
టీడీపీతో పొత్తే చేటు తెచ్చింది
బీజేపీ అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ లక్ష్మణ్
కుత్బుల్లాపూర్: సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ పొత్తుతో లాభం కంటే నష్టమే వాటిల్లిందని బీజేపీ అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ లక్ష్మణ్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఎల్వీఎస్ ప్ర భాకర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా బీజేపీ అర్బన్ కార్యవర్గ సమావేశం మంగళవారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్లలోని సరోజిని గార్డెన్‌లో నిర్వహించారు. గ్రేటర్ యూత్ నాయకుడు చెరుకుపల్లి భరత సింహారెడ్డి తన అనుచులతో కలిసి శాలువాలు, బొకేలతో సత్కరిం చారు.
ముఖ్య అతిథులుగా హాజరైన లక్ష్మణ్, ప్రభాకర్‌లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మొదటి రాజకీయ తీర్మానం చేసిన ఏకైక పార్టీ బీజేపీయేనని అటువంటి పార్టీకి ఓట్లు వేయించుకోలేని నిస్సాహాయ ిస్థితిలో నాయకత్వం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌కు గ్రేటర్ హైదరాబాద్ చుట్టు పక్కల ప్రాంతాల్లో పట్టు లేకపోవడంతో మతోన్మాద శక్తులుగా ముద్రపడ్డ ఎంఐఎం పార్టీతో జతకట్టి గ్రేటర్ పరిపాలనా వ్యవస్థను చిన్నాభిన్నం చేసే ప్రయత్నాలు చేస్తున్నదని ఆరోపించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్‌రెడ్డి, జిల్లా అర్బన్ అధ్యక్షుడు మీసాల చంద్రయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లారెడ్డి, భీంరావ్, ప్రధాన కార్యదర్శులు మంత్రి శ్రీనివాస్, కాంతారావు, శ్రీధర్, జాతీయ కౌన్సిల్ సభ్యుడు మణికొండరామారావు, అసెంబ్లీ కన్వీనర్ రాజాగౌడ్, జిల్లా కార్యదర్శి నటరాజ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.