ఈషా రెబ్బా, నాగ చైతన్య, సుమంత్ శైలేంద్ర, ప్రభాకర్
‘బ్రాండ్ బాబు’ ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. మారుతిగారి కామెడీ టైమింగ్ చాలా చోట్ల కనిపించింది. ప్రభాకర్ దర్శకత్వ ప్రతిభ తెలుస్తోంది. తెలుగు ఇండస్ట్రీలోకి సుమంత్ శైలేంద్రకు స్వాగతం పలుకుతున్నా. సుమంత్, ఈషా రెబ్బాకు ఈ చిత్రం మంచి హిట్ తీసుకురావాలి’’ అని హీరో నాగచైతన్య అన్నారు. సుమంత్ శైలేంద్ర, ఈషా రెబ్బా, పూజిత పొన్నాడ హీరో హీరోయిన్లుగా ప్రభాకర్ పి. దర్శకత్వంలో ఎస్. శైలేంద్ర నిర్మించిన చిత్రం ‘బ్రాండ్ బాబు’.
డైరెక్టర్ మారుతి కథ అందించడంతో పాటు సమర్పకుడిగా వ్యవహరించిన ఈ చిత్రం ఆగస్టు 3న విడుదలవుతోంది. ఈ సినిమా ట్రైలర్‌ని నాగచైతన్య విడుదల చేశారు. ప్రభాకర్ మాట్లాడుతూ– ‘‘మా సినిమా ట్రైలర్ నాగచైతన్యకు నచ్చడం సంతోషంగా ఉంది. వినోదాత్మకంగా తెరకెక్కించిన చిత్రమిది’’ అన్నారు. ‘‘మా సినిమా ట్రైలర్ విడుదల చేసినందుకు నాగచైతన్యగారికి థ్యాంక్స్’’ అన్నారు ఈషా రెబ్బా. ఈ చిత్రానికి సంగీతం: జేబి, కెమెరా: కార్తీక్ ఫలని.
Comments
Please login to add a commentAdd a comment