
సిరిసిల్ల: అభ్యుదయ కవి, తెలంగాణ రచయితల వేదిక జాతీయ కార్యదర్శి మచ్చ ప్రభాకర్(63) ముంబైలో మంగళవారం ఆత్మహత్య చేసుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోత్గల్‌కి చెందిన మచ్చ ప్రభాకర్ 1977లో ముంబై వెళ్లి అక్కడే ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా 33 ఏళ్లు పని చేసి ఇటీవల రిటైర్ అయ్యారు. ప్రభాకర్ భార్య పుష్ప(57) 20 రోజుల కిందట జనవరి 2న గుండె పోటుతో మరణించారు. భార్య మరణాన్ని జీర్ణించుకోలేక ప్రభాకర్ ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు సమాచారం. ప్రభాకర్‌కు కుమారుడు, కూతురు ఉన్నారు. ప్రభాకర్ మృతదేహాన్ని సిరిసిల్లకు బుధవారం తీసుకువస్తున్నట్లు సోదరుడు ఆనంద్ తెలిపారు.