మూడోసారి గిన్నిస్‌లోకి కృష్ణకుమార్ | krishna kumar holds guinness world record for third time | Sakshi
Sakshi News home page

మూడోసారి గిన్నిస్‌లోకి కృష్ణకుమార్

Published Wed, Feb 25 2015 1:14 AM | Last Updated on Tue, Aug 21 2018 2:34 PM

మూడోసారి గిన్నిస్‌లోకి కృష్ణకుమార్ - Sakshi

మూడోసారి గిన్నిస్‌లోకి కృష్ణకుమార్

సాక్షి, హైదరాబాద్: రచయిత, సామాజిక కార్యకర్త డాక్టర్ పెండెం కృష్ణకుమార్ మూడో సారి గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కారు. నిమిషం వ్యవధిలో కుప్పగా పోసిన 16 జతల షూలను వాటి కరస్పాండింగ్ బాక్స్‌లో ఉంచడంలో ఈ రికార్డు  సాధించారు. గతంలో 14 జతలపై జయసింహ పేరిట ఉన్న రికార్డును ఆయన బ్రేక్ చేసి తాజా రికార్డు నెలకొల్పారు.

గతంలోనూ ఆయన వేగంగా ఇంగ్లిష్ అక్షరాలను టైప్ చేయడం, నటనలో రెండుసార్లు గిన్నిస్ రికార్డు సాధించారు. అంతేగాక పలు సామాజిక సేవల్లో ముందున్న కృష్ణ.. విభిన్న పాత్రలు పోషించడంలో మూడు సార్లు లిమ్కా బుక్ రికార్డుల్లోకి ఎక్కారు. నల్లగొండ జిల్లా సూర్యాపేటకు చెందిన కృష్ణ మెడికల్ డిస్ట్రిబ్యూటర్‌గా పనిచేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement