Brand Babu Movie Review, in Telugu | ‘బ్రాండ్‌ బాబు’ మూవీ రివ్యూ - Sakshi
Sakshi News home page

Published Thu, Aug 2 2018 3:01 PM | Last Updated on Fri, Aug 3 2018 10:57 AM

Brand Babu Telugu Movie Review - Sakshi

టైటిల్ : బ్రాండ్‌ బాబు
జానర్ : కామెడీ ఎంటర్‌టైనర్‌
తారాగణం : సుమంత్‌ శైలేంద్ర, ఈషా రెబ్బ, మురళీ శర్మ, పూజిత పొన్నాడ
సంగీతం : జెబి
రచన : మారుతి
దర్శకత్వం : ప్రభాకర్ పి
నిర్మాత : శైలేంద్ర బాబు

దర్శకుడిగా వరుస విజయాలు సాధిస్తున్న మారుతి, కథ రచయితగానూ అదే జోరు చూపిస్తున్నాడు. తాను స్వయంగా దర్శకత్వం వహించకపోయినా కథ అందిస్తూ తన మార్క్ చూపిస్తున్నాడు. అలా మారుతి మార్క్‌ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా బ్రాండ్ బాబు.. కన్నడ నటుడు సుమంత్ శైలేంద్రను హీరోగా తెలుగు తెరకు పరిచయం చేస్తూ తెరకెక్కించిన ఈ సినిమాకు ప్రభాకర్ దర్శకుడు. బుల్లి తెర స్టార్‌గా పేరు తెచ్చుకున్న ప్రభాకర్‌ దర్శకుడిగా తొలి ప్రయత్నం ‘నెక్ట్స్‌ నువ్వే’తో నిరాశపరిచాడు. రెండో ప్రయత్నంగా తెరకెక్కించిన బ్రాండ్‌ బాబుతో ఆకట్టుకున్నారా..? డిఫరెంట్‌ క్యారెక్టర్‌లో తెలుగు తెరకు పరిచయం అయిన సుమంత్‌ శైలేంద్ర మెప్పించాడా..?

కథ:
డబ్బున్న వాళ్లు తప్ప పేదవాళ్లు, మధ్యతరగతి వాళ్లు మనుషులే కాదన్న మనస్తత్వం ఉన్న రత్నం (మురళీ శర్మ) తన కొడుకును కూడా తన ఆలోచనలకు తగ్గట్టుగానే పెంచుతాడు. వస్తువుల దగ్గరనుంచి అలవాట్ల వరకు ప్రతీది బ్రాండ్‌దే అయ్యుండాలన్న పిచ్చిలో పెరిగిన డైమండ్‌(సుమంత్‌ శైలేంద్ర), తన బ్రాండ్‌ వ్యాల్యూ పెంచే అమ్మాయిని ప్రేమించి పెళ్లి  చేసుకోవాలనుకుంటాడు. అదే ప్రయత్నాల్లో భాగంగా హోం మినిస్టర్‌ కూతురు అనుకొని ఆ ఇంట్లో పనిచేసే రాధ(ఈషా రెబ్బ) అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. (సాక్షి రివ్యూస్‌) తరువాత తను పేదింటి అమ్మాయి అని తెలియడంతో ఆమెకు దూరమవుతాడు. తరువాత వారిద్దరు తిరిగి ఎలా ఒక్కటయ్యారు..? బ్రాండ్ పిచ్చి నుంచి డైమండ్‌ బాబు అతని తండ్రి రత్నం ఎలా బయట పడ్డారు..? అన్నదే మిగతా కథ.


నటీనటులు :
బ్రాండ్‌ బాబుగా తెలుగు తెరకు పరిచయం అయిన సుమంత్ శైలేంద్ర మంచి నటన కనబరిచాడు. రిచ్‌ ఫ్యామిలీ వారసుడిగా పొగరు, యాటిట్యూడ్‌ ఉన్న పాత్రలో ఒదిగిపోయాడు. క్లైమాక్స్‌, ప్రీ క్లైమాక్స్‌లో సన్నివేశాల్లో ఎమోషన్స్‌ కూడా బాగానే పండించాడు. పేదింటి అమ్మాయి పాత్రలో ఈషా రెబ్బ  సరిగ్గా సరిపోయింది. అందం అభినయం రెండింటిలోనూ మంచి మార్కులు సాధించింది. నెగటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో మురళీ శర్మ సూపర్బ్ అనిపించారు.(సాక్షి రివ్యూస్‌) చాలా రోజులుగా రొటీన్ పాత్రల్లో కనిపిస్తున్న మురళీ శర్మకు బ్రాండ్‌ బాబులో కాస్త కొత్తగా నటించే అవకాశం దక్కింది.  అక్కడక్కడా కాస్త అతి చేసినట్టుగా అనిపించినా.. ఓవరాల్‌గా మరోసారి కీలక పాత్రలో మురళీ శర్మ సినిమాకు ప్లస్‌ అయ్యారు. ఇతర పాత్రల్లో పూజిత పొన్నాడా, రాజా రవీంద్ర, వేణు తమ పాత్రలకు న్యాయం చేశారు.


విశ్లేషణ :
దర్శకుడిగా ఫుల్‌ ఫాంలో ఉన్న మారుతి రచయితగానూ సత్తా చాటాడు. తన మార్క్ కథా కథనాలతో సినిమాను వినోదాత్మకంగా మలిచాడు. బుల్లితెర మీద స్టార్‌ ఇమేజ్‌ అందుకున్న ప్రభాకర్‌ నెక్ట్స్‌ నువ్వే సినిమాతో దర్శకుడిగా సిల్వర్‌ స్క్రీన్‌ ఎంట్రీ ఇచ్చారు. రెండో ప్రయత్నంగా మారుతి బ్రాండ్‌తో బ్రాండ్ బాబు సినిమాను తెరకెక్కించారు. ప్రభాకర్‌ దర్శకత్వంలో తెరకెక్కినా సినిమాలో ఎక్కువగా మారుతి మార్క్‌ సీన్సే కనిపిస్తాయి. దర్శకుడిగా ప్రభాకర్‌ తన మార్క్‌ చూపించలేకపోయాడు. కామెడీ పరంగా సినిమా బాగానే అలరిస్తుంది. ముఖ్యంగా సెకండ్‌ హాఫ్‌లో వచ్చే కామెడీ సీన్స్‌ కడుపుబ్బా నవ్విస్తాయి. సంపన్న కుటుంబాల్లోని వ్యక్తులు తమ ఎమోషన్స్‌ను దాచుకొని బయటికి ఎలా నటిస్తోరో, ఎలా ప్రవర్తిస్తారో చూపించిన సీన్స్‌ ఆకట్టుకుంటాయి. కొన్నిసీన్స్‌ అంత కన్విన్సింగ్‌గా అనిపించవు. (సాక్షి రివ్యూస్‌)హీరోకు హీరోయిన్‌ మీద ప్రేమ కలగడానికి, అతనిలో మార్పు రావడానికి బలమైన కారణం ఏమీ కనిపించదు.  జెబీ సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్ సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. హీరో సొంత బ్యానర్‌ కావటంతో ఖర్చుకు ఏ మాత్రం వెనకాడకుండా సినిమాను తెరకెక్కించారు. సుమంత్‌ శైలేంద్రను టాలీవుడ్ కు పరిచయం చేసేందుకు భారీగానే ఖర‍్చు పెట్టారు.

ప్లస్ పాయింట్స్‌ :
కామెడీ
మురళీ శర్మ నటన
ప్రొడక్షన్‌ వ్యాల్యూస్‌

మైనస్‌ పాయింట్స్‌ :
పాటలు
ఎడిటింగ్‌
సెకం‍డ్‌ హాఫ్‌

- సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్‌నెట్‌ డెస్క్‌.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement