర్ కూడా కొన్ని నెలల కిందట గుండెపోటుతో మృతి చెందాడు. దీంతో ఆండాలమ్మ కోలుకోలేక పోయింది. ఈ క్రమంలో చిన్న కుమారుడు కృష్ణకుమార్ మతి స్థిమితం కోల్పోవడంతో అండాలమ్మ మరింత కుంగిపోయింది. ఈ దశలో ఇంటి బాడుగ కూడా కట్టలేని స్థితిలో ఆండాలమ్మ అనాథగా రోడ్డుపాలైంది. చిన్న కుమారుడు మతి స్థిమితం కోల్పో యినా వారానికి ఒకసారో, రెండు సార్లో వచ్చి ‘అమ్మాబాగున్నావా’ అని పలకరించి వెళుతుంటాడని అండాలమ్మ ఆవేదనతో తెలిపింది. బంధువులంతా మద్రాసులోనే ఉన్నారని తెలిపింది. తండ్రి పోలీస్‌శాఖలో... ఆండాలమ్మ తండ్రి గోవిందస్వామినాయుడు పోలీస్‌శాఖలో విధులు నిర్వహిస్తూ మృతి చెందాడు. అన్న జీఎం స్వామి కూడా పోలీస్‌శాఖలో విధులు నిర్వహిస్తున్నాడు. అండాలమ్మ పరిస్థితి చూసి స్థానికులు చలించి పోతున్నారు. దాతలు ఆదుకోవాలని వేడుకుంటున్నారు. -న్యూస్‌లైన్, ప్రొద్దుటూరు టౌన్