వైఎస్సార్‌సీపీ నేతపై టీడీపీ మూకల దాడి | TDP mob attack on YSRCP leader | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ నేతపై టీడీపీ మూకల దాడి

Published Tue, Aug 29 2023 2:54 AM | Last Updated on Tue, Aug 29 2023 2:54 AM

TDP mob attack on YSRCP leader - Sakshi

పుంగనూరు(చిత్తూరు జిల్లా) : టీడీపీ శ్రేణులు మళ్లీ బరితెగించాయి. వైఎస్సార్‌సీపీ నేత ఇంట్లోకి జొరపడి రాళ్లు, కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయర్చాయి. పుంగనూరు మండల వైస్‌ ఎంపీపీ సరోజమ్మ, ఆమె భర్త ప్రభాకర్‌నాయక్‌ మండలంలోని పాళ్యెంపల్లెలో ఉంటున్నారు. ఈ నెల 4న చంద్రబాబు పర్యటనలో టీడీపీ శ్రేణులు పోలీసులపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన విషయం తెలిసిందే. ఈ కేసులో మండలంలోని జెడీ తాండాకు చెందిన టీడీపీ నేత కృష్ణానాయక్, ఆయన కుమారులు నిందితులుగా ఉన్నారు.

ఈ నేపథ్యంలో పోలీసులకు ప్రభాకర్‌నాయక్‌ తమ ఆచూకీ తెలిపి ఉంటారన్న అనుమానంతో కృష్ణానాయక్‌ ఆయన కుమారుడు శ్రీనివాసనాయక్, వారి అనుచరులు కలిసి పథకం ప్రకారం ఆదివారం రాత్రి 10:30 గంటల సమయంలో  ప్రభాకర్‌నాయక్‌ ఇంటిపై దాడి చేసి, భయానక వా­తావరణం సృష్టించారు. ప్రభాకర్‌నాయక్‌పై రాళ్లు, కత్తులతో దాడి చేసి గాయపరిచారు. అడ్డు వచ్చిన ఆయన బావమరిది మునీంద్రనాయక్‌పైనా దాడి చేశారు.

గ్రామస్తులు రావడంతో నిందితులు పరారయ్యారు. గాయపడిన ప్రభాకర్‌నాయక్‌ను స్థాని­క ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ మోహన్‌కుమార్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించి నిందితులపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. కాగా, ప్రభాకర్‌నాయక్‌­ను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైఎస్సార్‌సీపీ నేతలు పరామర్శించి ధైర్యం చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement