ఏఎమ్ఎఫ్, కోన సినిమా బ్యానర్లపై అనిల్ మోదుగ, శివ కోన సంయుక్తంగా నిర్మిస్తున్న తాజా చిత్రం 'రాజుగారి కోడిపులావ్' కుటుంబ కథా 'వి'చిత్రం అనేది ట్యాగ్. ఈ సినిమాతో శివ కోన దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఇప్పటికే విడుదలైన పాటలు అందరి దృష్టిని ఆకట్టుకొన్నాయి. ట్రైలర్ అయితే 1 మిలియన్ వ్యూస్ మార్క్ దాటేసింది. ప్రేక్షకులు సినిమా విడుదల కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.
రాజు గారి కోడి పులావ్ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా "వాట్ ద ఫ* ఈజ్ ఆఫ్ కోడిపులావ్" అనే మరో ఇంట్రెస్టింగ్ వీడియోను విడుదల చేశారు. ఈ మూవీలో అందరూ కొత్త నటులే అయినప్పటికీ వారి పెర్ఫామెన్స్ తో సినిమాపై ఆసక్తి పెంచుతున్నాడు. ప్రభాకర్ ఈ చిత్రంలో టైటిల్ రోల్ చేస్తున్నారు. అయితే ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ 'A' సర్టిఫికెట్ జారీ చేసింది. తొలుత జూలై 29న రిలీజ్ ప్లాన్ చేశారు కానీ ఎందులో ఇందులో మార్పు చేశారు. ఆగస్టు 4న థియేటర‍్లలోకి తీసుకొస్తున్నట్లు కొత్త విడుదల తేదీని ప్రకటిస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు.
(ఇదీ చదవండి: 'రంగబలి' ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఆ రోజే)
Comments
Please login to add a commentAdd a comment