వెండితెర మీద ప్రభాస్ పెళ్లి
ఇండస్ట్రీలో స్టార్ హీరోలకు సంబంధించిన ప్రతీ విషయంలో ఓ హాట్ టాపిక్లా చక్కర్లు కొడుతోంది. అలా ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎక్కువగా చర్చకు వస్తున్న ఓ అంశం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లి. ఇప్పటికే 35 మార్క్ను కూడా దాటేసిన ఈ హీరో త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడన్న వార్త చాలా రోజులుగా వినిపిస్తోంది. అయితే ఇప్పటి వరకు ఈ విషయం పై ఎలాంటి క్లారిటీ రాకపోవటంతో ప్రభాస్ పెళ్లిని ఏకంగా సినిమా టైటిల్గా వాడేస్తున్నారు. బాగా చర్చ జరుగుతున్న విషయం కావటంతో ఇలాంటి టైటిల్ అయితే పబ్లిసిటీకి ప్లస్ అవుతుందని భావిస్తున్నారు చిత్రయూనిట్.
ఇక సినిమా విషయానికి వస్తే, బాహుబలి సినిమాలో కాలకేయ క్యారెక్టర్తో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రభాకర్. ఇప్పటికే సుమంత్ అశ్విన్తో కలిసి ఓ సినిమాలో లీడ్ రోల్లో నటిస్తున్న ప్రభాకర్ ఇప్పుడు మరో సినిమాలో కీ రోల్లో నటిస్తున్నాడు. 'ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్లి' పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఎస్జె చైతన్య దర్శకుడు. త్వరలో రిలీజ్కు రెడీ అవుతున్న ఈ సినిమా టైటిల్పై ప్రభాస్ అభిమానులు ఎలా స్పందిస్తారో చూడాలి.