- పాలేరును కొట్టిన రైతు
- ఆందోళనకు దిగిన దళితులు
జంగారెడ్డిగూడెం రూరల్
రైతుకు పాలేరుకు మధ్య జరిగిన గొడవ ఓ గ్రామంలో లాఠీచార్జికి దారి తీసింది. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురంలో దళితులకు రైతులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. సోమవారం అర్ధరాత్రి తర్వాత ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీనివాసపురానికి చెందిన రైతు సురేష్ దగ్గర ప్రభాకర్ అనే వ్యక్తి పాలేరుగా పనిచేస్తున్నాడు. సురేష్ పొలంలోని పంటను పశువులు పంటను నాశం చేశాయి.
పంట నాశనం చేస్తుంటే ఏం చేస్తున్నావంటూ రైతు పాలేరుపై చేయి చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పాలేరు బంధువులు ప్రభాకర్‌కు న్యాయం చేయాలని గ్రామంలో ఆందోళన దిగారు. ఈ సందర్భంగా రైతులకు దళితులకు మధ్య వాగ్వాదం జరిగి ఉద్రిక్తం మారింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆందోళన చేస్తున్న దళితులపై లాఠీ ఝుళిపించారు. నాయయం అడిగిన తమపై అన్యాయంగా పోలీసులు లాఠీచార్జి చేశారని దళితులు ఆరోపించారు.