
'చంద్రబాబు కాలకేయుడు, బల్లాలదేవ'
గుంటూరు: ఏపీ సీఎం చంద్రబాబు కాలకేయుడి మాదిరిగా రాష్ట్ర ప్రజలపై దాడి చేస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. చంద్రన్న పాలన అరాచక పాలనగా మారిందని, ఆయన పాలన చూస్తుంటే బల్లాలదేవ పాలన కనిపిస్తున్నదని ఆమె విమర్శించారు. చంద్రబాబు పాలనలోమహిళలు, విద్యార్థినులు, ప్రజలపై దాడులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. గుంటూరులో వైఎస్ జగన్ నిరాహార దీక్ష వేదిక వద్ద ఆమె ఉద్వేగంగా ప్రసంగించారు. రోజా ఏమన్నారంటే..
- రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచిన కట్టప్ప ఈ చంద్రబాబు
- ఆనాడు పిల్లనిచ్చిన మామకు, ఇప్పుడు నమ్మి ఓట్లేసిన ప్రజలకు ఆయన వెన్నుపోటు పొడిచారు
- కాలకేయుడిలా ప్రజల మీద దండయాత్ర చేస్తున్నారు
- చంద్రబాబు బాహుబలి సినిమాలో బల్లాలదేవలా పాలిస్తున్నారు
- ఈ బల్లాలదేవ పాలనను అంతం చేసేందుకు జగన్ సిద్ధంగా ఉన్నారన్న సంగతి తెలుసుకోవాలి
- ఈ కట్టప్పపై, కాలకేయుడిపై, బల్లాలదేవపై దాడి చేయడానికి జగన్ బాహుబలిలా సిద్ధంగా ఉన్నారు
- ప్రత్యేక హోదా గురించి చంద్రబాబు గానీ, ఆయన భజన బ్యాచ్ గానీ ఏమైనా మాట్లాడారా
- పట్టిసీమలో మోటార్లు కూడా లేకుండా చేసిన దౌర్భాగ్యపు మంత్రి దేవినేని ఉమా
- ఒక్క పంపు తెరిస్తేనే అక్విడెక్టు కొట్టుకుపోయింది.. మొత్తం పంపులు తెరిస్తే టీడీపీ నాయకులే కొట్టుకుపోతారు
- చంద్రబాబు పాలనలో జిల్లాకో సైకో సూదిగాణ్ని తయారుచేశారు. గాలిగాళ్లు, ధూళిగాళ్లు, సైకో సూదిగాళ్లు తయారయ్యారు
- సైకిల్ పార్టీలో అందరూ సైకోలు తయారై ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారు
- చంద్రబాబు కొడుకు, మంత్రులు, ఎమ్మెల్యేలు కందిపప్పు నుంచి బంగారం వరకు దేన్నీ వదలకుండా దోచుకుంటున్నారు
- ప్రత్యేక హోదా రాకపోతే రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తారన్న సంగతి తెలుసుకోవాలి
- ప్రతి గ్రామంలో, మండలంలో, నియోజకవర్గంలో ప్రత్యేక హోదా పోరు ప్రారంభించి, తెలుగుదేశం వాళ్ల వెన్నుల్లో వణుకు పుట్టించాలి: ఎమ్మెల్యే రోజా
- ఈ సైకో పార్టీని, ఈ సూదిగాళ్లను నిలదీసి ఎక్కడా తిరగనివ్వకుండా చేసే పరిస్థితి తీసుకురావాలి
- ప్రత్యేక హోదాతో రాష్ట్రంలోని అభివృద్ధి పథకాలకు 90శాతం గ్రాంటు వస్తుంది
- ప్రత్యేక హోదా ఏపీ హక్కు, భారత పార్లమెంటు మనకు ఇచ్చిన హామీ
- ప్రత్యేక హోదాతో ఉత్తరాఖండ్ స్వరూపమే మారిపోయింది
- హిమాచల్ ప్రదేశ్ అభివృద్ధి శరవేగంగా జరిగింది. యాపిల్ స్టేట్ నుంచి ఇండస్ట్రీయల్ స్టేట్ గా ఆ రాష్ట్రం మారింది
- అదే ప్రత్యేక హోదా వస్తే 972 కిలోమీటర్లు సముద్ర తీరం ఉన్న మన రాష్ట్రం ఎంత అభివృద్ధి జరుగుతుంది.
- చంద్రబాబు, ఆయన మంత్రులు పదవులకు గబ్బిల్లాలా వేలాడుతూ ఈ రాష్ట్రాన్నినడిరోడ్డున పెట్టడానికి వెనుకాడటం లేదని ఎంత దిగజారుతున్నారు
- ప్రత్యేక హోదా కోసం పోరాడమంటే తమ జేబులు నింపుకోవడానికి టీడీపీ నేతలు ప్రత్యేక ప్యాకేజీలు అంటున్నారు
- విభజనచట్టంలో ఏ ఒక్క హామీని ఈ 15 నెలల కాలంలో అమలుచేయలేదు.
- ప్రత్యేక హోదా కోసం జరుగుతున్న ఈ ఉద్యమాన్ని ఉధృతం చేయాలి
- ప్రతి ఒక్కరూ జగనన్నకు అండగా నిలువాలి.
-