రామ్‌నాథ్‌ కోవింద్‌ గెలుపు ఖాయం | Ramnath Kovind is the winner says MP Jitender Reddy | Sakshi
Sakshi News home page

రామ్‌నాథ్‌ కోవింద్‌ గెలుపు ఖాయం

Jul 18 2017 1:27 AM | Updated on Aug 9 2018 8:30 PM

రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్‌ గెలుపు ఖాయమని ఎంపీ జితేందర్‌రెడ్డి అన్నారు.

ఎంపీ జితేందర్‌రెడ్డి 
 
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్‌ గెలుపు ఖాయమని ఎంపీ జితేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం ఉదయం లోక్‌సభ వాయిదా పడిన తర్వాత టీఆర్‌ఎస్‌ ఎంపీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం జితేందర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ.. సీఎం కేసీఆర్‌ సూచనలు తీసుకున్నారని పేర్కొన్నారు.

కేసీఆర్‌ చెప్పినట్టుగానే ఎన్డీయే అభ్యర్థిగా రాజకీయ అనుభవం, దళిత వర్గానికి చెందిన రామ్‌నాథ్‌ కోవింద్‌ను మోదీ ఎంపిక చేశారన్నారు. అనంతరం ఎంపీ వినోద్‌ మాట్లాడుతూ.. విభజన చట్టంలో పేర్కొన్న హామీలను సాధించుకోవడానికి ఈ సమావేశాల్లో పట్టుబడతామని అన్నారు. చట్టంలో పొందుపరిచినట్టు ఉమ్మడి హైకోర్టు విభజన, అసెంబ్లీ సీట్ల పెంపును చేపట్టాలని డిమాండ్‌ చేశారు. అసెంబ్లీ సీట్ల పెంపునకు ఉద్దేశించిన బిల్లు సిద్ధంగా ఉందని, మూడు రోజుల్లో అది పార్లమెంటు ముందుకు వచ్చే అవకాశం ఉందని తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement