
బ్యాడ్ టైమ్‌లో బ్యాడ్ ప్లేస్‌లో ఓ అమ్మాయి చిక్కుకుంది. మరి ఆ చిక్కుల్లో నుంచి ఎలా తప్పించుకుంది? అనే కథాంశంతో రూపొందుతోన్న చిత్రం ‘రాహు’. కృతి గార్గ్, అభిరామ్ వర్మ, కాలకేయ ప్రభాకర్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఏవిఆర్ స్వామీ, శ్రీ శక్తి బాబ్జి, రాజా దేవరకొండ, సుబ్బు వేదుల నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుబ్బు దర్శకుడు. ఇటీవల రిలీజ్ చేసిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు మంచి స్పందన లభిస్తోందని చిత్రబృందం తెలిపింది. ‘‘కొత్త దర్శకులు విభిన్న ఆలోచనలతో న్యూ ఏజ్ సినిమాలు తీస్తున్నారు. ఇది కూడా అలాంటిదే’’ అన్నారు నిర్మాతలు. ఈ చిత్రానికి కెమెరా: సురేశ్ రగుతు, సంగీతం: ప్రవీణ్ లక్కరాజు.
Comments
Please login to add a commentAdd a comment