మారుతి స్టైల్లో ‘బ్రాండ్‌ బాబు’ | Maruthi Brand Babu Movie First Look Released | Sakshi
Sakshi News home page

Published Sun, Jul 8 2018 7:02 PM | Last Updated on Thu, Sep 27 2018 8:49 PM

Maruthi Brand Babu Movie First Look Released - Sakshi

డైరెక్టర్‌ మారుతి నుంచి మరో సినిమా రాబోతోంది. అయితే దర్శకుడిగా మాత్రం కాదు. తాను అందించిన కథతో తెరకెక్కుతున్న బ్రాండ్‌ బాబు సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. పోస్టర్‌లోనే ఇది మారుతి మార్క్‌ సినిమాగా కనిపిస్తోంది. 

బ్రాండ్‌ బాబు-పనిమనిషి ప్రేమ అన్నట్టు రిలీజ్‌ చేసిన ఈ పోస్టర్‌ ఆకట్టుకుంటోంది. బ్రాండ్‌ బాబుగా సుమంత్‌ శైలేంద్ర నటించగా, పనిమనిషిగా ఈషా రెబ్బ నటిస్తోంది. బ్రాండ్‌ బాబు తండ్రిగా మురళీ శర్మ నటిస్తోన్నట్లు తెలుస్తోంది. శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్‌పై తెరకెక్కుతున్న ఈ మూవీకి జేబి సంగీతాన్ని అందించగా, శైలేంద్ర బాబు నిర్మిస్తున్నారు. త్వరలోనే టీజర్‌ విడుదల కానుంది. ప్రస్తుతం మారుతి నాగచైతన్యతో శైలజా రెడ్డి అల్లుడు సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement