
కాలకేయుడితో..
బొంరాస్‌పేట : జాతీయ ఉత్తమ చిత్రంగా ఎంపికైన ‘బాహుబలి’లో కాలకేయుని పాత్ర పోషించిన ప్రభాకర్‌ను నాందాపూర్‌కు చెందిన కొందరు యువకులు కలుసుకొని ఫొటోలు, సెల్ఫీలు దిగారు. శుక్రవారం హస్నాబాద్‌లో తన బంధుమిత్రులతో పండగ జరుపుకున్న ప్రభాకర్ శనివారం తిరిగి హైదరాబాద్‌కు వెళుతుండగా తుంకిమెట్ల సమీపంలో యువకులు యాదయ్య, అనిల్, అంజి, ప్రభు, అశోక్ తదితరులు కలిసి పండగ శుభాకాంక్షలు చెప్పారు. మరిన్ని ఉత్తమ చిత్రాల్లో మంచిమంచి పాత్రలు పోషించాలని ఆకాంక్షించారు.