
కాంగ్రెస్ ఓట్లూ రామ్‌నాథ్‌కు వస్తాయి
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా రాష్ట్రపతి ఎన్నికల్లో రామ్‌నాథ్ కోవింద్‌కు ఓటు వేస్తారని బీజేపీ ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ అన్నారు.
బీజేపీ ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా రాష్ట్రపతి ఎన్నికల్లో రామ్‌నాథ్ కోవింద్‌కు ఓటు వేస్తారని బీజేపీ ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ అన్నారు. పార్టీ కార్యాలయంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ, ఆత్మప్రబోధానుసారం ఓట్లేయాలని కాంగ్రెస్ నేతలిచ్చిన పిలుపు మేరకు కోవింద్‌కు ఓట్లేస్తారన్నారు. ఓడిపోతామని తెలిసీ మీరాకుమార్ ను పోటికి పెట్టడం బలిపశువును చేయడమేనన్నారు. ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీలోనే ఉన్నారని, రాష్ట్రపతి ఎన్నికల్లో కోవింద్‌కే ఓటేస్తారని చెప్పారు.