
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఘోరంగా ఉందని, ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్ పేర్కొన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు వెంటనే అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను నిర్వహించాలని డిమాండ్ చేశారు. బీజేపీ కార్యాలయంలో ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. ఆరు నెలలుగా పరిస్థితి దారుణంగా ఉందని, ఆరోగ్యశ్రీ చెల్లింపులు ఆగిపోయాయాన్నరు. ఏసీడీపీ నిధుల్లోనూ కోత పెట్టారని, కొత్త పథకాల కారణంగా పాత పథకాలు మందగించాయన్నారు. పెన్షన్లు, షాదీ ముబారక్ చెల్లింపులు ఆగిపోయాయన్నారు. వాటన్నింటిపై అసెంబ్లీలో చర్చించేందుకు సమావేశాలు నిర్వహించాలన్నారు. సీపీఐ నేత నారాయణ రామాయణాన్ని విమర్శించారని, దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలని ఆయన అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment