నా గర్ల్‌ఫ్రెండ్ వల్ల భార్య చాలా బాధపడింది: సీరియల్ నటుడు ప్రభాకర్ |Serial Actor Prabhakar Comments On His Wife Ishmart Malayaja And Girlfriend - Sakshi
Sakshi News home page

Actor Prabhakar: మాది దొంగపెళ్లి.. ప్రేమ-పెళ్లి గురించి మొత్తం బయటపెట్టాడు!

Published Sat, Oct 7 2023 7:38 PM | Last Updated on Sat, Oct 7 2023 8:02 PM

Serial Actor Prabhakar Comments On Wife Malayaja And Girlfriend - Sakshi

సీరియల్ యాక్టర్ ప్రభాకర్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గత కొన్నేళ్ల నుంచి పలు ఛానెల్స్‌లో సీరియల్స్‌తో అలరిస్తున్నాడు. తాజాగా ఓ షోకి భార్యతో సహా వచ్చిన ప్రభాకర్.. తన ప్రేమ-పెళ్లి విషయాల గురించి మాట్లాడాడు. తన గర్ల్‌ఫ్రెండ్ వల్ల భార్య బాధపడిన సందర్భాన్ని గుర్తుచేసుకున్నాడు. ఇంతకీ అసలేం జరిగింది?

ఏం జరిగింది?
ప్రముఖ ఛానెల్‌లో ప్రసారమైన ఈ షోలో ప్రభాకర్-మలయాజ పెళ్లి ఫొటోల్ని స్క్రీన్‌పై ప్లే చేయగానే.. తమది దొంగపెళ్లి అని, ఆర్య సమాజ్‌లో ఏడడుగులు వేశామని అన్నాడు. అయితే ఖమ్మం నుంచి వచ్చిన తన ఫ్రెండ్.. పెళ్లిలో కన్యాదానం చేశాడని అప్పటి సంగతుల్ని ప్రభాకర్ గుర్తుచేసుకున్నాడు.

(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్ 7' ఎలిమినేషన్‌లో ట్విస్ట్.. ఒకేసారి ఇద్దరు ఔట్!)

గర్ల్‌ఫ్రెండ్ వల్ల భార్య..
'నాకు ఓ గర్ల్‌ఫ్రెండ్ ఉండేది. ఆ విషయంలో నా భార్య చాలా బాధపడింది. ఆ సందర్భాన్ని ఎలాగోలా సరిచేసుకుని మనస్ఫూర్తిగా నా భార్యకు సారీ చెప్పాను. అయితే నేను సారీ చెప్పడం గొప్పకాదు. తను నన్ను క్షమించడం గొప్ప విషయం' అని భార్య మలయజ గురించి చెప్పాడు. ఆ తర్వాత ఆమె బుగ్గపై అందరూ చూస్తుండగానే ముద్దుపెట్టుకున్నాడు. ప్రస్తుతం ఈ షో ప్రోమో వైరల్‌గా మారింది.

ఇకపోతే ప్రభాకర్ పలు సీరియల్స్ చేస్తూ బిజీగా ఉండగా, అతడి భార్య మలయజ స్వతహాగా యాక్టర్ కానప్పటికీ షార్ట్ ఫిల్మ్స్‌లో నటిస్తూ  ఉంటుంది. సొంత యూట్యూబ్ ఛానెల్ కూడా ఉంది. అలానే ప్రభాకర్ కొడుకు సుహాస్ ఆటిట్యూడ్ స్టార్ గా ఇప్పటికే చాలామందికి పరిచయం. కూతురు దివిజ కూడా పలు సినిమాల్లో నటించింది.

(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్'లోకి వెళ్లొచ్చాక నా భార్యకి అలాంటి మెసేజులు: హీరో వరుణ్ సందేశ్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement