‘రాజుగారి కోడిపులావ్’ మూవీ రివ్యూ
టైటిల్: రాజుగారి కోడిపులావ్
నటీనటులు: శివ కోన, ప్రభాకర్, కునాల్ కౌశిక్, నేహా దేష్ పాండే, ప్రాచీ థాకేర్, అభిలాష్ బండారి, రమ్య దినేష్ తదితరులు
నిర్మాణ సంస్థలు : ఏఎమ్ఎఫ్, కోన సినిమా
నిర్మాతలు : అనిల్ మోదుగ, శివ కోన
దర్శకత్వం : శివ కోన
సంగీతం : ప్రవీణ్ మని
సినిమాటోగ్రఫి : పవన్ గుంటుకు
ఎడిటర్ : బసవా- శివ కోన
విడుదల తేది: ఆగస్ట్ 4, 2023
‘రాజుగారి కోడిపులావ్’కథేంటంటే..
రాజుగారు(ప్రభాకర్) ఓ హోటల్ రన్ చేస్తూ కోడిపులావ్ తో ఎంతో ఫేమస్ అవుతారు. ఆ చుట్టు పక్కల ఏరియా ప్రజలు రాజుగారి కోడిపులావ్ కోసం ఎగబడేవారు. ఇలా వ్యాపార పరంగా రాజుగారు సంతోషంగా ఉన్నప్పటికీ.. వ్యక్తిగత జీవితంలో మాత్రం చాలా బాధగా ఉండేవాడు. దానికి కారణం తనకు కొడుకు పుడుతాడు అనుకుంటే కూతురు పుట్టడం, అలాగే తన భార్య తన మాట వినడం లేదని అసంతృప్తి. ఈ రెండు కారణాల వల్ల రాజుగారు తరచూ మద్యం సేవిస్తూ ఉండేవాడు. ఓ ప్రమాదంలో అతని రెండు కాళ్లు విరిగిపోవడంతో ఇంటికే పరిమితం అవుతాడు.
కట్ చేస్తే.. కొన్నేళ్ల తర్వాత మూడు జంటలు డ్యాని(శివ కోన)- క్యాండీ (ప్రాచి కెథర్), బద్రి(కునాల్ కౌశిక్)-ఆకాంక్ష(నేహాదేష్ పాండే), షారుఖ్(అభిలాష్ బండారి)-ఈషా(రమ్య దినేష్) రోడ్ ట్రిప్ ప్లాన్ చేస్తారు. వీరిలో క్యాండీ, ఆకాంక్ష, బద్రి, ఫారుఖ్ కాలేజీ స్నేహితులు. ఈషా ఐటీ ఎంప్లాయ్. వీరంతా కలిసి కారులో ట్రిప్‌కి బయలుదేరగా మార్తమధ్యలో కారు పాడవుతుంది. దీంతో అడవిలో వీరంతా నడవాల్సి వస్తుంది. అలా ప్రయాణం సాగిస్తున్న ఈ మూడు జంటల్లో అనూహ్యంగా క్యాండీ మరణిస్తుంది. తన మరణానికి కారణం తెలియదు. ఆ మరుసటి రోజే ఈషా కపిపించకుండా పోతుంది. మిగిలిన నలుగురు భయంతో తిరిగి ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నిస్తారు. కానీ అడవిలో వీరికి దారి దొరక్క తిరుగుతూనే ఉంటారు. చివరకు వీరికి ఆ దట్టమైన అడవిలో ఓ ఇల్లు కనిపిస్తుంది. అందులోకి వెళ్లిన తర్వాత అసలు ట్విస్ట్ మొదలవుతుంది. అసలు క్యాండి ఎలా మరణించింది? డ్యానీ ఎవరు? ఫారుఖ్, ఆకాంక్షల మధ్య ఎలాంటి రిలేషన్ ఉంది? అసలు రాజుగారికి ఈ మూడు జంటలకు ఉన్న సంబంధం ఏంటి? అనేది తెలియాలంటే థియేటర్లో ‘రాజుగారి కోడిపులావ్’సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
రాజుగారి కోడిపులావ్ హోటల్ సీన్‌తో కథ ఆసక్తికరంగా ప్రారంభం అవుతుంది. అయితే కాసేపటికే కథ వేరే మలుపు తీసుకుంటుంది. మూడు జంటల పరిచయం.. వారి ఫారెస్ట్ ట్రిప్ ప్లాన్‌తో ఆసక్తికరంగా సాగుతుంది. కథ మొదలైన పది నిమిషాలకే ఆకాంక్ష, ఫారుఖ్ ల మధ్య ఉన్న రిలేషన్ రివీల్ అవుతుంది. అయితే వారు ఎందు ఒకరికోకరు అట్రాక్ట్ అయ్యారో కన్విన్సింగ్ గా ఉంటుంది.
గైనకాలజిస్ట్ గా పరిచయం అయిన క్యాండీ లవర్ డ్యాని చాలా హుషారుగా కనిపించే పాత్ర ప్రథమార్థం అంతా చాలా కూల్ గు వెళ్తుంది. ఇక అడవిలోకి వీరు ఎంటర్ అయిన తరువాత కారు ఆగిపోవడంతో అప్పటి వరకు ఉన్న జోష్ మూడ్ ఒక్కసారిగి టెన్షన్ వాతావరణంలోకి వస్తుంది. ఏదో జరగబోతుందనే ఉత్కంఠత ప్రేక్షకుడిలో ఏర్పడుతుంది. ఒక చెట్టుపైన పెద్ద పెద్ద కోడికాళ్ల అచ్చులు చూపించడంతో దాని వెనక ఏదో నేపథ్యం ఉంటుందని అర్థమవుతుంది. క్యాండీ చనిపోయిన తర్వాత వచ్చే కొన్ని సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి. అలాగే కొన్ని సంభాషణలు, సన్నివేశాలు ప్యామిలీ ఆడియన్స్‌ని ఇబ్బందికి గురి చేస్తుంది. డ్యానీ కనిపించకుండా పోవడంతో కథపై మరింత ఆసక్తి పెరుగుతంది. కానీ సెకండాఫ్‌లో ఆ ఆసక్తిని కంటిన్యూ చేయడంలో దర్శకుడు కాస్త విఫలం అయ్యాడు.అసలు కథకు రాజుగారికి ఉన్న ట్విస్ట్ సినిమాకు హైలెట్. అలాగే డ్యానీ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ఆసక్తికరంగా ఉంటాయి. ఇక క్లైమాక్స్ థ్రిలింగ్కు గురిచేస్తుంది.
ఎవరెలా చేశారంటే..
ఈ సినిమాలో డ్యాని బాగా హైలెట్ అయింది. డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న ఈ పాత్రలో శివ కోన ఒదిగిపోయాడు. దర్శకుడిగా, నిర్మాతగా ఇంత పెద్ద బాధ్యత తీసుకున్నప్పటికీ నటన పరంగా ఎక్కడా తగ్గలేదు. శివ తర్వాత బాగా పండిన పాత్ర ప్రాచి కెథర్. క్యాండి పాత్రలో ప్రాచీ థాకర్ జీవించేసింది.యాక్టింగ్ పరంగా మెచ్యుడ్ గా ఫర్ఫార్మెన్స్ చేసింది. ఆకాంక్ష పాత్రని నేహా న్యాయం చేసింది.కునాల్ కౌశిక్ బద్రి పాత్రలో చాలా బాగా చేశారు. కాస్త కన్నింగ్ ఉన్న పాత్ర. చాల సహజంగా నటించారు. రెండు మూడు వేరియేషన్లు చూపించే పాత్రలో ప్రేక్షకులని మెప్పిస్తుంది. అలాగే రమ్య దినేష్ తన పాత్ర మేరకు బాగా చేసింది. ఇక రాజుగారి పాత్రలో ప్రభాకర్ తెరపై కనిపించేది కాసేపే అయినా చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేశారు.
ఇక సాంకేతిక విషయాలకొస్తే..దర్శకుడికి ఇది తొలి సినిమానే అయినా చక్కగా హ్యాండిల్ చేశాడు. ఒక సస్పెన్స్ థ్రిల్లర్ ను ఎలా చూపించాలో అంతే గ్రిప్పింగ్ గా చూపించాడు. ప్రవీన్ మణీ బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్లస్ పాయింట్. సినిమాటో గ్రఫర్ పవన్ గుంటుకు మంచి విజువల్స్ అందించారు. అడవి లోకేషన్లు అందంగా చూపించారు. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.