అందరికీ దగ్గరవుతాడు!
చంద్రమోహన్, ప్రభాకర్, చిన్న, రాంజగన్ తదితరులు ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘పాషా అందరివాడు’. పలువురు బాల నటీనటులు నటించిన ఈ చిత్రాన్ని సాయి సూరజ్ ఫిలింస్ పతాకంపై స్వీయదర్శకత్వంలో ఎస్.కె. సైదా సూరజ్ రూపొందించారు. ఈ శనివారం చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో చంద్రమోహన్ మాట్లాడుతూ -‘‘దర్శకుడు ఎంతో మమకారంతో ఈ సినిమా తీశారు.
సమాజానికి మంచి సందేశం ఇవ్వాలనే తపనతో తీసిన చిత్రం ఇది. ఈ మధ్య నేనెలాంటి కథలో నటించాలనుకున్నానో, ఎలాంటి డైలాగులు చెప్పాలనుకున్నానో ఈ చిత్రం అలాంటిదే’’ అని చెప్పారు. మా ‘పాషా అందరివాడు’ అందరికీ దగ్గరవుతాడనే నమ్మకం ఉందని సైదా సూరజ్ తెలిపారు.