- 23,916 విలువైన ఓట్లతో టీఆర్‌ఎస్ అగ్రస్థానం
- 4,548 ఓట్లతో తర్వాతి స్థానంలో కాంగ్రెస్
- ఎమ్మెల్యే ఓటు విలువ 132.. ఎంపీకి 708
- ఉదయం 10 నుంచి సాయంత్రం 5 దాకా పోలింగ్
- అసెంబ్లీ కమిటీ హాల్‌లో ఏర్పాట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రపతి ఎన్నికకు రాష్ట్రంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. అసెంబ్లీ కమిటీ హాలులో రాష్ట్రానికి చెందిన 119 మంది ఎమ్మెల్యేలు ఓటు హక్కును వినియోగించుకో నున్నారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా పోలింగ్ జరగనుంది. ఎంపీలంతా ఢిల్లీలోనే ఓటింగ్‌లో పాల్గొంటారు. అధికార టీఆర్‌ఎస్.. ఎన్డీఏ అభ్యర్థి రాంనాథ్ కోవింద్‌కు మద్దతు ప్రకటిం చిన సంగతి తెలిసిందే. టీడీపీ కూడా మద్దతి స్తోంది. యూపీఏ అభ్యర్థిగా కాంగ్రెస్ మీరాకు మార్‌ను బరిలోకి దింపింది. రాష్ట్రంలో టీఆర్ ఎస్, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, ఎంఐఎం, సీపీఎం ఓటింగ్‌లో పాల్గొననున్నాయి.
ఓటు విలువ ఇలా..
ఈ ఎన్నికలలో ఎంపీ ఓటు విలువ 708, కాగా ఎమ్మెల్యే ఓటు విలువ 132గా నిర్ణయించారు. లోక్‌సభ, రాజ్యసభ సభ్యుల ఓటు విలువ ఒకే మాదిరిగా ఉంటుంది. ఈ లెక్కన తెలంగాణ లోని 119 అసెంబ్లీ నియోజవర్గాలకు సంబం« దించి ఉన్న ఓట్ల విలువ 15,708. రాష్ట్రంలో లోక్‌సభ, రాజ్యసభ సభ్యులంతా కలిపి 24 మంది. కాంగ్రెస్ నుంచి రాజ్యసభకు ప్రాతి నిధ్యం వహిస్తున్న పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఇటీవల మృతి చెందడంతో ఒక స్థానం ఖాళీ అయ్యింది. దీంతో 23 మంది ఎంపీల ఓట్ల విలువ 16,284. ఎంపీలు, ఎమ్మెల్యేల ఓట్ల విలువను పరిగణలోకి తీసుకుంటే రాష్ట్రంలో మొత్తం ఓట్ల విలువ 31,992. ఓట్ల విలువలో టీఆర్‌ఎస్‌దే సింహభాగం. దీంతో ఆ పార్టీ నాయకత్వం ఒక్క ఓటు కూడా వృథా కాకుం డా అన్ని జాగ్రత్తలు తీసుకుంది.
ఆదివారం వారందరికీ తెలంగాణ భవన్‌లో మాక్ పోలింగ్ నిర్వహించింది. ఇక పార్టీ ఎంపీలు ఢిల్లీలో ఎన్డీఏ ఏర్పాటు చేసిన మాక్ పోలింగ్ లో పాల్గొన్నారు. ప్రస్తుతం అధికార టీఆర్‌ఎస్ చేతిలో 90 మంది ఎమ్మెల్యేలు, 17 మంది ఎంపీలు (14 లోక్‌సభ, 3 రాజ్యసభ సభ్యులు) ఉన్నారు. దీంతో ఒక్క టీఆర్‌ఎస్ చేతిలోనే 23,916 విలువైన ఓట్లు ఉన్నాయి. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ చేతిలో 13 మంది ఎమ్మెల్యే లు, నలుగురు ఎంపీలున్నారు. దీంతో ఆ పార్టీ చేతిలో 4,548 విలువైన ఓట్లున్నాయి. ఏడుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీతో ఎంఐఎం 1,632 విలువైన ఓట్లు, ఐదుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీతో బీజేపీ 1,368 విలువైన ఓట్లు, ముగ్గురు ఎమ్మెల్యేల తో టీడీపీ 396 విలువైన ఓట్లు కలిగి ఉన్నాయి.
సీపీఎంకు ఒక ఎమ్మెల్యేతో 132 విలువైన ఓట్లు మాత్రమే ఉండగా.. ఆ పార్టీ యూపీఏ అభ్యర్థి మీరా కుమార్‌కు మద్దతు పలికింది. ఎంఐఎం తటస్థంగా ఉండాలని నిర్ణయించుకుంది. సోమవారం నాటి ఓటింగ్ లో ఆ పార్టీ పాల్గొనకపోవచ్చని భావిస్తున్నా రు. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి పోలింగ్ ఏజెంట్లగా ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ (టీఆర్‌ఎస్), బీజేఎల్పీ నేత కిషన్‌రెడ్డి వ్యవహ రిస్తారు. యూపీఏ అభ్యర్థికి కాంగ్రెస్ ఎమ్మెల్యే లు వంశీచందర్‌రెడ్డి, సంపత్ కుమార్ ఏజెం ట్లుగా ఉంటారు. పోలింగ్ ముగిశాక బ్యాలెట్ పేపర్లను భద్రపరచి మంగళవారం ఉదయం ఢిల్లీకి పంపుతారు. రాష్ట్రపతి ఎన్నికలకు ఎమ్మెల్యేల కోసం పింక్ కలర్ బ్యాలెట్ పేపర్ ఇవ్వనున్నారు.