kalakeya
-
బెజవాడ కాలకేయుడు..!
-
Baahubali Prabhakar: అఖండ తర్వాత వరసగా 14 సినిమాల్లో పోలీస్ పాత్రలే..
మర్యాదరామన్నలో ‘ఏమప్పా మా ఊరు వచ్చి మా ఇంట్లో తినకుండా ఊర్లో ఎంగిలి పడతావా.. మా వంశం గౌరవం ఏమైపోను.. రా అప్పా జన్మలో మర్చిపోలేని మర్యాద చేస్తాము..’ బాహుబలిలో కిలికిలి భాషలో ‘నిమ్డా డోజ్రాస్టెల్మీ’అనే డైలాగ్స్‌తో తన టాలెంట్‌ను నిరూపించుకున్నారు కాలకేయ ప్రభాకర్. అలియాస్ బాహుబలి ప్రభాకర్. అక్కడ నుంచి వెనుదిరిగి చూసుకోలేదు. ఐదు భాషల్లో 120కు పైగా సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. తన సినీ జీవన ప్రయాణం సంతోషకరంగా సాగుతోందంటున్న ప్రభాకర్‌తో ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూ.. సాక్షి: మీ సినీ ప్రస్థానం ఎలా మొదలైంది.? ప్రభాకర్: రైల్వే పోలీస్ సెలక్షన్ కోసం హైదరాబాద్ వచ్చాను. అనివార్య కారణాల వల్ల సెలక్షన్ నిలిపివేశారు. తీరిక సమయంలో ఏం చేయాలో అర్థం కాక పద్మాలయ స్టూడియోలో అతిథి సినిమా షూటింగ్ జరుగుతుందని తెలిసి స్నేహితుడితో చూడటానికి వెళ్లాను. అప్పుడు డైరెక్టర్ సురేందర్‌రెడ్డి నన్ను చూసి నువ్వు ఆర్టిస్ట్వా అని అడిగారు. ఏం చెప్పాలో తెలియక ఆర్టిస్ట్ అని చెప్పేశాను. దీంతో ఆ సినిమాలో హీరోని రౌడీలు వెంబడించే సన్నివేశం ఒకటి ఇచ్చారు. అలా నా సినీ ప్రస్థానం మొదలైంది. పోలీస్ అవుదామని వచ్చిన నేను నటుడిగా మారిపోయాను. విలన్‌గా గుర్తింపు పొందాను. సాక్షి: దర్శకుడు బోయపాటి గురించి చెప్పండి? ప్రభాకర్: బోయపాటి శ్రీను కమిట్మెంట్ ఉన్న దర్శకుడు. నటుడిలో ఉన్న ప్రతిభను గుర్తించి తన స్టైల్లో సన్నివేశాన్ని పండించగల సమర్థుడు. నటులకు ఇబ్బంది లేకుండా చూసుకునే మనస్తత్వం ఆయనిది. సాక్షి: మీరు ఈ మధ్య ఎక్కువగా పోలీస్ పాత్రల్లోనే కనిపిస్తున్నారు? ప్రభాకర్: అఖండలో నేను చేసిన పోలీస్ పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. వాస్తవానికి పోలీస్ అవ్వాలనే కోరిక రియల్ లైఫ్‌లో తీరకపోయినా.. రీల్ లైఫ్‌లో కుదిరింది. అఖండ తర్వాత వరసగా 14 సినిమాల్లో పోలీస్ పాత్రలే వచ్చాయి. సాక్షి: మీకు గుర్తింపు తీసుకొచ్చిన సినిమా? ప్రభాకర్: నేను పూర్తిస్థాయిలో నటుడిగా మర్యాదరామన్న సినిమాలో నటించాను. నేను మొదటి చెప్పిన ‘ఏమప్పా మా ఊరు వచ్చి...’ డైలాగ్‌తో మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత బాహుబలి, జై సింహా, అఖండ వంటి సూపర్ హిట్ సినిమాలు నా సినీ ప్రస్థానంలో మైలురాయిగా నిలిచిపోయాయి. సాక్షి: ఎవరికైనా మీరు కృతజ్ఞతలు చెప్పాలంటే.. ప్రభాకర్: నేను ఈ స్థాయిలో ఉన్నానంటే.. నలుగురే ప్రధాన కారణం. ఎస్ఎస్ రాజమౌళి, బోయపాటి శ్రీను, హరీష్ శంకర్, వంశీ(దొంగాట). నాకు కొత్త జీవితాన్ని ఇచ్చారు. వీరికి జీవితాంతం రుణపడి ఉంటాను. సాక్షి: ఇప్పటి వరకు ఎన్ని సినిమాల్లో నటించారు? ప్రభాకర్: తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, ఒడియా భాషల్లో 120కి పైగా సినిమాల్లో నటించాను. ప్రస్తుతం ఆరు తెలుగు, ఏడు తమిళం, రెండు కన్నడ, ఒడియా, మలయాళంలో ఒక్కొక్క సినిమాలో నటిస్తున్నాను. సాక్షి: కాలకేయుడిగా ప్రత్యేక శిక్షణ తీసుకున్నారా? ప్రభాకర్: బాహుబలిలో కాలకేయరాజుగా రాజమౌళి నన్ను ఎంచుకోవడం నిజంగా నా అదృష్టం. రమ్యకృష్ణతో పోటీ పడి చేయాల్సిన పాత్ర అది. మొదట్లో కాస్త భయపడ్డాను కానీ.. ఆయన చాలా ప్రోత్సహించారు. కిలికిలి భాషలో నేను చెప్పిన డైలాగులు ప్రేక్షకులకు కొత్తగా అనిపించాయి. అలా నా పాత్ర విజయవంతమైంది. నిమ్డా... అనే డైలాగ్ నేర్చుకునేందుకు ఓ రాత్రంతా కష్టపడ్డాను. ఆ కష్టానికి ఫలితం దక్కింది. సాక్షి: మీ ఫ్యామిలీ గురించి చెప్పండి? ప్రభాకర్: నా భార్య రాజ్యలక్ష్మి టీచర్‌గా పనిచేస్తున్నారు. పిల్లలు శ్రీరామ రాజమౌళి, రుత్విక్ ప్రీతమ్. పెద్ద అబ్బాయికి రాజమౌళి ఉండేలా పేరు పెట్టాం. ఈ ప్రయాణంలో నా భార్య సహకారం ఎంతో ఉంది. నేను షూటింగ్‌కు వెళ్లినప్పుడు తనే అంతా చూసుకుంటుంది. సాక్షి: అగ్ర కథానాయకులతో నటించారు. చిరంజీవితో ఎప్పుడు? ప్రభాకర్: ఇప్పటివరకు నేను అందరి అగ్ర కథానాయకులతో నటించాను. ఇంకా చిరంజీవితో నటించే అవకాశం రాలేదు. త్వరలోనే వస్తుందని ఆశిస్తున్నాను. మర్యాదరామన్న సినిమాలో నాకు అవకాశం ఇచ్చి, బాహుబలి–1తో సినీ ఇండస్ట్రీలో నాకంటూ ఒక కుటుంబాన్ని ఇచ్చారు రాజమౌళి. నేను నటుడిగా ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు ప్రధాన కారణం ఆయనే. రాజమౌళి నా దేవుడు. (క్లిక్: మరోసారి గొప్ప మనసు చాటుకున్న సోనూసూద్) -
కాలకేయుడితో..
బొంరాస్‌పేట : జాతీయ ఉత్తమ చిత్రంగా ఎంపికైన ‘బాహుబలి’లో కాలకేయుని పాత్ర పోషించిన ప్రభాకర్‌ను నాందాపూర్కు చెందిన కొందరు యువకులు కలుసుకొని ఫొటోలు, సెల్ఫీలు దిగారు. శుక్రవారం హస్నాబాద్‌లో తన బంధుమిత్రులతో పండగ జరుపుకున్న ప్రభాకర్ శనివారం తిరిగి హైదరాబాద్‌కు వెళుతుండగా తుంకిమెట్ల సమీపంలో యువకులు యాదయ్య, అనిల్, అంజి, ప్రభు, అశోక్ తదితరులు కలిసి పండగ శుభాకాంక్షలు చెప్పారు. మరిన్ని ఉత్తమ చిత్రాల్లో మంచిమంచి పాత్రలు పోషించాలని ఆకాంక్షించారు. -
వెండితెర మీద ప్రభాస్ పెళ్లి
ఇండస్ట్రీలో స్టార్ హీరోలకు సంబంధించిన ప్రతీ విషయంలో ఓ హాట్ టాపిక్లా చక్కర్లు కొడుతోంది. అలా ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎక్కువగా చర్చకు వస్తున్న ఓ అంశం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లి. ఇప్పటికే 35 మార్క్‌ను కూడా దాటేసిన ఈ హీరో త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడన్న వార్త చాలా రోజులుగా వినిపిస్తోంది. అయితే ఇప్పటి వరకు ఈ విషయం పై ఎలాంటి క్లారిటీ రాకపోవటంతో ప్రభాస్ పెళ్లిని ఏకంగా సినిమా టైటిల్‌గా వాడేస్తున్నారు. బాగా చర్చ జరుగుతున్న విషయం కావటంతో ఇలాంటి టైటిల్ అయితే పబ్లిసిటీకి ప్లస్ అవుతుందని భావిస్తున్నారు చిత్రయూనిట్. ఇక సినిమా విషయానికి వస్తే, బాహుబలి సినిమాలో కాలకేయ క్యారెక్టర్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రభాకర్. ఇప్పటికే సుమంత్ అశ్విన్‌తో కలిసి ఓ సినిమాలో లీడ్ రోల్లో నటిస్తున్న ప్రభాకర్ ఇప్పుడు మరో సినిమాలో కీ రోల్లో నటిస్తున్నాడు. 'ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్లి' పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఎస్‌జె చైతన్య దర్శకుడు. త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమా టైటిల్‌పై ప్రభాస్ అభిమానులు ఎలా స్పందిస్తారో చూడాలి. -
'చంద్రబాబు కాలకేయుడు, బల్లాలదేవ'
గుంటూరు: ఏపీ సీఎం చంద్రబాబు కాలకేయుడి మాదిరిగా రాష్ట్ర ప్రజలపై దాడి చేస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. చంద్రన్న పాలన అరాచక పాలనగా మారిందని, ఆయన పాలన చూస్తుంటే బల్లాలదేవ పాలన కనిపిస్తున్నదని ఆమె విమర్శించారు. చంద్రబాబు పాలనలోమహిళలు, విద్యార్థినులు, ప్రజలపై దాడులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. గుంటూరులో వైఎస్ జగన్ నిరాహార దీక్ష వేదిక వద్ద ఆమె ఉద్వేగంగా ప్రసంగించారు. రోజా ఏమన్నారంటే.. రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచిన కట్టప్ప ఈ చంద్రబాబు ఆనాడు పిల్లనిచ్చిన మామకు, ఇప్పుడు నమ్మి ఓట్లేసిన ప్రజలకు ఆయన వెన్నుపోటు పొడిచారు కాలకేయుడిలా ప్రజల మీద దండయాత్ర చేస్తున్నారు చంద్రబాబు బాహుబలి సినిమాలో బల్లాలదేవలా పాలిస్తున్నారు ఈ బల్లాలదేవ పాలనను అంతం చేసేందుకు జగన్ సిద్ధంగా ఉన్నారన్న సంగతి తెలుసుకోవాలి ఈ కట్టప్పపై, కాలకేయుడిపై, బల్లాలదేవపై దాడి చేయడానికి జగన్ బాహుబలిలా సిద్ధంగా ఉన్నారు ప్రత్యేక హోదా గురించి చంద్రబాబు గానీ, ఆయన భజన బ్యాచ్ గానీ ఏమైనా మాట్లాడారా పట్టిసీమలో మోటార్లు కూడా లేకుండా చేసిన దౌర్భాగ్యపు మంత్రి దేవినేని ఉమా ఒక్క పంపు తెరిస్తేనే అక్విడెక్టు కొట్టుకుపోయింది.. మొత్తం పంపులు తెరిస్తే టీడీపీ నాయకులే కొట్టుకుపోతారు చంద్రబాబు పాలనలో జిల్లాకో సైకో సూదిగాణ్ని తయారుచేశారు. గాలిగాళ్లు, ధూళిగాళ్లు, సైకో సూదిగాళ్లు తయారయ్యారు సైకిల్ పార్టీలో అందరూ సైకోలు తయారై ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారు చంద్రబాబు కొడుకు, మంత్రులు, ఎమ్మెల్యేలు కందిపప్పు నుంచి బంగారం వరకు దేన్నీ వదలకుండా దోచుకుంటున్నారు ప్రత్యేక హోదా రాకపోతే రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తారన్న సంగతి తెలుసుకోవాలి ప్రతి గ్రామంలో, మండలంలో, నియోజకవర్గంలో ప్రత్యేక హోదా పోరు ప్రారంభించి, తెలుగుదేశం వాళ్ల వెన్నుల్లో వణుకు పుట్టించాలి: ఎమ్మెల్యే రోజా ఈ సైకో పార్టీని, ఈ సూదిగాళ్లను నిలదీసి ఎక్కడా తిరగనివ్వకుండా చేసే పరిస్థితి తీసుకురావాలి ప్రత్యేక హోదాతో రాష్ట్రంలోని అభివృద్ధి పథకాలకు 90శాతం గ్రాంటు వస్తుంది ప్రత్యేక హోదా ఏపీ హక్కు, భారత పార్లమెంటు మనకు ఇచ్చిన హామీ ప్రత్యేక హోదాతో ఉత్తరాఖండ్ స్వరూపమే మారిపోయింది హిమాచల్ ప్రదేశ్ అభివృద్ధి శరవేగంగా జరిగింది. యాపిల్ స్టేట్ నుంచి ఇండస్ట్రీయల్ స్టేట్ గా ఆ రాష్ట్రం మారింది అదే ప్రత్యేక హోదా వస్తే 972 కిలోమీటర్లు సముద్ర తీరం ఉన్న మన రాష్ట్రం ఎంత అభివృద్ధి జరుగుతుంది. చంద్రబాబు, ఆయన మంత్రులు పదవులకు గబ్బిల్లాలా వేలాడుతూ ఈ రాష్ట్రాన్నినడిరోడ్డున పెట్టడానికి వెనుకాడటం లేదని ఎంత దిగజారుతున్నారు ప్రత్యేక హోదా కోసం పోరాడమంటే తమ జేబులు నింపుకోవడానికి టీడీపీ నేతలు ప్రత్యేక ప్యాకేజీలు అంటున్నారు విభజనచట్టంలో ఏ ఒక్క హామీని ఈ 15 నెలల కాలంలో అమలుచేయలేదు. ప్రత్యేక హోదా కోసం జరుగుతున్న ఈ ఉద్యమాన్ని ఉధృతం చేయాలి ప్రతి ఒక్కరూ జగనన్నకు అండగా నిలువాలి. -
'చంద్రబాబు కాలకేయుడు'
-
కదనరంగంలో కాలకేయ
-
ఇంతకీ ఏంటీ.. కాలకేయ 'కిలికి'
తెలుగు సినీ దర్శకుడు రాజమౌళి రూపొందించిన దృశ్యకావ్యం 'బాహుబలి'. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళ బాషల్లో విడుదలై రికార్డుల మోత మోగిస్తోన్న ఈ చిత్రరాజం ఎన్నో విశేషాలకు వేదికగా నిలిచింది. ముఖ్యంగా నటీనటుల హావభావాలు, విజువల్ ఎఫెక్ట్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో పాటు ప్రేక్షకులను మరో విశేషం అమితంగా ఆకట్టుకుంటోంది. అదే 'కిలికి'! థియేటర్ నుంచి బయటకు వచ్చిన వాళ్లు ఒక్కసారైనా దీన్ని తలుచుకోకుండా ఉండలేకపోతున్నారంటే నమ్మాల్సిందే! ఇంతకీ ఏంటీ 'కిలికి'? సీన్లోకి వెళ్తే.. మాహిష్మతి రాజ్యభారాన్ని తన కుమారులైన భల్లాల దేవ, బాహుబలిలకు అప్పగించాలని భావిస్తుంది శివగామి. ఇద్దరిలో ఎవరు సమర్థులో పరీక్షించి, వారికి పట్టాభిషేకం చేయాలని నిర్ణయిస్తుంది. సకల విద్యల్లోనూ ఆరితేరిన ఆ అన్నదమ్ములిద్దరూ ప్రతి విషయంలోనూ ఒకరితో ఒకరు పోటీపడుతూ సమవుజ్జీలుగా నిలుస్తారు. దీంతో శివగామికి ఎటూ తేల్చుకోలేని స్థితి ఎదురవుతుంది. సరిగ్గా ఇదే సమయంలో మాహిష్మతి రాజ్య సైనిక రహస్యాలు తస్కరించి, దాడికి సిద్ధమవుతారు 'కాలకేయులు'. వీరు గిరిజన తెగకు చెందిన వారు. వారి ప్రభువు 'కాలకేయుడు'. మాహిష్మతి రాజ్యమ్మీదకు దండెత్తి వచ్చిన కాలకేయ మహారాజుతో శాంతి చర్చలు జరిపేందుకు వెళతారు శివగామి, యువరాజులు. ఈ సీన్లో కాలకేయ పాత్రధారి ప్రభాకర్ ఓ వింత భాషలో మాట్లాడతాడు. అయితే అదేదో నోటికొచ్చిన కారుకూతలు కావు. బాహుబలి సినిమా కోసమే సృష్టించిన ప్రత్యేక భాష అది. దాని పేరే కిలికి! సృష్టికర్త ఎవరు? ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరణ జరుపుకొన్న విషయం మనందరికీ తెలిసిందే.. ఇందులో తమిళ వెర్షన్‌కు పాటలు, మాటలు రాసింది 'మదన్ కార్కీ'. ప్రఖ్యాత తమిళ సినీ రచయిత వైరముత్తు కుమారుడే ఆయన. విడుదలైన భాషలన్నిటిలోనూ వినిపించిన 'కిలికి' భాష సృష్టికర్త కూడా ఆయనే. ఈ కొత్త భాష ఏదో నోటికొచ్చిన కూత కాదని, దాని వెనక ఎంతో వ్యాకరణం దాగుందని చెబుతారీయన. ఆలోచనకు బీజం.. బాహుబలి సినిమా తమిళ వెర్షన్ మాటల రచయితగా కార్కీ తొలుత ఈ ప్రతిపాదన తీసుకొచ్చారట. రెండేళ్ల కిందట దర్శకుడు రాజమౌళి యుద్ధ సన్నివేశాన్ని వివరించినపుడు కాలకేయులు మాట్లాడే భాష కొత్తగా సృష్టిద్దామని కార్కీ ఆయనతో అన్నారు. దానికి రాజమౌళి అంగీకరించడంతో ఈ భాష పుట్టుకొచ్చింది. 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' లోని ఎల్విష్, స్టార్‌ట్రెక్ సిరీస్‌లోని క్లింగన్ వంటి భాషలను ఆయన స్ఫూర్తిగా తీసుకున్నారు. క్లిక్ నుంచి కిలికి వరకూ.. కంప్యూటర్ సైన్స్ పట్టభద్రుడైన కార్కీ పరిశోధన కోసం ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్ యూనివర్సిటీలో చేరారు. ఈ సమయంలోనే చిన్నారులకు పాఠాలు చెప్పడం లాంటి పార్ట్‌టైం జాబ్స్ చేసేవారు. వివిధ భాషల్లో ప్రవేశమున్న కార్కీ.. పిల్లలకు కూడా ఆ భాషలను నేర్పించడం మొదలు పెట్టారు. ఈ సమయంలోనే ఆయనకు ఓ చిలిపి ఆలోచన వచ్చింది. 'ఏదైనా సరికొత్త భాష కనిపెడితే ఎలా ఉంటుందీ..?' అన్నదే ఆ ఆలోచన. అంతే.. 100 ప్రాథమిక పదాలతో ఓ కొత్త భాషను కనిపెట్టేశారీయన. దీనికి 'క్లిక్' అని పేరు పెట్టారు. ఇందులో మిన్-నేను, నిమ్-మీరు.. లాంటి సింపుల్ పదజాలాన్ని నింపేశారు. ఈ 'క్లిక్'నే బాహుబలి కోసం మరింత విస్తరించి 'కిలికి' చేశారు. క్లిక్‌లోని ప్రాథమిక పదాలకు మరికొన్ని పదాలు జతకూర్చి 750 పదాలతో సరికొత్త పదజాలాన్ని సృష్టించేశారు. దీనికి 40కి పైగా బలమైన వ్యాకరణ సూత్రాలనూ రచించారు. ప్రస్తుతం వాడుక భాషల్లోని మాటలన్నీ ఇందులోనూ ఉంటాయని, దీనితో పాటలు కూడా రాయొచ్చని కార్కీ చెబుతున్నారు. కఠినత్వం కోసం.. 'కాలకేయ' ప్రభాకర్ మాట్లాడే భాషను మొదట సబ్‌టైటిల్స్ ద్వారా తెర మీద కనిపించేలా చేద్దాం అనుకున్నారు. అయితే అలా చేయడం ద్వారా భావోద్వేగాలు ప్రేక్షకుడికి చేరవని గ్రహించారు. దీంతో యుద్ధక్షేత్రంలో శత్రువు పలుకులు కఠినంగా ఉండేలా.. గ్రామర్ విషయంలో జాగ్రత్త పడ్డారు. నెమ్మదైన మాటలు మృదువుగా, ఘాటైన మాటలు కటువుగా ఉండేట్టు పదాల రూపకల్పన చేశారు. ఉదాహరణకు 'రక్తం' అనే పదాన్ని కిలికిలో 'బ్రుర్ర్స్లా' అని పలుకుతారు. ఇలా కాలకేయ కాఠిన్యాన్ని ప్రేక్షకుడికి గుచ్చుకునేలా చేశారు. అన్నట్టు.. నాలుకతో ప్రభాకర్ చేసే 'టప్ టప్' శబ్దాలు కూడా వ్యాకరణంలో భాగమే! మీకోసం కొన్ని వాక్యాలు 1. తెలుగు: అతడు బతికే ఉండాలి. కిలికి: టా బీత్ క్రువూల్ డుంక్రా. 2. తె: అది నిజమా? కి: లూర్షా క్వే? 3. తె: ఆయుధాలు కిందపడేసి పారిపోండి. కి: నిమ్ క్ల్కే గదీత్వూ ట్టా కొరోటా-జ్రా రెయ్య్.. ఫుహూ క్ల్కే. 4. తె: ఒక గ్లాసు మంచినీరు ఇస్తారా? కి: నిమ్ ష్వీక్క్ మిన్ సుర్ప్ ఉనో ఢాబ్ సాస్‌లా ఫిన్హీ క్వే? 5. తె: మూర్ఖంగా మాట్లాడకు. కి: డంబాడంబా జివ్లా బాహా-నా.