ప్రేక్షకులు చెడిపోకూడదు | Audience should not be damaged | Sakshi
Sakshi News home page

ప్రేక్షకులు చెడిపోకూడదు

Published Wed, Apr 25 2018 12:37 AM | Last Updated on Wed, Apr 25 2018 12:37 AM

Audience should not be damaged - Sakshi

ఆది, ఆశ్లేష జంటగా ప్రభాకర్‌ ఇప్పు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సహచరుడు’. వెరీ గుడ్‌ సినీ స్కూల్‌ పతాకంపై రవికుమార్‌ గంజి నిర్మించారు. సాయి శ్రీనివాస్‌ సంగీతం అందించారు. ఈ చిత్రం బిగ్‌ సీడీని తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్‌ ఆవిష్కరించగా, ఆడియో సీడీని నిర్మాత సాయి వెంకట్‌ విడుదల చేశారు. రామకృష్ణ గౌడ్‌ మాట్లాడుతూ– ‘‘సహచరుడు’ లాంటి చిన్న సినిమాలు వచ్చినప్పుడే ఎంతోమంది కొత్తవారు ఇండస్ట్రీకి వస్తారు. అప్పుడే ఇండస్ట్రీ  బాగుంటుంది.

ఈ సినిమా పెద్ద హిట్‌ అవ్వాలి’’ అన్నారు. ‘‘ఎనిమిదేళ్ల కష్టమే ‘సహచరుడు’ సినిమా. ఒక సినిమా వల్ల ప్రేక్షకులు చెడిపోకూడదు అనేదే నా ఉద్దేశం. హృదయాన్ని తాకే సందేశం మా సినిమా ద్వారా ఇచ్చాం’’ అన్నారు ఇప్పు ప్రభాకర్‌. ‘‘ట్రెండ్‌కి తగ్గ మ్యూజిక్‌ ఇవ్వాలని మొదట అనుకున్నాం. కానీ, అందరికీ అర్థమయ్యే లిరిక్స్‌తో ట్యూన్‌ చేసాం. పాటలు అందరికీ నచ్చే విధంగా ఉంటాయి’’ అన్నారు మ్యూజిక్‌ డైరెక్టర్‌ సాయి శ్రీనివాస్‌. ఆది, ఆశ్లేష, నిర్మాత రవికుమార్‌ గంజి, పాటల రచయిత రామారావు తదితరులు పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement