Published
Sat, Jul 30 2016 8:28 PM
| Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
నిధులు ఖర్చు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం
సూర్యాపేట : కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి వేల కోట్ల నిధులిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయడంలో విఫలమైందని బీజేపీ శాసనసభాపక్ష ఉప నాయకుడు ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్ అన్నారు. శనివారం సూర్యాపేటలోని జీవీవీ గార్డెన్స్‌లో నిర్వహించిన పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు ముందుకు సాగుతున్నామన్నారు. ఈనెల 7న హైదరాబాద్‌లో ప్రధానమంత్రి మోడీ మహాసమ్మేళనం జరగనున్న నేపథ్యంలో సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు బడుగు, బలహీన వర్గాల ప్రజలకు చేరడమే మోడీ లక్ష్యమన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకం ఎక్కడా వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు ఒక్కటి కూడా అమలైన దాఖలాలు కన్పించడం లేదని విమర్శించారు. ఎంసెట్–2 లీకేజీకి కారకులైన కడియం శ్రీహరి, లక్ష్మారెడ్డిని మంత్రి పదవుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షుడు వీరెల్లి చంద్రశేఖర్ అ«ధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నెహ్రు యువ కేంద్ర వైస్ చైర్మన్ పేరాల చంద్రశేఖర్‌రావు, మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు, రాష్ట్ర నాయకులు చింతా సాంబమూర్తి, కాసం వెంకటేశ్వర్లు, నగిరి మనోహర్‌రెడ్డి, గోలి మధుసూదన్‌రెడ్డి, దాసరి మల్లేశం, ఓరుగంటి రాములు, నల్లగుంట్ల అయోధ్య, అబిద్, లక్ష్మణ్‌రావు, వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.