
మారుతి సమర్పణలో శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రభాకర్.పి దర్శకత్వంలో ఎస్.శైలేంద్రబాబు నిర్మిస్తోన్న చిత్రం బ్రాండ్ బాబు. డైరెక్టర్ మారుతి కథ అందించిన ఈ మూవీలో సుమంత్ శైలేంద్ర, ఈషా రెబ్బా, పూజిత వన్నోడ హీరో హీరోయిన్లుగా నటించారు. మురళీశర్మ మరో కీలకపాత్రలో కనిపించబోతున్నారు.
ఇటీవల డైరెక్టర్ హరీశ్ శంకర్ చేతుల మీదుగా విడుదల చేసిన బ్రాండ్ బాబు టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలో ఆడియోను విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఆగస్ట్ మొదటివారంలో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ మారుతి స్టైల్‌లో ఉండనుందని తెలుస్తోంది. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని నమ్మకంగా ఉన్నారు చిత్రయూనిట్.
Comments
Please login to add a commentAdd a comment