మారుతి కథతో ‘బ్రాండ్‌ బాబు’ | Maruthi Presents Brand Babu Title Poster | Sakshi
Sakshi News home page

Published Sun, Jul 8 2018 12:14 PM | Last Updated on Sun, Jul 8 2018 12:18 PM

Maruthi Presents Brand Babu Title Poster - Sakshi

ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న బ్రాండ్‌ బాబు సినిమా టైటిల్‌ పోస్టర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్‌.

యూత్‌ ఫుల్‌ ఎంటర్‌టైనర్‌లతో ఆకట్టుకుంటున్న యువ దర్శకుడు మారుతి మార్క్‌తో రిలీజ్ అవుతున్న మరో మూవీ బ్రాండ్‌ బాబు. మారుతి స్వయంగా కథ అందిస్తూ సమర్పిస్తున్న ఈ సినిమాతో కన్నడ నటుడు సుమంత్‌ శైలేంద్ర తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా టైటిల్‌ పోస్టర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్‌.

బుల్లితెర స్టార్‌ యాంకర్‌ పీ ప్రభాకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఈషా రెబ్బా హీరోయిన్‌గా నటిస్తుండగా మురళీశర్మ మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. జెబీ సంగీతమందిస్తున్నారు. మారుతి మార్క్‌కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై శైలేంద్ర బాబు నిర్మిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement